Yograj Singh: జస్‌ప్రీత్ బుమ్రా గాయంపై యోగరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
IND vs ENG Test Series: టీమిండియా ఇప్పుడు ఇంగ్లండ్‌తో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడటానికి పూర్తిగా సిద్ధంగా ఉంది. టెస్ట్ సిరీస్‌లో మొదటి మ్యాచ్ జూన్ 20న జరగనుంది. ఈ సారి టీమిండియాకు శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే శుభ్‌మన్ గిల్‌కు ముందు బీసీసీఐ పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రాను టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా చేయాలనుకుంది. కానీ ఫిట్‌నెస్ కారణంగా బుమ్రా కెప్టెన్సీని నిరాకరించాడు. ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లను బుమ్రా ఆడగలడా లేదా అనేది ఇంకా స్పష్టం కాలేదు. గాయం కారణంగా బుమ్రా చాలా సార్లు టీమిండియాకు దూరంగా ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే బుమ్రా ఎందుకు పదే పదే గాయపడుతున్నాడో ఇప్పుడు మాజీ క్రికెటర్ యోగరాజ్ సింగ్ వివరించాడు.
యోగరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
ఒక ఇంటర్వ్యూ సందర్భంగా యోగరాజ్ సింగ్ మాట్లాడుతూ.. "జస్‌ప్రీత్ బుమ్రా, ఇతర క్రికెటర్లు పదేపదే గాయపడటానికి కారణం జిమ్. షమీ,హార్దిక్ మీకు బాడీ బిల్డింగ్ అవసరం లేదు. పూర్వకాలంలో పెద్ద బౌలర్లు చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉండేవారు. అంతే కాకుండా దిగ్గజ ఆటగాడు వివ్ రిచర్డ్స్ కూడా 35 ఏళ్ల వరకు జిమ్‌కు వెళ్లలేదు. క్రికెటర్లు 35-36 ఏళ్ల వయస్సు తర్వాత జిమ్‌కు వెళ్లాలి. ఎందుకంటే మీ బలం 36-37 సంవత్సరాల తర్వాత ప్రారంభమవుతుంది" అని అన్నారు.

యోగరాజ్ సింగ్ ఇంకా మాట్లాడుతూ.. "తక్కువ వయస్సులో మీరు జిమ్‌కు వెళ్లడం వల్ల ఎక్కువ గాయాలు అవుతాయి. పాత కాలంలో గాయాలు చాలా తక్కువగా ఉండేవి. క్రికెట్‌లో ఆటగాళ్లు ఫ్లెక్సీబుల్ బాడీ అవసరం. చివరగా ఆయన బీసీసీఐని ఉద్దేశించి.. 'దయచేసి క్రికెటర్లను జిమ్‌కు పంపవద్దు' అని కోరారు." క్రికెటర్లు ఎక్కువగా జిమ్‌కు వెళ్లడం వల్ల గాయాల ప్రమాదం పెరుగుతుందని యోగరాజ్ సింగ్ అభిప్రాయపడ్డారు, కాబట్టి వారు జిమ్‌కు వెళ్లకూడదని కోరారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో గాయపడిన జస్‌ప్రీత్ బుమ్రా
ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సందర్భంగా భారత స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. సిడ్నీ టెస్ట్ సమయంలో బుమ్రాకు వెన్నులో నొప్పి సమస్య తలెత్తింది. దీంతో బుమ్రా మ్యాచ్ మధ్యలో ఆస్పత్రికి వెళ్లి స్కాన్ చేయించుకోవలసి వచ్చింది. దీని తర్వాత రెండో ఇన్నింగ్స్‌లో బుమ్రా బౌలింగ్ కూడా చేయలేకపోయాడు. గాయం కారణంగా బుమ్రా ఐపీఎల్ 2025 ప్రారంభ మ్యాచ్‌లలో కూడా ఆడలేకపోయాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరగనున్న సిరీస్‌లో బుమ్రా ఎన్ని మ్యాచ్‌లు ఆడతాడో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications