న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

మంచి ఫలితాలను అందించినందుకే: రెండోసారి కోచ్‌గా రవిశాస్త్రి పొడిగింపుపై గంగూలీ

 You perform, you continue or somebody else will take over: Sourav Ganguly on Ravi Shastri

హైదరాబాద్: జట్టుకు మంచి ఫలితాలను అందించినందుకే హెడ్ కోచ్‌గా రవిశాస్త్రికి పొడిగింపు లభించిందని బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ ఇండియా (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు. జట్టు సరైన ప్రదర్శన ఇవ్వకపోతే అతడి స్థానంలో మరొకరు బాధ్యతలు స్వీకరిస్తారని దాదా పేర్కొన్నాడు.

ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో పాల్గొన్న సౌరవ్ గంగూలీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది ఆగస్టులో టీమిండియా వెస్టిండిస్ పర్యటన తర్వాత కోచ్‌గా రవిశాస్త్రి పదవీకాలం ముగిసింది. అయితే, కపిల్ దేవ్ నాయకత్వంలోని క్రికెట్ సలహా కమిటీ పలువురికి ఇంటర్యూలు నిర్వహించి చివరకు కోచ్‌గా రవిశాస్త్రికే పట్టం కట్టింది.

థాంక్స్‌తో ధోని సేవలకు ముగింపు చెప్పలేం: ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో గంగూలీథాంక్స్‌తో ధోని సేవలకు ముగింపు చెప్పలేం: ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో గంగూలీ

రెండేళ్ల పాటు పొడిగింపు

రెండేళ్ల పాటు పొడిగింపు

దీంతో రవిశాస్త్రికి హెడ్ కోచ్‌గా రెండేళ్ల పాటు పొడిగింపు లభించింది. అయితే, బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఎన్నికైన తరువాత అప్పట్లో రవిశాస్త్రి పదవి ఊడిపోతుందంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు కూడా పెట్టారు. దీనిపై తాజాగా గంగూలీ స్పందించాడు.

అవి ఊహాగానాలు

అవి ఊహాగానాలు

"అందుకే అవి ఊహాగానాలు. దీనికి నా దగ్గర సమాధానం లేదు. ఇది చాలా సులభం. ఇది పనితీరుకు సంబంధించిన విషయం. మీరు మంచి ప్రదర్శన చేశారనుకుంటే కొనసాగించబడతారు లేకపోతే మరొకరు మన స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. ఇదొక సింపుల్ ఫార్ములా" సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు.

2021లో జరిగే టీ20 ప్రపంచకప్‌ వరకు

2021లో జరిగే టీ20 ప్రపంచకప్‌ వరకు

రెండోసారి హెడ్ కోచ్‌గా ఎంపికైన రవిశాస్త్రి 2021లో జరిగే టీ20 ప్రపంచకప్‌ వరకూ ఆ పదవిలో ఉంటాడు. రెండోసారి కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రవిశాస్త్రి జీతాన్ని బీసీసీఐ మరో 20 శాతం పెంచింది. రవిశాస్త్రి‌కి ప్రస్తుతం ఏడాదికి రూ. 9.5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల మధ్య జీతాన్ని బీసీసీఐ చెల్లిస్తోంది.

రవిశాస్త్రి ప్రయాణం గొప్పగా ఉంది

రవిశాస్త్రి ప్రయాణం గొప్పగా ఉంది

తాజాగా 20 శాతం పెంచడంతో గతంలో కంటే అతని జీతం దాదాపు రూ. 1.5 కోట్ల మేర పెరిగింది. వన్డే ప్రపంచకప్‌ ఓటమి నేపథ్యంలో రవిశాస్త్రిపై వేటు పడుతుందని అంతా ఊహించారు. కానీ.. బీసీసీఐ మళ్లీ అతడికే పట్టం కట్టింది. భారత క్రికెట్ జట్టుతో రవిశాస్త్రి ప్రయాణం గొప్పగా ఉంది.

360 పాయింట్లతో అగ్రస్థానంలో టీమిండియా

360 పాయింట్లతో అగ్రస్థానంలో టీమిండియా

ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ ప్రస్తుతం 360 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియాను అధిగమించి స్వదేశంలో వరుసగా 12 టెస్ట్ సిరీస్‌లను సొంతం చేసుకుంది. బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాపై పూర్తి ఆధిపత్యం చెలాయించి సిరీస్‌లను నెగ్గింది. అంతకుముందు వెస్టిండీస్‌ను 2-0తో ఓడించింది.

Story first published: Friday, December 6, 2019, 16:07 [IST]
Other articles published on Dec 6, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X