మోడీజీ-ఇమ్రాన్ ఖాన్‌ను అడగండి: భారత్-పాక్ ద్వైపాక్షిక సిరిస్‌పై గంగూలీ

హైదరాబాద్: భారత్-పాక్‌ల మధ్య ద్వైపాక్షిక సిరిస్‌లు జరగాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అక్టోబర్ 23న బాధ్యలు చేపట్టనున్నాడు. ఈ నేపథ్యంలో గంగూలీ తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా వెల్లడిస్తున్నాడు.
తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న గంగూలీకి భారత్-పాక్ దేశాల మధ్య ద్వైపాక్షిక సిరిస్‌లకు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. ఈ ప్రశ్నకు గంగూలీ మాట్లాడుతూ "ఈ ప్రశ్న మీరు మోడీజీ, పాక్ ప్రధాన మంత్రిని అడగాలి" అని అన్నాడు. అంతేకాదు దాయాదుల మధ్య ద్వైపాక్షిక సిరిస్ జరగాలంటే ఇరు దేశాల ప్రధానుల అనుమతి అవసరమని దాదా అన్నాడు.

అనుమతి తీసుకోవాల్సిందే
"తప్పకుండా అనుమతి తీసుకోవాల్సిందే. ఎందుకంటే అంతర్జాతీయ పర్యటనలు అన్నీ ప్రభుత్వ అనుమతులతోనే కొనసాగుతాయి. అందుకే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు" అని గంగూలీ చెప్పుకొచ్చాడు. చివరగా ఈ రెండు దేశాలు 2012లో రెండు టీ20లు, 3 వన్డేల సిరిస్‌లో తలపడ్డాయి.

అక్టోబర్ 23న బాధ్యలు
బీసీసీఐ నూతన అధ్యక్షుడిగా టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అక్టోబర్ 23న బాధ్యలు చేపట్టనున్నాడు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్(క్యాబ్) అధ్యక్షుడి హోదాలో సోమవారం దాదా తన నామినేషన్ పత్రాలను సమర్పించి సంగతి తెలిసిందే. అధ్యక్ష బరిలో గంగూలీ ఒక్కడే పోటీ చేస్తుండటంతో అతడి ఎన్నిక లాంఛనమే.

సెప్టెంబర్ 2020 వరకు పదవిలో
అక్టోబర్ 23న గంగూలీ ఎన్నికైనట్లు అధికారికంగా ప్రకటించనున్నారు. సెప్టెంబర్ 2020 వరకు దాదా ఈ పదవిలో కొనసాగనున్నాడు. 1999 కార్గిల్ యుద్ధం తర్వాత గంగూలీ నేతృత్వంలోనే టీమిండియా 2004లో పాక్‌లో చారిత్రక పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే.

వరల్డ్‌కప్ నుంచి పాక్‌ను నిషేధించాలి
ఈ ఏడాది ఫిబ్రవరిలో పుల్వామా ఉగ్రదాడి తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి. పుల్వామా ఉగ్రదాడితో ఇటీవలే ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చిన వరల్డ్‌కప్ నుంచి పాక్‌ను ఐసీసీ బ్యాన్ చేయాలని సీఓఏ కోరిన సంగతి తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications