For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ధోనీ! నా కొడుకునేం చేయాలనుకుంటున్నావ్: యువీ తండ్రి, సవాల్

By Srinivas

ఢిల్లీ: భారత జట్టు వన్డే, ట్వంటీ 20 కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ పైన ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశాడు. రెండేళ్ల క్రితం యువరాజ్‌ను జట్టు నుంచి తప్పించడం వెనుక ధోనీ కుట్రనే కారణమని ఆయన ఆరోపించాడు.

తాజాగా మరోసారి ధోనీపై మండిపడ్డాడు. రెండేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన తన కొడుకు తిరిగి జట్టులోకి వచ్చాడని, అద్భుతం అన్నాడు. కానీ అతనిని ఏడో స్థానానికి నెట్టేయడం ఏమిటని ప్రశ్నించాడు. కెప్టెన్ ఏం చెప్పాలనుకుంటున్నాడని నిలదీశాడు.

Yograj Singh strikes again! What is MS Dhoni trying to prove, asks Yuvraj's father

జట్టులో మార్పులు సహజమేనని, కానీ ఇక్కడ అసహజంగా కనిపిస్తున్నాయన్నాడు. జరుగుతున్న పరిణామాలపై బాధపడవద్దని, నీ సమయం వస్తుందని తన కుమారుడికి చెప్పానని అన్నాడు. రెండేళ్లు జట్టుకు దూరమైతే ధోనీ, లేదా ఇతర ఆటగాళ్లు తిరిగి జట్టులోకి రాగలరా అని ప్రశ్నించారు.

సరైన సమయంలో యువరాజ్ సింగ్‌కు బౌలింగ్ చేసే అవకాశాలను సైతం ధోనీ ఇవ్వడం లేదన్నాడు. 2011 ప్రపంచ కప్‌లో యువరాజ్ పదిహేను వికెట్లు తీశాడని గుర్తు చేశాడు. యువరాజ్ జట్టులో ఉండటం ఇష్టం లేకుంటే, ఆ విషయాన్ని సెలక్టర్లకు స్పష్టంగా చెప్పాలన్నాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+