For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Yashasvi Jaiswal: సాయంత్రం పానీ పూరి అమ్మడం.. ఉదయం ప్రాక్టీస్.. ఇది జైస్వాల్ కథ..

జీవితం సాఫీగా సాగుతున్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తోంది మన సత్తా ఏంటో. బాధలు, అవమానాలు ఎదుర్కొని ముందుకెళ్లినవాడే విజయం సాధిస్తాడు. మనిషిలో కష్టాలు కసిని పెంచుతాయి. ఏదైనా సాధించాలనే పట్టుదలకు బీజం వేస్తాయి. ఈ క్రమంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా ముందుకెళ్తుంటారు. చివరికి అనుకున్నది సాధిస్తారు. ఇలా కష్టపడి ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన వారు ఎంతో మంది ఉన్నారు. అందులో యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్ ఒకడు.

పానీ పూరి అమ్మిన అతడు ఈ రోజు కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్నాడు. అనుకున్నది సాధించాలనే పట్టుదల ఉంటే పేదరికం అడ్డు కాదని మరోసారి నిరూపించాడు జైస్వాల్. ఉత్తరప్రదేశ్ లోని సూర్యవాన్ అనే చిన్న గ్రామంలో ఉపేంద్ర జైస్వాల్ ఆయన భార్య కంచన్ జైస్వాల్ ఇద్దరు కలిసి చిన్న దుకాణం నడుపుకుంటున్నారు. వీరికి నాల్గోవ సంతానంగా యశస్వి జైస్వాల్ జన్మించాడు. అతను 2001 డిసెంబర్ 28న జన్మించాడు. యశస్వికి ఐదుగురు తోబుట్టువులు ఉన్నారు.

Young cricketer Yashasvi Jaiswal became a cricketer by selling Pani Puri

ఆరుగురు సంతానం కావడంతో అతని తండ్రికి కుటుంబాన్ని పోషించడం కష్టంగా మారింది. ఆర్థిక ఇబ్బందులు పడే వారు. ఈ క్రమంలోనే యశస్వి క్రికెట్ పై ఇష్టం పెంచుకున్నాడు. చిన్నతనంలో గల్లీల్లో క్రికెట్ ఆడేవాడు. పాఠశాల ముగియగానే మైదానానికి వెళ్లి బ్యాట్ పట్టేవాడు. ఈ క్రమంలోనే తను క్రికెటర్ కావాలని నిర్ణయించుకున్నాడు. కానీ అతనికి ఆర్థిక పరిస్థితులు సహకరించలేదు. పైగా అక్కడే క్రికెట్ నేర్పించే కోచ్ లు కూడా అందుబాటులో లేడు. దీంతో జైస్వాల్ ముంబై వెళ్లాలని నిర్ణయించుకుని ఈ విషయాన్ని తండ్రితో చెప్పాడు.

అప్పటికే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఉపేంద్ర జైస్వాల్ మొదట యశస్విని ముంబై పంపడానికి ఒప్పుకోలేదు. కానీ తన కొడుకులో ఉన్న పట్టుదలను చూసి ముంబై పంపించాలనుకున్నాడు. ముంబైలో ఉన్న తన తమ్ముడి దగ్గరికి జైస్వాల్ ను పంపించాడు. అయితే ఉపేంద్ర జైస్వాల్ తమ్ముడు కూడా పేదరికమే అనుభవిస్తున్నాడు. అతను ఓ గుడెసెలో నివాసం ఉండేవాడు. యశస్వి అక్కడి వెళ్లడంతో ఒకే గుడెసెలో ఉండడం ఇబ్బందిగా మారింది. తినడానికి తిండి కూడా సరిగా దొరికేది కాదు.

