సారీ.. నీకు హెల్ప్ చేయను! నీకొచ్చింది కరోనా కాదు.. ఇంకో మాయదారి రోగం: హనుమ విహారి

Hanuma Vihari మీద ట్రోల్ ఆహ్.. గూబ గుయ్య్ మనేలా ఇచ్చేస్తాడు!! || Oneindia Telugu

హైదరాబాద్: ఇంటర్నెట్‌, సోషల్‌ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రజలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కొందరు మంచి కోసం ఉపయోగిస్తుంటే.. ఇంకొందరు చెడు పనులతో విసుగుతెప్పిస్తున్నారు. మరికొందరు మంచేదో, చెడేదో ఆలోచించకుండా.. విచక్షణ లేకుండా ప్రతిదానికీ ట్రోలింగ్‌ చేసేస్తున్నారు. చేసేది మంచి పనులే అయినా.. వాటిపై కూడా సెటైర్లు వేస్తున్నారు. టీమిండియా టెస్ట్ క్రికెటర్‌, హైదరాబాద్ ఆటగాడు హనుమ విహారి తనపై చేసే ట్రోలింగ్‌కు చాలాదూరం ఉంటాడు. కానీ తాజాగా ఓ నెటిజన్ చేసిన విమర్శకు దిమ్మదిరిగే సమాధానం ఇవ్వాల్సి వచ్చింది. విషయంలోకి వెళితే...

విరాళాల సేకరణ

విరాళాల సేకరణ

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021లో ఆడే అవకాశం రాని హనుమ విహారి.. ఈ సమయాన్ని మరోరకంగా సద్వినియోగం చేసుకున్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న విహారి ఇంగ్లిష్‌ కౌంటీల్లో వార్విక్‌షైర్‌ జట్టు తరఫున ఆడుతున్నాడు. రాబోయే ఇంగ్లండ్‌ పర్యటన కోసం విహారి ఎప్పటి నుంచో ప్రాక్టీస్‌ చేస్తున్నాడు. అయితే భారత్‌లో కరోనా సెకండ్ వెవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో.. అందుకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాడు. ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకొనేందుకు సోషల్‌ మీడియా వేదికగా విరాళాల సేకరణ చేపట్టాడు.

సారీ.. నీకు హెల్ప్ చేయలేను

సారీ.. నీకు హెల్ప్ చేయలేను

హనుమ విహారి చేస్తున్న గొప్ప పనిని ప్రశంసించకుండా ఒక వ్యక్తి సెటైర్ వేశాడు. 'సరే భాయ్‌, రెండు మసాలా దోసెలు తీసుకురండి. అలాగే కొబ్బరి పచ్చడి మర్చిపోవద్దు' అంటూ విహరికి ఓ నెటిజన్ కామెంట్‌ పెట్టాడు. సహజంగా తెలుగు క్రికెటర్‌ అయిన విహారి ఇలాంటి వాటికి దూరంగా ఉంటాడు. కానీ ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా అతడికి గట్టి జవాబు ఇవ్వాలనుకున్నాడు. 'భారత దేశంలోని చాలా మంది లాగే నువ్వూ బాధపడుతుంటే.. నేను కచ్చితంగా ఇచ్చేవాడినే. ఓహ్‌.. ఒక్క నిమిషం. కానీ నిజానికి నువ్వు మరో రోగంతో బాధపడుతున్నావు. ఐయామ్‌ సారీ.. నీకు హెల్ప్ చేయలేను' అని విహారి బదులిచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ అయింది.

'క్రికెట్‌తో ఉన్న బంధం ఈతరం కుర్రాళ్లకు అర్థం కావట్లేదు.. వెస్టిండీస్‌ గత వైభవాన్ని మళ్లీ చూడలేం'

12 టెస్టుల్లో 624 పరుగులు

12 టెస్టుల్లో 624 పరుగులు

27 ఏళ్ల హనుమ విహారి ఇప్పటివరకు 12 టెస్టులు ఆడి ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీల సహాయంతో 624 పరుగులు సాధించాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ డ్రా చేసుకున్న సిడ్నీ టెస్టులో విహారి.. ఆర్ అశ్విన్‌తో కలిసి నాలుగు గంటల పాటు పోరాడి జట్టును ఆదుకున్నాడు. కానీ ఈ మ్యాచ్‌ అయ్యాక గాయం కారణంగా స్వదేశానికి వచ్చేశాడు. ఆపై స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో అతనికి అవకాశం దక్కలేదు. ఇక టెస్టు స్పెషలిస్ట్‌గా ముద్రపడటంతో 2021 సీజన్‌లలో విహారిని ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేసేందుకు ముందుకురాలేదు.

 ఇంగ్లండ్‌లోనే విహారి

ఇంగ్లండ్‌లోనే విహారి

జూన్‌ 18-22 మధ్య న్యూజిలాండ్‌తో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్, ఆపై ఇంగ్లండ్‌తో జరగనున్న ఐదు టెస్ట్‌ల సిరీస్ కోసం 24 మందితో కూడిన జంబో జట్టును బీసీసీఐ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. హనుమ విహారికి కూడా అందులో చోటు దక్కింది. ఈ నెలాఖరు లోగా కోహ్లీసేన ఇంగ్లండ్ బయలుదేరనుంది. అక్కడే ఉన్న విహారి.. టెస్ట్ చాంపియన్షిప్ కోసం జట్టుతో కలవనున్నాడు.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Wednesday, May 12, 2021, 9:27 [IST]
Other articles published on May 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X