ఆ సమయంలో పంత్‌ స్కూప్‌ షాట్.. ఎవరైనా ఇలా ఆడగలరా అంటూ మాజీల ఆశ్చర్యం (వీడియో)

IND VS ENG 4th Test: Cricket Fraternity Hails Rishabh Pant's Audacious Reverse-Scoop || Oneindia

అహ్మ‌దాబాద్‌: ఇంగ్లండ్‌తో మొతేరా మైదానం వేదికగా జరుగుతున్న ఆఖరి టెస్ట్‌లో టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్ (118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101) సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. స్టార్ బ్యాట్స్‌మెన్ అంతా విఫలమైన వేళ.. వాషింగ్టన్ సుందర్‌తో కలిసి పంత్ అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. దాంతో భారత్ మ్యాచ్‌పై పట్టుబిగించింది. ఈ నేపథ్యంలోనే పంత్ టీమిండియా భవిష్యత్‌ ఆశాకిరణంగా కనిపిస్తున్నాడని మాజీలు కొనియాడుతున్నారు.

 వన్డే ఇన్నింగ్స్‌ మాదిరి:

వన్డే ఇన్నింగ్స్‌ మాదిరి:

జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఆడడమే కాకుండా అవసరమైన వేళ దూకుడుగా ఆడుతూ.. రిషభ్ పంత్ ప్రత్యర్థి బౌలర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ముఖ్యంగా నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో చేసిన సెంచరీ ఎప్పటికీ చిరస్మరణీయమే. భారత్ 80/4 స్థితిలో ఉండగా.. బరిలోకి దిగిన పంత్ జట్టు ఆధిక్యంలో నిలిచేవరకు క్రీజులో కొనసాగాడు. ఈ క్రమంలోనే తొలుత నెమ్మదిగా ఆడి తర్వాత తన సహజసిద్ధమై ఆట ఆడాడు. దీంతో 118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లతో 101 పరుగులు సాధించి టెస్టుల్లో వన్డే ఇన్నింగ్స్‌ ఆడి ఔరా అనిపించాడు.

రివర్స్‌ స్కూప్‌ షాట్‌:

రివర్స్‌ స్కూప్‌ షాట్‌:

అయితే రిషభ్ పంత్‌ 89 పరుగుల వద్ద ఉండగా.. జేమ్స్ అండర్సన్‌ బౌలింగ్‌లో ఆడిన రివర్స్‌ స్కూప్‌ షాట్‌ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. సెంచరీకి చేరువలో ఉన్న సమయంలో ఎవరైనా ఇలాంటి షాట్‌ ఆడతారా అనేలా చేశాడు. కొత్త బంతితో తనని కట్టడి చేద్దామని చూసిన అండర్సన్‌ను స్పైడర్ పంత్ ఆశ్చర్యానికి గురి చేశాడు. స్లిప్‌ ఫీల్డర్ల తలలపై నుంచి ఆడిన ఆ షాట్‌ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఇప్పటికే ఈ వీడియోకు లైకులు, కామెంట్ల వర్షం కురిసింది. మాజీలు సైతం అతడిని ప్రశంసిస్తున్నారు.

పంత్‌ ఇలాంటి షాట్‌ ఆడకూదు:

పంత్‌ ఇలాంటి షాట్‌ ఆడకూదు:

భారత మాజీ బ్యాట్స్‌మెన్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, వసీమ్‌ జాఫర్‌, ఆకాశ్‌ చోప్రాలు రిషభ్ పంత్ ఆడిన రివర్స్‌ స్కూప్‌ షాట్‌పై స్పందించారు. ఆ షాట్‌ను ఆస్వాదించానని సెహ్వాగ్‌ పేర్కొనగా.. 2021లో అత్యుత్తమ షాట్‌ అని చోప్రా అన్నాడు. ఇక వసీమ్‌ స్పందిస్తూ.. పంత్‌ ఇలాంటి షాట్‌ ఆడకూడదంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‌పంత్‌ ఆస్ట్రేలియా పర్యటన వరకూ ఫామ్‌ కోల్పోయి తీవ్ర విమర్శలు ఎదుర్కోన్నాడు. ఇప్పుడు అందరి చేతా శెభాష్‌ అనిపించుకుంటున్నాడు. ఆసీస్‌ గడ్డపై విధ్వంసక బ్యాటింగ్‌తో పాటు జట్టును గెలిపించిన అతడు ప్రస్తుత సిరీస్‌లోనూ రాణిస్తున్నాడు.

 కోహ్లీ పట్టరాని సంతోషంతో:

కోహ్లీ పట్టరాని సంతోషంతో:

అయితే రిషభ్ పంత్ సెంచరీ పూర్తి చేసుకున్న క్షణాన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పట్టరాని సంతోషంతో ఉప్పొంగిపోయాడు. డ్రెస్సింగ్ రూమ్‌లో ఎగిరి గంతేసిన భారత కెప్టెన్.. యువ ఆటగాడిని అభినందించేందుకు బాల్కనీలోకి పరుగెత్తుకొచ్చాడు. ఇదంతా టీవీ కెమెరాల్లో రికార్డవ్వడంతో ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేసింది. ఈ మ్యాచ్‌లో డకౌటైన కోహ్లీ.. పంత్ సెంచరీని తానే చేసినట్లుగా ఫీలవుతూ సంతోషం వ్యక్తం చేశాడు.

India vs England: భారత్ ఆలౌట్‌.. తృటిలో సుందర్‌ సెంచరీ మిస్! 160 ర‌న్స్ ఆధిక్యం!

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Saturday, March 6, 2021, 12:27 [IST]
Other articles published on Mar 6, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X