Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

కోహ్లీ సీక్రెట్‌ను రివీల్ చేసిన గిల్!!

టీమిండియాలో కుర్రకారు ఫుల్ జోష్‌లో ఉంది. ధనాధన్ క్రికెట్‌లో తమకు తిరుగులేదని ఈ యువ భారత జట్టు నిరూపిస్తోంది. అయితే భారత క్రికెట్ జట్టులో ఒకరిద్దరు సీనియర్లు మినహాయించి జట్టంతా యువ ఆటగాళ్లతోనే నిండి ఉంది. ఇక ఇందులో ఒకరు టీమిండియా టెస్ట్ కెప్టెన్,టీ20 వైస్ కెప్టెన్ అయిన శుభ్‌మన్ గిల్. శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ గురించి మాట్లాడాలంటే చాలా చెప్పుకోవచ్చు. తాను బ్యాటింగ్‌కి దిగితే బంతిని చాలా పద్ధతిగా బౌండరీకి బాదుతాడు. చాలా ఫోకస్డ్‌గా తన ఆటతీరు కనిపిస్తుంది. అందుకే చిన్న వయసులోనే బలోపేతమైన టీమిండియాకు టెస్టు బాధ్యతలు చేపడుతున్నాడు. సాధారణంగా మాటలు తక్కువగా మాట్లాడే శుభ్‌మన్ గిల్... వన్స్ బరిలోకి దిగాడంటే ప్రత్యర్థులకు చెమటలే. ఎప్పుడెప్పుడు ఔట్ అవుతాడా అని ఎదురుచూస్తుంటారు. ఇక గిల్‌పై బంతితో బౌలర్ చేయని ప్రయోగాలంటూ ఉండవు. తాజాగా శుభ్‌మన్ గిల్ ఆపిల్ మ్యూజిక్ సంస్థకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో తను ఆరాధించే క్రికెటర్ల గురించి చెప్పుకొచ్చాడు.

సచిన్ స్ఫూర్తి-కోహ్లీ కసి
టీమిండియా సంచలనం టెస్టు కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్ ఆపిల్ మ్యూజిక్‌ సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందులో తన ఫేవరెట్ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ అని చెప్పిన గిల్... తాను కోహ్లీకి కూడా పెద్ద ఫ్యాన్ అంటూ చెప్పుకొచ్చాడు. కోహ్లీ బ్యాటింగ్‌ను తాను చాలా ఆస్వాదిస్తానని వెల్లడించిన గిల్..కోహ్లీ బంతిని డీల్ చేసే విధానం తనకు ఎంతో ఇష్టమని చెప్పుకొచ్చాడు. అయితే తొలినాళ్లలో తనకు ప్రేరణ ఇచ్చింది మాత్రం టెండూల్కర్ అని... తన తండ్రి సచిన్‌ను దైవంలా ఆరాధించేవారని గుర్తుచేశాడు. అదే బహుశా తాను క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకోవడంలో కీలకంగా మారిందని చెప్పాడు. 2013లో సచిన్ టెండూల్కర్ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్రకటించాడు. 2011-13 మధ్య తాను క్రికెట్ పై పూర్తి అవగాహన తెచ్చుకున్నట్లు గిల్ వెల్లడించాడు. ఇక ప్లేయర్‌గా అవతరిస్తున్న సమయంలో కోహ్లీని చాలా ఫాలో అయ్యేవాడినని వివరించాడు.

you-cant-learn-that-hunger-shubman-gill-opens-up-on-his-admiration-for-virat-kohli

కోహ్లీలో ఆ ఆకలి ఎక్కువ
కోహ్లీ బరిలో బ్యాట్‌తో అడుగుపెట్టాడంటే బంతి గ్రౌండ్‌లో ఏ మూలన పడిందో అన్నట్లుగా ఉండేదని గిల్ వెల్లడించాడు. తనకు క్రికెట్ పట్ల ఉన్న అపారమైన ఇష్టం, పరుగులు సాధించాలన్న కసి కనిపించేదని గిల్ వివరించాడు. కోహ్లీ ఎంత సాధించినా ఇంకా ఏదో సాధించాలనే పట్టుదల ఆయనలో కనిపించేదని గిల్ చెప్పుకొచ్చాడు.కోహ్లీ నుంచి టెక్నిక్స్, ఇతర విషయాలను నేర్చుకోవచ్చుగానీ, సాధించాలన్న ఆకలిని మాత్రం ఎప్పటికీ నేర్చుకోలేమని చెప్పాడు. అది విరాట్‌లో మాత్రమే ఉందని ఇంకెవరిలో అది కనిపించదని గిల్ చెప్పాడు.

ఈ ఏడాది ఇంగ్లాండ్‌లో జరిగిన 5 టెస్టు మ్యాచుల్లో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన గిల్.. 75.40 సగటుతో మొత్తం 754 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలున్నాయి. ఎప్పుడైతే 50 పరుగులు చేశాడు అక్కడి నుంచి సెంచరీ చేయడం గమనార్హం. ఎడ్జ్‌బాస్టన్ టెస్టులో 269రన్స్, 169 పరుగులు ఒకే మ్యాచ్‌లో చేసి మొత్తంగా 430 వ్యక్తిగత పరుగులు సాధించాడు గిల్. ఇంగ్లాండ్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆసియా ఖండపు క్రికెటర్‌గా గిల్ సరికొత్త రికార్డు సృష్టించాడు.స్థిరత్వం,సహనంతో బ్యాటింగ్ చేయడం అలవర్చుకున్న గిల్... కోహ్లీ-రోహిత్ తరం తర్వాత టీమిండియా టెస్టు క్రికెట్‌కు మరో టాలెంటెడ్ కెప్టెన్ దొరికినట్లు క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.

Story first published: Friday, September 12, 2025, 14:50 [IST]
Other articles published on Sep 12, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+