Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

నువ్వు మా అందరికీ పెదన్నవి.. నువ్వు ఎప్పటికీ నాకు కెప్టెన్‌వే

Virat Kohli’s Heartfelt Message For MS Dhoni || Oneindia Telugu
You Will Always Be My Captain says Indian Captain Virat Kohli, Touching Tribute To MS Dhoni On His Birthday

భారత్‌ మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనీ ఆదివారం 38వ పడిలోకి ప్రవేశించాడు. ధోనీ పుట్టినరోజు సందర్భంగా ట్విటర్‌లో శుభాకాంక్షల వర్షం కురిసింది. ప్రపంచకప్‌ వేటలో ఉన్న విరాట్‌ సేనతో పాటు, మాజీలు, దిగ్గజ క్రికెటర్లు ధోనీలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ధోనీ పుట్టినరోజు సందర్భంగా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్విటర్‌లో శుభాకాంక్షలు తెలిపాడు.

ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం

ఎప్పటికీ నాకు కెప్టెన్‌వే:

పుట్టినరోజు శుభాకాంక్షలు మహీ భాయ్‌. జీవితంలో కొంత మంది మాత్రమే నమ్మకం, గౌరవం అనే పదాలకు అర్థం తెలుసుకుంటారు. చాలా సంవత్సరాలుగా నీతో స్నేహంగా ఉన్నందుకు సంతోషంగా ఉన్నా. నువ్వు మా అందరికీ పెదన్నవి. గతంలోనూ చెప్పినట్టే.. నువ్వు ఎప్పటికీ నాకు కెప్టెన్‌వే' అంటూ కోహ్లీ ట్వీటాడు.

జీవాతో చిందులు:

ధోనీ భార్య సాక్షి, కుమార్తె జీవాలు శనివారం రాత్రి ధోనీతో కేక్‌ కటింగ్‌ చేపించారు. అనంతరం కేక్‌ క్రీమ్‌ పూసుకున్న ముఖంతో ధోనీ జీవాతో కలిసి చిందులు వేశాడు. సాక్షి, జీవాలతో పాటు పలువురు క్రికెటర్లు ధోనీ పుట్టినరోజు వేడుకలో పాల్గొన్నారు. వారి సమక్షంలో కేక్‌ కట్‌ చేసిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పంచుకుంది. ఈ వీడియోను అభిమానులు షేర్లు చేస్తూ.. లైక్‌లు కొట్టారు. ‘హ్యాపీ బర్త్‌డే ధోనీ' అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

ఆల్‌ ది బెస్ట్‌:

భారత దిగ్గజం సచిన్ ట్వీట్‌ చేస్తూ... 'జన్నదిన శుభాకాంక్షలు. నీకు ఈ ఏడాది శుభం కలగాలని కోరుకుంటున్నా. సెమీస్‌, ఫైనల్‌ మ్యాచ్‌లకు ఆల్‌ ది బెస్ట్‌' అని పేర్కొన్నాడు. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ, సురేశ్‌ రైనా, హర్భజన్ సింగ్, వీవీఎస్ లక్ష్మణ్, ఆకాశ్ చోప్రా, మహమ్మద్ కైఫ్ సహా టీమ్‌ఇండియా ఆటగాళ్లు ధోనీకి శుభాకాంక్షలు చెప్పారు.

సెహ్వాగ్‌ వినూత్న ట్వీట్:

మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్‌ వినూత్నంగా ట్వీట్ చేసాడు. '7 ఖండాలు, 7 రోజులు, హరివిల్లులోని 7 రంగులు, 7 సంగీత స్వరాలు, పెళ్లిలో 7 అడుగులు, 7 వింతలు, ఏడో నెలలో ఏడో తేదీన పుట్టిన క్రికెటర్ అద్భుతం. ధోనీకి 'జన్నదిన శుభాకాంక్షలు' అని ట్వీట్‌ చేశాడు. వీరూ చెప్పిన బర్త్‌డే విషెస్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది.

Story first published: Monday, July 8, 2019, 10:24 [IST]
Other articles published on Jul 8, 2019
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+