ఘన వీడ్కోలుకు అర్హుడివి: రోహిత్ శర్మ ట్వీట్‌కు యువీ రిప్లై

హైదరాబాద్: టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్‌సింగ్ ఘన వీడ్కోలుకు అర్హుడని భారత ఓపెనర్ రోహిత్‌శర్మ పేర్కొన్నాడు. 19 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలందించిన టీమిండియా వెటరన్ క్రికెటర్ యువరాజ్ సింగ్ సోమవారం అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్‌కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
భార్య, తల్లితో కలిసి ముంబైలోని ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో 37 ఏళ్ల యువీ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించాడు. యువరాజ్ రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మపై తన ట్విట్టర్‌లో స్పందించాడు. "నువ్వు ఏదైతే సాధించావో అది కోల్పోయేదాకా నీకు తెలియదు. సోదరా.. నిన్ను ఎప్పుడూ ప్రేమిస్తుంటా. ఘన వీడ్కోలుకు నువ్వు అర్హుడివి. నా మనసులో ఏమనుకుంటానో తెలుసా! నిన్ను అమితంగా ఇష్టపడుతుంటా. నువ్విక లెజెండ్‌గా ఎదగాలి" అని ట్వీట్ చేశాడు.
రోహిత్ శర్మ ట్వీట్‌కు యువరాజ్ సైతం
రోహిత్ శర్మ ట్వీట్‌కు యువరాజ్ సైతం స్పందించాడు. యువరాజ్ తన ట్విట్టర్‌లో "నేను నా మనసులో ఏమనుకుంటున్నానో అది నీకు తెలుసు. లవ్ యు... నువ్వు లెజెండ్ లాగా ఎదుగు" అని సమధానమిచ్చాడు. కాగా, సమయమొచ్చినప్పుడు ఇంకా అనేక విషయాలు వెల్లడిస్తానని చెప్పాడు.

ఎలాంటి వివాదాలకు చోటివ్వకుండా
ప్రస్తుతం ప్రపంచకప్ జరుగుతున్నందున ఎలాంటి వివాదాలకు చోటివ్వదలచుకోలేదని, కచ్చితంగా సమయం వచ్చినప్పుడు మాట్లాడతానని యువరాజ్ సింగ్ చెప్పాడు. భారత్ తరుఫున 2000లో కెన్యాపై అరంగేట్రం చేసిన యువరాజ్ సింగ్ క్రికెటర్ 2017లో వెస్టిండీస్‌పై ఆఖరి వన్డే ఆడాడు.

తొలి వన్డే: 2000 కెన్యాపై..
ఆఖరి వన్డే: 2017 వెస్టిండీస్‌పై
తొలి టెస్టు: 2003 న్యూజిలాండ్‌పై
ఆఖరి టెస్టు: 2012 ఇంగ్లాండ్‌పై
తొలి టీ20: 2007 స్కాట్లాండ్‌పై
ఆఖరి టీ20: 2017 ఇంగ్లాండ్‌పై

అవార్డులు..
2012: అర్జున అవార్డు
2014: పద్మశ్రీ

ఆరు బంతుల్లో ఆరు సిక్సులు
2007 టీ20 వరల్డ్‌కప్‌లో యువరాజ్ సింగ్ అద్భుతం చేశాడు. ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ వేసిన ఓవర్లో 6 బంతుల్లో 6 సిక్స్‌లు బాది ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.

12 బంతుల్లో 50
2007 టీ20 వరల్డ్‌కప్‌లో ఇంగ్లాండ్‌పై ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టిన మ్యాచ్‌లోనే యువీ 12 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. టీ20ల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆటగాడిగా యువరాజ్ చరిత్ర సృష్టించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications