For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నాన్న మంచోడా చెడ్డోడా?: సాక్షి ప్రశ్నకు ధోని కుమార్తె సమాధానమిది!

By Nageshwara Rao
Dhoni's Daughter Ziva Replies Smartly For Sakshi Questions
You Can’t Miss This Video of Dhoni & Ziva’s Playdate on Instagram!

హైదరాబాద్: క్రికెట్ నుంచి కాస్త విరామం లభించడంతో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతున్నాడు. తాజాగా తన గారాల పట్టి జీవాతో కలిసి ఆడుకుంటున్న వీడియోని ధోని తన ఇనిస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

ఈ వీడియోలో జీవా ఎంచక్కా ఆడుకుంటూ ఉంటుంది. అదే సమయంలో ధోని భార్య సాక్షి కలగజేసుకుని "జీవా.. నాన్న మంచోడా చెడ్డోడా? అని అడగ్గా.. మంచోడు(గుడ్‌) అని బదులిచ్చింది. ఆ తర్వాత మీరందరూ మంచివారు. మీ అందరూ" అని జీవా బదులిచ్చింది.

ఇందుకు సంబంధించిన వీడియోని ధోని తన ఇనిస్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అంతేకాదు ఈ వీడియోకి "వెరీ స్మార్ట్‌" అని టైటిల్ పెట్టాడు. ఈ వీడియోను చూసిన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత ధోని ప్రస్తుతం పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితమయ్యాడు.

ఇటీవలే, ఇంగ్లాండ్ పర్యటనను ముగించుకుని స్వదేశానికి చేరుకున్న ధోని కుటుంబ సభ్యులతో కలిసి బంధువులు, స్నేహితుల ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు హాజరవుతున్నాడు. త్వరలో ఆసియా కప్‌ కోసం ధోనీ తిరిగి జట్టుతో కలవనున్నాడు. ఇంగ్లాండ్‌ గడ్డపై ధోనీ మెరుగైన ప్రదర్శన చేయకపోవడంతో పలువురు విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.

Story first published: Wednesday, August 22, 2018, 12:14 [IST]
Other articles published on Aug 22, 2018
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+