యువీకి షాక్: పెళ్లికి రానని తేల్చి చెప్పిన తండ్రి యోగిరాజ్
న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కు తండ్రి యోగిరాజ్ సింగ్ షాకిచ్చాడు. నవంబర్ 30వ తేదీన పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్ గురుద్వారాలో జరగనున్న యువీ, హాజెల్ కీచ్‌ల వివాహానికి హాజరు కావడం లేదని ఆయన ప్రకటించారు. ఈ మేరకు ప్రముఖ జాతీయ దినపత్రిక హిందూస్తాన్ టైమ్స్‌లో వార్తా కథనం వచ్చింది.
అందులో సంప్రదాయ బద్ధంగా జరుగుతున్న తన కుమారుడు యువరాజ్ పెళ్లికి రానని ఇదే విషయాన్ని యువీ తల్లి షబ్నంకు ముందే చెప్పానని వివరించాడు. ఇది తన దురదృష్టమనీ యోగరాజ్ వ్యాఖ్యానించడం విశేషం. అంతేకాదు తనకు దేవుడి మీద భక్తి ఉన్నప్పటికీ, మత గురువుల మీద నమ్మకం లేదని, అందుకే యువరాజ్ పెళ్లికి వెళ్లడం లేదని యోగిరాజ్ సింగ్ స్పష్టం చేశారు.

మెహిందీ ఫంక్షన్‌కు తప్పక హాజరవుతా
అయితే యువరాజ్ కోరిక మేరకు నవంబర్ 29న హోటల్ లలిత్ వద్ద జరగనున్న మెహిందీ ఫంక్షన్‌కు తప్పక హాజరవుతానని చెప్పాడు. ఎందుకంటే ఫంక్షన్‌కు వచ్చేవారిని ఆహ్వానించడానికి తప్పనిసరిగా రావాలని తన కుమారుడు తన పేరుని ముద్రించాడని పేర్కొన్నాడు. అంతేకాదు అందరూ చట్టబద్ధ వివాహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, విలాసవంతమైన వివాహాలకు స్వస్తి పలకాలని కూడా యోగిరాజ్ సూచించారు.

పెళ్లిళ్లలో కోట్లాది రూపాయల వృధా
పెళ్లిళ్లలో కోట్లాది రూపాయల వృధా ఖర్చులకు అందరూ దూరంగా ఉండాలని యోగరాజ్ సింగ్ కోరారు. యువీ తల్లి షబ్నం వద్ద చాలా డబ్బు ఉందని, అందుకే యువరాజ్ పెళ్లిన ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తుందని చెప్పారు. యువీ పెళ్లిన ఎలా చేయాలన్న విషయం ఆమెకే వదిలేస్తున్నానని తెలిపాడు.

కొన్నేళ్ల క్రితమే విడిపోయిన యోగిరాజ్, షబ్నం
యువరాజ్ సింగ్ తల్లి షబ్నం, తండ్రి యోగరాజ్ కొన్ని సంవత్సరాల క్రితమే విడిపోయారు. యువీ మాత్రం తల్లి షబ్నం వద్దే పెరిగి పెద్దయ్యాడు. ఇక యువీకి కాబోయే భార్య హాజెల్ కీచ్‌పై యోగిరాజ్ ప్రశంసలు కురిపించాడు. ఆమెను 'ఏంజెల్' గా అభివర్ణించాడు. పాశ్చాత్య సంస్కృతిలో పెరిగినా సంప్రదాయ విలువలకు, పద్ధతులకు అధిక ప్రాముఖ్యతను ఇస్తుందని యోగిరాజ్ చెప్పాడు.

సానుకూల మార్పులు
హాజెల్ తమ కుటుంబంలో సానుకూల మార్పులు తీసుకొస్తుందని దానిని తాను నమ్ముతున్నానని చెప్పాడు. ఇతర సోదరీ మణులును ఒక చోటుకి చేరుస్తుందనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. అలాగే యువీ, హాజెల్ దంపతులు కుటుంబంలోని మిగిలిన పిల్లలకు తల్లిదండ్రుల్లా వ్యవహరించాలని కోరుకుంటున్నానని చెప్పాడు.

ఈనెల 30న చండీగఢ్‌లో పంజాబీ సంప్రదాయంలో
ఇదిలా ఉంటే హాలీవుడ్ నటి, మోడల్ హజల్ కీచ్‌తో యువరాజ్ వివాహం నిరాడంబరంగా జరగనుంది. ఈనెల 30న చండీగఢ్‌లో పంజాబీ సంప్రదాయంలో యువీ వివాహం చేసుకోనున్నాడు. ఈ వేడుకకు 60 మంది అతిథులే హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం.

డిసెంబర్ 2న గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం
ముందుగా 30న సిక్కు సంప్రదాయంలో పెళ్లి చేసుకున్న తర్వాత డిసెంబర్ 2న గోవాలో హిందూ సంప్రదాయం ప్రకారం మరోసారి వివాహం జరిపించనున్నారు. ఈ కార్యక్రమానికి వధూవరుల కుటుంబసభ్యులు, స్నేహితులు మాత్రమే హాజరుకానున్నారు. డిసెంబర్ 5న చత్తార్‌పూర్‌లో సంగీత్, 7న ఢిల్లీలోని ఓ హోటల్‌లో రిసెప్షన్ జరుగనుంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications