న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఒక రోజులో సూపర్ స్టార్ కాలేరు: రిషబ్ పంత్‌కు రవిశాస్త్రి మద్దతు

You are not going to be a superstar in 1 day: Ravi Shastri to Rishabh Pant

హైదరాబాద్: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌కు హెడ్ కోచ్ రవిశాస్త్ర మద్దతుగా నిలిచాడు. ఒకరోజులో ఎవరూ సూపర్ స్టార్లు కాలేరని ఆయన తెలిపాడు. ధోనీ వారసుడిగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన రిషబ్ పంత్‌ చెత్త షాట్లతో పెవిలియన్‌ చేరుతున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో రవిశాస్త్రి మాట్లాడుతూ "అతనికి చెప్పండి, చిన్నవాడని ఒక రోజులో ప్రతిదీ నేర్చుకుంటారని ఎవరూ ఆశించరని. ప్రతి ఒక్కరూ తప్పులు చేస్తారు. ఊరికే కూర్చుని, ఆ తప్పులను సరిదిద్దే మార్గాల గురించి ఆలోచించేలోపు ఈ ఆట అతడికి అన్ని నేర్పుతుందని" అని అన్నాడు.

<strong>గంగూలీ దృష్టి సారిస్తే మంచిది: భారత్‌కు పదేళ్లు పడుతుంది!</strong>గంగూలీ దృష్టి సారిస్తే మంచిది: భారత్‌కు పదేళ్లు పడుతుంది!

ఒకరోజులో ఎవరూ సూపర్ స్టార్లు కాలేరు

ఒకరోజులో ఎవరూ సూపర్ స్టార్లు కాలేరు

"ఒకరోజులో ఎవరూ సూపర్ స్టార్లు కాలేరు. ప్రతి ఒక్కరి జీవితంలో ఎత్తుపల్లాలు ఉంటాయి. అదే జీవితం, మీరు ఎంత ఎక్కువ కష్టపడి పనిచేస్తారో, అంత ఎక్కువ త్యాగాలు చేస్తే, మీరు మంచివారు అవుతారు" అని రవిశాస్త్రి పేర్కొన్నాడు. భారత్ తరుపున 10 ఇన్నింగ్స్‌లు ఆడిన పంత్ 229 పరుగులు చేశాడు.

టీ20ల్లో 358 పరుగులు

టీ20ల్లో 358 పరుగులు

యావరేజి 22.90. వన్డేల్లో పంత్ అత్యధిక స్కోరు 48. ఇక, 23 టీ20ల్లో 19.88 యావరేజితో 358 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు చేశాడు. వచ్చే నెలలో వెస్టిండిస్ జట్టుతో జరిగే పరిమిత ఓవర్ల సిరిస్‌కు రిషబ్ పంత్‌ను వికెట్ కీపర్‌గా సెలక్టర్లు ఎంపిక చేశారు.

ప్రధాన వికెట్ కీపర్‌గా పంత్

ప్రధాన వికెట్ కీపర్‌గా పంత్

ఈ మొత్తం సిరిస్‌కు రిషబ్ పంత్‌ను ప్రధాన వికెట్ కీపర్‌గా సెలక్టర్లు ఎంపిక చేయడం విశేషం. భారత పర్యటనలో భాగంగా వెస్టిండిస్ జట్టు మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. తొలి టీ20 డిసెంబర్ 6న హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనుంది.

వన్డే జట్టు :

విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధవన్‌, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌, కేదార్‌ జాదవ్‌, మనీష్‌ పాండే, శ్రేయాస్ అయ్యర్‌, రవీంద్ర జడేజా, శివమ్‌ దూబే, యజువేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌

టీ20 జట్టు :

టీ20 జట్టు :

విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, శిఖర్‌ ధవన్‌, కేఎల్‌ రాహుల్‌, రిషబ్‌ పంత్‌, కేదార్‌ జాదవ్‌, మనీష్‌ పాండే, శ్రేయాస్ అయ్యర్‌, రవీంద్ర జడేజా, శివమ్‌ దూబే, యజువేంద్ర చాహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, దీపక్‌ చాహర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, వాషింగ్టన్‌ సుందర్‌

Story first published: Tuesday, November 26, 2019, 17:35 [IST]
Other articles published on Nov 26, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X