న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

‘నా కోడలు అదృష్ట దేవత-యువీ దశ తిరుగుతుంది’

చండీగఢ్‌: తనకు కాబోయే కోడలు అదృష్ట దేవతని అంటున్నాడు భారత క్రికెట్‌ స్టార్‌ యువరాజ్‌సింగ్‌ తండ్రి యోగ్‌రాజ్‌సింగ్‌. దీపావళి రోజున ఇండోనేషియాలోని బాలిలో బాలీవుడ్‌ నటి, బ్రిటన్ సంతతి మోడల్ హజెల్‌ కీచ్‌తో యువీ రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే.

Yograj Singh Feels Marrying Hazel Keech Will Change Yuvraj Singh's Fortunes

శుక్రవారం వాళ్లు భారత్‌ తిరిగొచ్చారు. ముంబై విమానాశ్రయంలో జంటగా కనిపించారు. కాగా, హజెల్‌ను జీవిత భాగస్వామిగా యువీ ఎంపిక చేసుకోవడంపై యోగ్‌రాజ్ స్పందిస్తూ.. ఇంతకుముందు యువీ ఓ సారి హజెల్ కీచ్‌ను తనకు పరిచయం చేసినట్లు చెప్పాడు. ఆమె చాలా మంచి అమ్మాయని తెలిపాడు.
'హజెల్‌ చాలా మంచి అమ్మాయి. యువీ అదృష్టాన్ని పూర్తిగా మార్చేస్తుందని నమ్ముతున్నా. ఆమెతో పెళ్లి తర్వాత టీమిండియాలో యువీ మళ్లీ చోటు దక్కించుకుంటాడు' అని యోగ్‌రాజ్‌ అన్నాడు.

'హజెల్‌కు క్రికెట్‌ అంటే పెద్దగా ఆసక్తి లేదు. ఇంట్లో యువీకి తలపోటు తప్పుతుంది. వాళ్లిద్దరి నిర్ణయంతో నేను సంతోషంగా ఉన్నా' అని యువీ తల్లి షబ్నమ్‌ చెప్పింది. కాగా, యువరాజ్ వివాహం వచ్చే ఫిబ్రవరిలో జరిగే అవకాశముంది.

Story first published: Tuesday, November 14, 2017, 10:03 [IST]
Other articles published on Nov 14, 2017
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X