పాండ్యాతో పోల్చుకున్న ఆల్‌రౌండర్.. ‘నేనూ ఆ పని చేస్తా’ అంటూ బోల్డ్ స్టేట్‌మెంట్!

ప్రస్తుతం టీమిండియా పరిమిత ఓవర్ల జట్టులో మూలస్తంభంలా మారిన ఆటగాడు హార్దిక్ పాండ్యా. పేసర్లతో సమానంగా వేగంతోపాటు తెలివిగా బౌలింగ్ వేయడంతోపాటు, బ్యాటుతోనూ రాణిస్తున్న అతను టీమిండియాకు అతిపెద్ద ఆస్తిగా మారాడు. ముఖ్యంగా గాయం నుంచి కోలుకున్న తర్వాత అతని ఆటతీరు మరో స్థాయికి చేరింది. ఇప్పుడు మరో ఆల్‌రౌండర్ తను కూడా పాండ్యాలా సత్తా చాటుతానని, తనకు ఆ సామర్ధ్యం ఉందని అంటున్నాడు. అతనెవరో కాదు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ పేసర్ దీపక్ చాహర్.

వరల్డ్ కప్ టార్గెట్..
గాయం కారణంగా గతేడాది ఆగస్టు నుంచి చాహర్ ఆటకు దూరంగా ఉంటున్నాడు. చాలా గ్యాప్ తర్వాత టీమిండియాలో పునరాగమనం చేసిన అతను మళ్లీ గాయాలతో జట్టుకు దూరమయ్యాడు. అయితే ఫిట్‌నెస్ సాధించిన తర్వాత మళ్లీ టీమిండియాలో చోటు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్‌లో ఎలాగైనా ఆడాలని పట్టుదలగా ఉన్నాడీ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఈ క్రమంలో జట్టులో సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలో తనకు తెలుసునని చెప్పాడు.

అదే నా లక్ష్యం..
'ఈ ప్రాసెస్ చాలా సింపుల్. నేను టీమిండియాకు ఆడటానికి ముందు కూడా ఇదే పద్ధతిని పాటించేవాడిని. ఇప్పుడూ అదే చేస్తున్నా. నేను మా రాష్ట్రం తరఫున ఆడేటప్పుడు సరిగా రాణించని సమయంలో కూడా ఎప్పటికైనా భారత్‌కు ఆడతాననే చెప్పేవాడిని. నా టీంమేట్స్ నవ్వేవాళ్లు. అప్పుడు కూడా నేను నమ్మింది ఒకటే. నేను కనుక 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తూ, బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తే బ్యాటర్లను అవుట్ చేయడం అంత కష్టమైన పనేం కాదు. అదే సమయంలో కొంచెం బ్యాటింగ్ కూడా చేశానంటే కచ్చితంగా టీమిండియాలో చోటు దక్కుతుంది' అని చాహర్ ధీమా వ్యక్తం చేశాడు.

ఎప్పటికైనా సాధిస్తా..
ఇప్పుడు కాకపోతే 10-15 సంవత్సరాల తర్వాతైనా సరే ఆ స్థాయికి చేరాలనేదే తన కోరిక అని చాహర్ అన్నాడు. ఆ స్థాయికి చేరి మంచి ప్రదర్శన చేస్తే ఆటోమేటిక్‌గా తను సెలెక్ట్ అవుతానని చెప్పాడు. ఇప్పుడు కూడా తను అదే చెయ్యడానికి ప్రయత్నిస్తున్నానని, 140 కిలోమీటర్ల వేగంతో బంతిని రెండు వైపులా స్వింగ్ చేయడంతోపాటు బ్యాటుతోనూ రాణించడానికి ట్రై చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. వాస్తవానికి చాహర్ ఇప్పుడు కూడా బాగానే బౌలింగ్ చేస్తున్నాడు.

మరో పాండ్యా అవుతాడా?
అంత వేగం లేకపోయినా మంచి స్వింగ్‌తో పవర్‌ప్లేలో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగలడు. అలాగే 2021 జూలైలో ఓడిపోయే మ్యాచులో భారత్‌ను గెలిపించి, తనలో మంచి బ్యాటర్ కూడా ఉన్నాడని నిరూపించుకున్నాడు. ఆ తర్వాత సౌతాఫ్రికాపై కూడా రాణించాడు. ప్రస్తుతం జట్టులో హార్దిక్ ఎంత కీలకమో చూసిన తర్వాత.. తను కూడా సరిగ్గా రాణిస్తే జట్టులో చోటు దక్కించుకోవడమే కాదు, తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటానని ధీమాగా ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications