Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యోయో టెస్టులో మరో కొత్త కోణం, పద్ధతి స్వస్తి పలకాలని...

Yo-Yo effect: BCCI for fitness tests before selection

హైదరాబాద్: ఆటగాళ్లలో ఆశను పెంచి యోయో టెస్టు విఫలం కావడంతో.. జట్టు నుంచి తప్పిస్తున్నారు. ఈ పద్ధతికి చరమగీతం పాడాలని సీఓఏ యోచిస్తోంది. ఈ క్రమంలో.. ఇక నుంచి ఆటగాళ్లకు యో యో నిర్వహించిన తర్వాతే జట్టు ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు బీసీసీఐ పాలకుల కమిటీ నిర్ణయించింది. అఫ్గాన్‌తో టెస్టు కోసం బీసీసీఐ ఎంపిక చేసిన టీమిండియాలో మహమ్మద్‌ షమి చోటు దక్కించుకున్నాడు.

షమీ..అంబటి రాయుడు, సంజు శాంసన్‌:

షమీ..అంబటి రాయుడు, సంజు శాంసన్‌:

కానీ, తర్వాత నిర్వహించిన యో యో టెస్టులో అతడు ఫెయిలవ్వడంతో జట్టు నుంచి తప్పించారు. తాజాగా ఇంగ్లాండ్‌ పర్యటన కోసం ఎంపిక చేసిన అంబటి రాయుడు, సంజు శాంసన్‌(భారత్‌-ఎ) కూడా యో యో టెస్టులో ఫెయిలవ్వడంతో జట్టులో చోటు కోల్పోయారు.

రాయుడు స్థానంలో సురేశ్‌ రైనాను తీసుకునట్లు

రాయుడు స్థానంలో సురేశ్‌ రైనాను తీసుకునట్లు

అంబటి రాయుడు స్థానంలో సురేశ్‌ రైనాను తీసుకునట్లు బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఇప్పటికే ప్రకటించింది. ఐతే, జట్టులో ఎంపిక చేసిన తర్వాత ఆటగాళ్లకు యో యో పరీక్ష నిర్వహించి.. ఫెయిలైన వారిని తప్పించడంపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం బీసీసీఐ పాలకుల కమిటీ సమావేశం నిర్వహించింది.

వినోద్‌ రాయ్‌, బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రి:

వినోద్‌ రాయ్‌, బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రి:

ఛైర్మన్‌ వినోద్‌ రాయ్‌, డయానా ఎడుల్జి, బీసీసీఐ సీఈవో రాహుల్‌ జోహ్రి, బీసీసీఐ జనరల్‌ మేనేజర్ సబా కరీం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఇక నుంచి ఆటగాళ్లకు యో యో టెస్టు నిర్వహించిన తర్వాతే జట్టు ఎంపిక ప్రక్రియ చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు.

ఐపీఎల్‌తో ఆటగాళ్లు బిజీగా ఉండటంతో ముందుగానే:

ఐపీఎల్‌తో ఆటగాళ్లు బిజీగా ఉండటంతో ముందుగానే:

‘అఫ్గానిస్థాన్‌తో ఏకైక టెస్టు, ఇంగ్లాండ్‌ పర్యటన కోసం బీసీసీఐ ఆటగాళ్లకు యో యో టెస్టు నిర్వహించకుండానే జట్టు సభ్యుల పేర్లను ప్రకటించాల్సి వచ్చింది. ఆ తర్వాత షమి, అంబటి రాయుడు యో యో టెస్టులో ఫెయిలయ్యారు. ఐపీఎల్‌ జరిగే సమయంలో ఈ జట్లను ప్రకటించాం. ఐపీఎల్‌తో ఆటగాళ్లు బిజీగా ఉండటంతోనే ముందు జట్టుకు ఎంపిక చేసి ఆ తర్వాత యో యో పరీక్ష నిర్వహించాల్సి వచ్చింది. ఇలా మరోసారి జరగదు' అని జోహ్రి చెప్పారు.

Story first published: Tuesday, June 19, 2018, 18:31 [IST]
Other articles published on Jun 19, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+