దీంతో జైస్వాల్ ను అతని బాబాయ్ ఓ డెయిరీలో పనికి పెట్టాడు. జైస్వాల్ ఉదయం డెయిరీలో పని చేసి సాయంత్రం క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడు. అయితే ఒక రోజు సమయానికి రాలేదని జైస్వాల్ ను డెయిరీ ఓనర్ పనిలోంచి తీసేశాడు. దీంతో యశస్వి జైస్వాల్ కట్టు బట్టలతో ఆజాదీ మైదానానికి వెళ్లాడు. క్రికెట్ కిట్, కట్టుబట్టలతో జైస్వాల్ చూసిన ఓ వ్యక్తి మైదానంలోని గూడారంలో ఉండడానికి చోటు ఇచ్చాడు. ఆ తర్వాత జైస్వాల్ ఓ పానీ పూరి బండి వద్ద పనికి కుదిరాడు. సాయంత్రం పానీ పూరి అమ్మేవాడు. ఉదయం క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడు.

Young cricketer Yashasvi Jaiswal became a cricketer by selling Pani Puri


అతను రోజు ప్రాక్టీస్ చేయడం గమనించాడు జ్వాలా సింగ్ అనే కోచ్.. జైస్వాల్ లోని ప్రతిభను గుర్తించిన అతను దేవుడిలో యశస్వి జీవితంలోకి వచ్చాడు. జైస్వాల్ క్రికెటర్ ను చేసే బాధ్యత తీసుకున్నాడు. ఉండడానికి చోటు కల్పించాడు. ఆ తర్వాత జైస్వాల్ ప్రాక్టీస్ చేస్తూ.. ముంబై అండర్-19కు సెలక్ట్ అయ్యాడు. 2018 అండర్-19 ఆసియా కప్ జట్టు చోటు దక్కించుకున్నాడు. ఈ టోర్నమెంట్ అతని జీవితంలో కీలక మలుపుగా మారింది. ఈ టోర్నమెంట్ లో అతను 318 పరుగులు చేశాడు.

మ్యాన్ ఆఫ్ ద సిరీస్ గా నిలవడంతో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత 2019న చత్తీస్‌గఢ్‌తో జరిగిన రంజీ ట్రోఫీలో ముంబై తరఫున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. 2020 ఐపీఎల్ వేలంలో యశస్వి జైస్వాల్ అన్‌క్యాప్డ్ జాబితాలోకి వచ్చాడు. యశస్వి జైస్వాల్ ను రాజస్థాన్ రాయల్స్ రూ.2.4 కోట్లకు కొనుగోలు చేసింది.ఐపీఎల్ 2023 వేలంలో రాజస్థాన్ రాయల్స్ యశస్వి జైస్వాల్ ను రూ.4 కోట్లకు మరోసారి కొనుగోలు చేసింది. యశస్వి జైస్వాల్ కేవలం 13 బంతుల్లోనే ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగవంతమైన అర్ధశతకం కూడా చేశాడు. ఆ తర్వాత జైస్వాల్ 2023 జులైలో టెస్ట్ జట్టుకు ఎంపికయ్యాడు.

వెస్టిండీస్ తో టెస్ట్ ఆడాడు. అదే ఏడాది ఆగస్ట్ లో వెసిండీస్ తో టీ20 మ్యాచ్ లో కూడా అరంగేట్రం చేశాడు. జైస్వాల్ 15 టెస్ట్ ల్లో నాలుగు సెంచరీలు, 8 ఆఫ్ సెంచరీలు చేశాడు. 23 టీ20ల్లో ఒక సెంచరీ, ఐదు ఆఫ్ సెంచరీలు చేశాడు. కాగా జైస్వాల్ తాజాగా ఆస్ట్రేలియాపై అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. యశస్వి జైస్వాల్ జీవితం నిజంగా ఆదర్శం. అతను కష్టల కడలి నుంచి విజయాల తీరానికి చేరాడు. అతను ఇలాగే ముందుకెళ్లాలని కోరుకుంటుంది మైఖేల్ తెలుగు, వన్ ఇండియా తెలుగు.

Story first published: Wednesday, November 27, 2024, 12:33 [IST]
Other articles published on Nov 27, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+