నీకిది అద్భుతమైన వరల్డ్‌కప్: విలియమ్సన్ భుజం తట్టి చెవిలో చెప్పిన సచిన్

హైదరాబాద్: "మీ గేమ్‌ను అందరి ప్రశంసలు అందుకుంది. నీకు ఇది ఒక అద్భుతమైన వరల్డ్‌కప్" లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్ ఓటమి తర్వాత ఆ జట్టు కెప్టెన్ కేన్ విలియమ్సన్‌తో క్రికెట్ లెజెండ్ సచిన్ టండూల్కర్ చెప్పిన మాటలివి.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో బౌండరీ రూల్ ద్వారా ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు విశ్వవిజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది.

242 పరుగుల విజయ లక్ష్యంతో
అనంతరం 242 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ సైతం నిర్ణీత 50 ఓవర్లలో 241 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. అనంతరం మ్యాచ్ ఫలితం రాబట్టేందుకు సూపర్ ఓవర్ నిర్వహించగా ఇరు జట్లు 15 పరుగులతో సమానంగా నిలిచాయి.

578 పరుగులు చేసిన కేన్ విలియమ్సన్
ఈ ప్రపంచకప్‌లో 578 పరుగులు చేసిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ చేతుల మీదుగా మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్బంగా విలియమ్సన్ భుజం తట్టి సచిన్ అతడితో "మీ గేమ్‌ను అందరి ప్రశంసలు అందుకుంది. నీకు ఇది ఒక అద్భుతమైన వరల్డ్‌కప్" అని చెప్పాడు.

100Mbతో సచిన్ మాట్లాడుతూ
తాజాగా 100Mbతో సచిన్ మాట్లాడుతూ కేన్ విలియమ్సన్‌లో ఉన్న అత్యుత్తమ గుణం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లోనైనా అతడు కూల్‌గా ఉండటమేనని అన్నాడు. అయితే, దురదృష్టం కారణంగా అతడు ప్రపంచకప్ గెలవలేకపోయాడని సచిన్ తెలిపాడు. అయినప్పటికీ న్యూజిలాండ్ క్రికెటర్లు అందరి హృదయాలను గెలుచుకున్నారని సచిన్ చెప్పుకొచ్చాడు.

విలియమ్సన్‌పై రవిశాస్త్రి ప్రశసంల వర్షం
ఇక, రవిశాస్త్రి సైతం కేన్ విలియమ్సన్‌పై ట్విట్టర్ వేదికగా ప్రశంసల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. "ఏ సమయంలోనూ సంయమనం కోల్పోకుండా ఎంతో హుందాగా వ్యవహరించిన నీ తీరు అత్యద్భుతం. మ్యాచ్ ముగిసి రోజులు గడిచినా ఎలాంటి భావోద్వేగాలు వ్యక్తం చేయకుండా పాటిస్తున్న నిశ్శబ్దం ఎంతో గొప్పది" అని విలియమ్సన్‌ను ఉద్దేశించి రవి శాస్త్రి ట్వీట్ చేశాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications