ధోనీకి సొంత ఆలోచనలు ఉన్నాయి.. ఏం చేయాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు

టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి సొంత ఆలోచనలు ఉన్నాయి. అతను ఏం చేయాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు అని టీమిండియా మాజీ పేసర్ మునాఫ్ పటేల్ అభిప్రాయపడ్డారు. ప్రపంచకప్ సెమీస్ నుంచి భారత్ నిష్క్రమించిన తర్వాత సీనియర్ ఆటగాడు ధోనీ రిటైర్మెంట్ గురించి చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవేమి పట్టించుకోకుండా ధోనీ వెస్టిండీస్ పర్యటన నుండి స్వయంగా తప్పుకుని భారత ఆర్మీలో సేవ చేయడానికి వెళ్ళాడు.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం

ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు:
ధోనీ రిటైర్మెంట్‌పై మాజీలు అందరూ తమ తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు. తాజాగా మాజీ పేసర్ మునాఫ్ పటేల్ కూడా ధోనీ రిటైర్మెంట్‌పై స్పందించారు. 'ధోనీకి సొంత ఆలోచనలు, ప్రణాళికలు ఉన్నాయి. బీసీసీఐకి ధోనీ అన్ని విషయాలు చెప్పే ఉంటాడు. కానీ ఆ విషయాలు బయటికి రాలేదు. ధోనీకి ఏం చేయాలో ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు' అని మునాఫ్ పటేల్ అన్నారు.

ధోనీని ఎవరూ విస్మరించలేరు:
'ధోనీ భారత క్రికెట్‌కు ఎంతో చేశాడు. ఎన్నో ప్రతిష్ఠాత్మకమైన ట్రోఫీలను టీమిండియాకు అందించాడు. 1975 నుంచి ఏదైతే వెస్టిండీస్ సాధించిందో.. ధోనీ కొన్ని ఏళ్లలోనే (2007-15) భారత్‌కు సాధించి పెట్టాడు. ధోనీని ఎవరూ విస్మరించలేరు' అని మునాఫ్ పేర్కొన్నారు. సీనియర్ వికెట్ కీపర్ ధోనీ స్వయంగా వెస్టిండీస్ పర్యటన నుండి తప్పుకోవడంతో యువ ఆటగాడు రిషబ్ పంత్‌ను వికెట్ కీపర్‌గా ఎంపిక చేశారు.

దూకుడుగా ఆడాలి:
ధోనీ రిటైర్మెంట్ గురించి భారత మాజీ కెప్టెన్ అజహరుద్దీన్ కూడా స్పందించారు. 'ధోనీ రిటైర్మెంట్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఫిట్‌గా ఉన్నంతకాలం జట్టులో ధోనీ కొనసాగవచ్చు. అయితే దూకుడుగా ఆడాల్సిన అవసరముంది. వయసు పెరిగే కొద్ది శరీరం సహకరించదు. కానీ ధోనీని చూస్తే అలా కనిపించట్లేదు. అతను సరైన నిర్ణయమే తీసుకుంటాడు' అని తెలిపారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications