న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాదైన రోజుని నువ్వు నాశనం చేశావు: వార్నర్‌తో సంజూ శాంసన్ (వీడియో)

 You destroyed my day David: Sanju Samson tells Warner after SRH thrash RR

హైదరాబాద్: 'నాదైన రోజును నువ్వు నాశనం చేశావు' అని సన్‌రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్‌తో రాజస్థాన్ రాయల్స్ మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సంజూ శాంసన్ అన్నాడు. ఐపీఎల్ టోర్నీలో భాగంగా శుక్రవారం రాత్రి సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై సన్‌రైజర్స్‌ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించి సంగతి తెలిసిందే.

ఐపీఎల్ 2019 రికార్డులు, గణాంకాలు, మ్యాచ్ స్కోరు వివరాల కోసం

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో సంజు శాంసన్ 55 బంతుల్లోనే 10ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 102 పరుగులు చేయడంతో సన్‌రైజర్స్‌ ముందు 199 పరుగులు భారీ లక్ష్యం ఉంచింది. ఈ మ్యాచ్‌లో క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మదిగా ఆడిన సంజు శాంసన్.. ఆ తర్వాత ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

బట్లర్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్

బట్లర్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్

ఓపెనర్ జోస్ బట్లర్(5) ఔటవగా.. అనంతరం క్రీజులోకి వచ్చిన సంజు శాంసన్ మరో ఓపెనర్ అజింక్య రహానే (70: 49 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులు) కలిసి రెండో వికెట్‌కి 119 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. జట్టు స్కోరు 134 వద్ద రహానే ఔటయ్యాడు. ఈ క్రమంలో సంజు శాంసన్ ఐపీఎల్ 2019 సీజన్‌లో తొలి సెంచరీని నమోదు చేశాడు.

ఆకాశమే హద్దుగా చెలరేగాడు

ఆకాశమే హద్దుగా చెలరేగాడు

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బెన్‌స్టోక్స్ (16 నాటౌట్: 9 బంతుల్లో 3 ఫోర్లు)తో కలిసి ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సన్‌రైజర్స్ అగ్రశ్రేణి బౌలర్‌ భువనేశ్వర్ కుమార్‌ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో వరుసగా 6, 4, 4, 2, 4, 4 బాదేశాడు. మొత్తంగా చివరి 5 ఓవర్లలో రాజస్థాన్ రాయల్స్ జట్టు 76 పరుగుల్ని రాబట్టగలిగింది.

సన్‌రైజర్స్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన రాజస్థాన్

సన్‌రైజర్స్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించిన రాజస్థాన్

సన్‌రైజర్స్‌కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంతో రాజస్థాన్ రాయల్స్ గెలుపు ధీమాతో ఉంది. అయితే, చేధనలో సన్‌రైజర్స్‌ ఆటగాళ్లు డేవిడ్‌ వార్నర్‌(37 బంతుల్లో 69), బెయిర్‌ స్టో(45) విజృంభించడంతో సంజు శాంసన్ సెంచరీ వృథా అయింది. మ్యాచ్ అనంతరం డేవిడ్‌ వార్నర్‌... సంజూ శాంసన్‌ను సరదాగా ఇంటర్వ్యూ చేశాడు.

నాదైన రోజును నువ్వు నాశనం చేశావు

ఈ ఇంటర్యూలో సంజూ శాంసన్ "నాదైన రోజును నువ్వు నాశనం చేశావు డేవిడ్‌. నీ బ్యాటింగ్‌ ముందు నా సెంచరీ పనికిరాకుండా పోయింది. మీ ఇన్నింగ్స్‌ మొదలెట్టగానే పవర్‌ప్లేలోనే మ్యాచ్‌ మా నుంచి చేజారిపోయింది. అయినా ప్రత్యర్థులుగా సన్‌రైజర్స్‌ వంటి పటిష్ట జట్టు ఉన్నపుడు మేము కనీసం 250 పరుగులు స్కోరు బోర్డు మీద ఉంచాల్సింది. అయినా నాకు ఇదొక ప్రత్యేకమైన రోజు" అని అన్నాడు. ఐపీఎల్‌ చరిత్రలో ఇప్పటి వరకు 53 సెంచరీలు నమోదు కాగా సంజూ శాంసన్‌కిది రెండో సెంచరీ కావడం విశేషం.

Story first published: Saturday, March 30, 2019, 15:19 [IST]
Other articles published on Mar 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X