Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

IND vs AUS: గంభీర్‌కు జరిగేది అన్యాయమే: జడేజా

టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌ పనితీరుపై ఇప్పుడే ఓ నిర్ణయానికి రావడం సరైనదని కాదని మాజీ క్రికెటర్ అజయ్ జడేజా అన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు గంభీర్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. రాహుల్ ద్రవిడ్ అనంతరం శ్రీలంక పర్యటనతో గంభీర్ కోచ్‌గా బాధ్యతలు అందుకున్న విషయం తెలిసిందే. అయితే కోచ్‌గా గంభీర్ హయాంలో భారత్ కోరుకోని రికార్డులు నమోదు చేసింది.

న్యూజిలాండ్‌ చేతిలో మూడు టెస్టుల సిరీస్‌ను వైట్ వాష్‌కు గురైంది. 91 ఏళ్ల భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో సొంతగడ్డపై మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌లో టీమిండియా వైట్‌వాష్‌కు గురికావడం ఇదే తొలిసారి. అంతేగాక శ్రీలంక పర్యటనలో వన్డే సిరీస్‌ను టీమిండియా 0-2తో కోల్పోయింది. ఈ క్రమంలో గంభీర్ వ్యూహాలు-పనితీరుపై పెద్దఎత్తున విమర్శలు వచ్చాయి. టెస్టు ఫార్మాట్‌కు కొత్త కోచ్‌ను నియమించాలనే డిమాండ్ వినిపించింది.

You Are Being Unfair to Him Ajay Jadeja Backs Gautam Gambhir Against Critics

కానీ ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో తొలి టెస్టులో టీమిండియా 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించడంతో గంభీర్ విమర్శలు తగ్గాయి. కాగా, గంభీర్‌కు మద్దతుగా అజయ్ జడేజా కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆర్నెల్ల కాలంలోనే గంభీర్ పని తీరుపై ఓ అంచనాకు రావడం సరైనది కాదని, అలా చేస్తే అన్యాయమే అని పేర్కొన్నాడు. ఇంత తక్కువ కాలంలో ప్రజలు అతన్ని జడ్జ్ చేయడం సరికాదని తెలిపాడు. ఆటలో కొన్ని దశలు ఉంటాయని, ప్రతి మ్యాచ్‌లో కొన్నిసార్లు గెలుస్తాం, మరికొన్ని సార్లు ఓడిపోతామని తెలిపాడు. అతను చాలా ఖరాఖండి మనిషి అని, ప్రజలు కోరుకునే ఫలితాన్ని సాధిస్తాడని చెప్పాడు.

కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి భారత జట్టుతో చేరడం గురించి అజయ్ జడేజా మాట్లాడాడు. రోహిత్ చేరిక టీమిండియాను మరింత బలోపేతం చేస్తుందని అన్నాడు. రోహిత్ నాయకుడు అని, క్లిష్టపరిస్థితుల్లో జట్టుతో తోడుగా నిలిచాడని, ఇప్పుడు గెలుపు బాట పట్టిన జట్టుతోనూ హిట్ మ్యాన్ ఉంటాడని తెలిపాడు. రోహిత్ రాకతో టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ గురించి ఆందోళన చెందట్లేదని, అతను ఎక్కడ బ్యాటింగ్ చేసినా టీమిండియాకు బలమే అని పేర్కొన్నాడు. వ్యక్తిగత కారణాలతో తొలి టెస్టుకు దూరమైన రోహిత్ రెండో టెస్టు నుంచి టీమిండియాకు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 నుంచి పింక్ బాల్‌తో రెండో టెస్టు జరగనుంది. ఈ డే/నైట్ టెస్టు భారత కాలమాన ప్రకారం ఉదయం 9.30 గంటలకు మొదలవుతుంది.

Story first published: Saturday, November 30, 2024, 18:15 [IST]
Other articles published on Nov 30, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+