హైదరాబాద్: నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ స్టేడియం పెద్దదిగా ఉండటం స్ఫిన్నర్లకు కలిసొస్తుందని టీమిండియా లెగ్ స్ఫిన్నర్ యజువేంద్ర చాహల్ పేర్కొన్నాడు. రెండో టీ20 నేపథ్యంలో హర్యానాకు చెందిన యజువేంద్ర చాహల్ శనివారం మీడియాతో మాట్లాడాడు. నాగ్‌పూర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో ఆకట్టుకునే ప్రదర్శన చేస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు.
జమ్తాలోని వీసీఏ స్టేడియం పెద్దదిగా ఉండటం వల్ల స్పిన్నర్లకు ఆయుధమైన ఫ్లెటెడ్ డెలివరీల అస్త్రాలను రెండో ట్వంటీ 20లో ఉపయోగించని పేర్కొన్నాడు. 'పెద్ద స్టేడియాలు ఎప్పుడూ భిన్నంగానే ఉంటాయి. బంతిని మనం ఫైట్ చేసినా పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. బౌండరీ లైన్ పెద్దదిగా ఉంటే ఫ్లెటెడ్ డెలివరీలతో బ్యాట్స్‌ను ఊరించి వికెట్లు తీయొచ్చు' అని చాహల్ తెలిపాడు.
తొలి టీ20 జరిగిన కాన్పూర్‌లోని గ్రీన్ పార్క్ స్టేడియంతో పోలిస్తే రెండో టీ20 జరుగుతున్న నాగ్‌పూర్ స్టేడియం బౌండరీ 10 యాడ్స్ పెద్దదిగా ఉంటుంది. బౌలింగ్ స్ట్రాటజీపై ఇంకా చర్చించలేదని, అయితే తొలి టీ20తో పోలిస్తే రెండో టీ20 జరిగే వీసీఏ స్టేడియం తనకు లాభిస్తుందనే అనుకుంటున్నానని చెప్పాడు.

గ్రౌండ్ పెద్దది కావడంతో గాల్లోనే బంతిని స్పిన్ చేసి ప్రత్యర్థి ఆటగాళ్లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుందని అన్నాడు. మూడు టీ20ల సిరిస్‌లో భాగంగా కాన్పూర్‌లో జరిగిన తొలి టీ20లో నాలుగు ఓవర్ల పాటు బౌలింగ్ వేసి 27 పరుగులిచ్చి రెండు వికెట్లు తీసుకున్నాడు.
గతేడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో 19 వికెట్లు తీసి మొట్టమొదటి స్ధానంలో నిలిచాడు. ఇదిలా ఉంటే మూడు టీ20ల మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లాండ్ జట్టు 1-0ఆధిక్యంలో ఉంది. చివరిదైన మూడో మ్యాచ్ ఫిబ్రవరి 1న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది.