For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

అఫ్గాన్‌పై గెలుపు దక్కకపోవడంతో కన్నీరుగార్చిన చిన్నారి

Young India fan fails to hold back tears after tie against Afghanistan

న్యూ ఢిల్లీ: ఆసియాకప్‌లో భాగంగా మంగళవారం భారత్Xఅఫ్గాన్‌కు మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు ఊహించని ఫలితం. అయితే భారత్‌పై గంపెడాశలు పెట్టుకున్న అభిమానులు కేవలం టై కావడం అనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఈ క్రమంలోనే స్టేడియలోకి మ్యాచ్ చూసేందుకు వచ్చిన ఓ చిన్నారి అభిమాని కన్నీటి పర్యంతమైయ్యాడు.

అతనితో పాటుగా స్టేడియంకు వచ్చిన అతని తండ్రి ఓదారుస్తుండగా కెమెరా కన్ను వారిపై పడింది. టీమిండియా విజయం పట్ల వారికి నిరాశే మిగిలిందన్న విషయం ఆ దృశ్యంలో కనబడుతుండటంతో ఇప్పుడా ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ మ్యాచ్‌లో మరో ప్రత్యేకం ధోనీ తన కెరీర్‌లో 200వ వన్డేకు కెప్టెన్సీ వహించడం. దీనిపై స్పందించిన ధోనీ. 'విధి రాతని నమ్మనని కాను. కొన్ని విషయాల్లో తప్పదు.'అని అభిప్రాయపడ్డాడు.

అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో విజయం ఖాయం అనుకున్నా.. మ్యాచ్‌ అనూహ్యంగా టైగా ముగిసింది. రాయుడు, రాహుల్‌ మెరిసినా 253 పరుగుల ఛేదనలో భారత్‌ 49.5 ఓవర్లలో 252 పరుగులకే ఆలౌటైంది. మొదట బ్యాటింగ్‌ చేసిన అఫ్గాన్‌ జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు చేసింది. ఛేదనలో భారత్‌కు రాహుల్‌, రాయుడు మెరుపు ఆరంభాన్నిచ్చారు.

ఓపెనర్‌గా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందొచ్చిన రాయుడు సిక్స్‌లతో చెలరేగాడు. రాహుల్‌ 55 బంతుల్లో అర్ధసెంచరీ సాధిస్తే.. రాయుడు 43 బంతుల్లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. అదే జోరులో మరో భారీ షాట్‌కు వెళ్లిన రాయుడు క్యాచ్‌ ఔట్‌ అయ్యాడు. కాసేపటికే రాహుల్‌ కూడా అతణ్ని అనుసరించాడు. వీళ్లిద్దరు ఔటయ్యాక భారత రన్‌రేట్‌ తగ్గింది. దీనికి తోడు ధోని (8), పాండే (8), జాదవ్‌ (19) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. కీలక సమయంలో కార్తీక్‌ (44) ఔట్‌ కావడంలో ఉత్కంఠ పెరిగిపోయింది. చివరికి మ్యాచ్‌ టై అయింది.

Story first published: Wednesday, September 26, 2018, 14:02 [IST]
Other articles published on Sep 26, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+