2020 టీమిండియా వన్డే క్రికెట్ రివ్యూ: మూడు విజయాలు.. ఆరు ఓటములు!

హైదరాబాద్: భారత్ వన్డే క్రికెట్‌కు ఈ ఏడాది నిరాశనే మిగిల్చింది. గతేడాది వరల్డ్ కప్ మినహా వరుస విజయాలతో మేటి జట్టుగా దూసుకెళ్లిన కోహ్లీసేన.. ఈ సంవత్సం మాత్రం ఊసురుమనిపించింది. కరోనా పుణ్యమా సిరీస్‌లే జరగకపోగా.. జరిగిన మ్యాచ్‌ల్లో కోహ్లీసేన దారుణంగా విఫలమైంది. ప్రాణాంతక వైరస్ కారణంగా టీమిండియా ఈ ఏడాది మూడు వన్డే సిరీస్‌ల్లో మొత్తం 9 మ్యాచ్‌లు మాత్రమే ఆడగా.. అందులో మూడంటే మూడే గెలిచింది. ఇక మూడు సిరీస్‌ల్లో ఒక్కదాన్నే సొంతం చేసుకుంది.

అది కూడా సొంతగడ్డపై ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 2-1తో గెలుపొందింది. ఓవరాల్‌గా ఈ ఏడాది టీమిండియా వన్డే ప్రయాణం మూడు విజయాలు.. ఆరు పరాజయాలుగా సాగింది. ఒక్కసారి ఈ మూడు సిరీస్‌లను గుర్తు చేసుకుందాం.

ఆస్ట్రేలియాతో విజయం..

ఆస్ట్రేలియాతో విజయం..

జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను కోహ్లీ సేన 2-1తో గెలిచి ఈ ఏడాదిని ఘనంగా ప్రారంభించింది. ఫస్ట్ వన్డేలో 10 వికెట్లతో చిత్తుగా ఓడినా చివరి రెండు వన్డేల్లో అద్భుతంగా రాణించి సూపర్ విక్టరీ అందుకుంది. ఈ సిరీస్‌లో రెండు హాఫ్ సెంచరీలతో రాణించిన విరాట్ కోహ్లీ (16, 78, 89)కి మ్యాన్ ఆఫ్ ద సిరీస్ లభించింది. ఫస్ట్ రెండు మ్యాచ్‌ల్లో శిఖర్ ధావన్ రాణించగా.. ఆఖరి వన్డేలో రోహిత్(119) సూపర్ సెంచరీతో చెలరేగాడు. రాహుల్ కూడా రాణించడంతో భారత్ విజయం సులువైంది.

కివీస్ క్లీన్ స్వీప్..

కివీస్ క్లీన్ స్వీప్..

ఈ సిరీస్ అనంతరం సుదీర్ఘ పర్యటన కోసం న్యూజిలాండ్‌లో అడుగుపెట్టిన భారత్.. అక్కడ మూడు వన్డేల సిరీస్‌లో 3-0తో క్వీన్ స్వీప్‌కు గురైంది. రోహిత్ శర్మ గైర్హాజరీ, విరాట్ కోహ్లీ వైఫల్యంతో భారత్ ఘోరపరాజయాన్ని చవిచూసింది. ఫస్ట్ వన్డేలో శ్రేయస్ అయ్యర్ (103) సెంచరీతో రాణించినా.. నాలుగు వికెట్లతో ఓటమిపాలైంది. రెండో వన్డేల్లోనూ అయ్యర్(52), జడేజా(55) మినహా అంతా విఫలమవ్వడంతో 22 పరుగులతో పరాజయాన్ని ఎదుర్కొంది. ఆఖరి వన్డేల్లో రాహుల్(112) సెంచరీ, అయ్యర్(62) హాఫ్ సెంచరీతో రాణించినా.. భారత్‌కు ఓటమి తప్పలేదు. 5 వికెట్లతో కివీస్ సూపర్ విక్టరీతో సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. కివీస్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన రాస్ టేలర్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.

ఆస్ట్రేలియాతో ఓటమి..

ఆస్ట్రేలియాతో ఓటమి..

కరోనాతో స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగాల్సిన మూడు వన్డేల సిరీస్ రద్దయింది. తొలి మ్యాచ్‌కు వర్షం అడ్డుపడగా.. మిగతా రెండు మ్యాచ్‌లును మహమ్మారి కారణంగా బీసీసీఐ రద్దు చేసింది. దాంతో 9 నెలలు క్రికెట్ నిలిచిపోయింది. మళ్లీ ఐపీఎల్‌తో భారత క్రికెట్ షురూ కాగా.. ఆస్ట్రేలియా పర్యటనతో వన్డే క్రికెట్ పట్టాలెక్కింది. ఈ సుదీర్ఘ పర్యటనలో ముందుగా మూడు వన్డేల సిరీస్ జరగ్గా.. భారత్ వరుసగా రెండిట్లో ఓడి సిరీస్ చేజార్చుకుంది.

కానీ ఆఖరి మ్యాచ్‌లో సమష్టిగా చెలరేగి ఓదార్పు విజయాన్నందుకుంది. ముఖ్యంగా యువ పేసర్ నటరాజన్ రాకతో భారత్ దశే మారిపోయింది. ఈ మ్యాచ్‌తోనే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఈ తమిళనాడు స్పిన్నర్ రెండు కీలక వికెట్లు తీశాడు. జడేజా(66 నాటౌట్), హార్దిక్ పాండ్యా(92 నాటౌట్) అజేయ ఇన్నింగ్స్ భారత విజయంలో కీలక పాత్ర పోషించింది. బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో రాణించిన స్మిత్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ వరించింది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts
Story first published: Monday, December 21, 2020, 15:49 [IST]
Other articles published on Dec 21, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X