దేశం కన్నా డబ్బుకే ప్రాధాన్యం ఇచ్చావ్!: డివిలియర్స్‌పై అక్తర్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: ఇంగ్లాండ్ వేదికగా జరుగుతున్న వరల్డ్‌కప్‌లో దక్షిణాఫ్రికా పేలవ ప్రదర్శన చేస్తోంది. ఆ జట్టు ప్రధాన పేసర్లు లుంగి ఎంగిడి, డేల్ స్టెయిన్ గాయాల కారణంగా టోర్నీకి దూరం కావడంతో ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ సఫారీలు ఓడిపోయారు. అయితే, దక్షిణాఫ్రికా ప్రస్తుతం ఉన్న పరిస్థితికి ఆ జట్టు మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్సే కారణమని పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మండిపడ్డాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
శనివారం షోయబ్ అక్తర్ విడుదల చేసిన ఓ వీడియోలో ఏబీ డివిలియర్స్‌పై తీవ్ర విమర్శలు చేశాడు. అందులో "డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేయాలనుకున్నానని, దీనికి జట్టు మేనేజ్‌మెంట్ అంగీకరించలేదని అన్నాడు. ఇది చాలా పెద్ద వార్తే... కానీ దక్షిణాఫ్రికా ఓటముల తర్వాత ఈ ప్రకటన చేయడం ఏంటి?" అని ప్రశ్నించాడు.

ఒత్తిడికి లోనుకాకుండా ఉండాలంటే
"నువ్వు(డివిలియర్స్) ఒత్తిడికి లోనుకాకుండా ఉండాలంటే ఐపీఎల్, పీఎస్‌ఎల్ వదిలి వరల్డ్‌కప్‌కి సిద్దం కావాలని చెప్పారు. కానీ, నువ్వు ఐపీఎల్, పీఎస్‌ఎల్‌కు ప్రాధాన్యత ఇస్తూ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికావు. నీ దేశం కన్నా డబ్బుకే ప్రాధాన్యతనిచ్చావు. నీవు అలా చేయాల్సింది కాదు. నీవు రిటైర్మెంట్ ప్రకటించేటప్పటికి దక్షిణాఫ్రికా జట్టు పరిస్థితి బాగాలేదు" అని అన్నాడు.

జట్టుకు నీ అవసరం ఉంది
"జట్టుకు నీ అవసరం ఉంది. డబ్బులు ఈ రోజు కాకపోతే రేపు వస్తాయి. అలాంటి డబ్బులకే ప్రాధాన్యతను ఇస్తూ వరల్డ్‌కప్‌ను విస్మరించావు. నీవు వదులుకుంది ఈ ప్రపంచకప్‌నే కాదు.. 2020 టీ20 ప్రపంచకప్ కూడా. డబ్బులు సంపాదించడాన్ని నేను తప్పుబట్టడం లేదు. కానీ అది సరైన పద్దతిలో ఉండాలని చెబుతున్నా. డబ్బుల కన్నా దేశానికి ప్రాధ్యాన్యం ఇచ్చి ఉండాల్సింది" అని మండిపడ్డాడు.
మేనేజ్‌మెంట్ తిరస్కరించింది
"నువ్వు తిరుగొస్తానన్నప్పుడు జట్టు మేనేజ్‌మెంట్ తిరస్కరించిందని చెప్పావు. వారి నిర్ణయం సరైందే. కానీ ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడటమే పద్దతి కాదు. నీ రిటైర్మెంట్ నిర్ణయానికి కట్టుబడి ఉండు. నీ దేశం గురించి మరిచిపో. నీ వల్ల నీ దేశానికి ఈ దయనీయ పరిస్థితి వచ్చింది. నువ్వే గనుక జట్టులో ఉంటే మీ మిడిలార్డర్ చాలా పటిష్టంగా ఉండేది. ఇంత చెత్త ప్రదర్శన చేసేది కాదు. దేశం కన్నా డబ్బుకే ప్రాధన్యత ఇవ్వడం విచారకరం" అని అక్తర్ మండిపడ్డాడు.

ఉన్నపళంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్
గతేడాది మే నెలలో ఏబీ డివిలియర్స్ ఉన్నపళంగా అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అలసిపోవడంతో పాటు తనలో తపన లేదంటూ ఈ సందర్భంగా డివిలియర్స్ పేర్కొన్నాడు. ఆ సందర్భంలో డివిలియర్స్ ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌కప్ వరకూ జట్టులో ఉంటే బాగుండనే అభిప్రాయాన్ని పలువురు అభిమానులు వెల్లడించారు.

ఏమనుకున్నాడో ఏమో!
అయితే, ఆ తర్వాత ఏమనుకున్నాడో ఏమో తెలియదు గానీ... ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తోన్న వరల్డ్‌కప్ కోసం దక్షిణాఫ్రికా జాతీయ జట్టులోకి రావాలని అనుకున్నాడు. ఈ విషయాన్ని గత ఏప్రిల్‌లో దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్, హెడ్ కోచ్ ఒట్టిస్ గిబ్సన్, సెలక్టర్ల కన్వీనర్ లిండా జోండిలను కలిసి మళ్లీ జట్టుకు ఆడాలని ఉందని తన మనుసులోని మాటను వెల్లడించాడు.

24 గంటల ముందే
వరల్డ్‌కప్ కోసం 15 మంది సభ్యుల బృందం ఇంగ్లాండ్‌కు పయనమవ్వడానికి ముందు 24 గంటల ముందే డివిలియర్స్ ఈ విషయాన్ని చెప్పినట్లు తాజాగా వెల్లడైంది. అయితే, డివిలియర్స్ అభ్యర్థనను జట్టు మేనేజ్‌మెంట్ ఎంత మాత్రం పరిగణనలోకి తీసుకోక పోవడం విశేషం. ఇందుకు గల కారణాన్ని కూడా వెల్లడించింది. డివిలియర్స్‌ను మళ్లీ జట్టులోకి తీసుకుంటే అతడి స్థానంలో వచ్చిన ఆటగాళ్లతో పాటు జట్టులోని మిగతా క్రికెటర్లు సైతం అసహనానికి లోనవుతారన్న ఉద్దేశంతో జట్టు మేనేజ్‌మెంట్ యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications