Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇయర్ రివ్యూ 2016: ఘనంగా ముగించిన భారత క్రికెటర్లు

హైదరాబాద్: 2016 సంవత్సరాన్ని టీమిండియా క్రికెటర్లు ఘనంగా ముగించారు. ఈ ఏడాది చివరాంతానికి టీమిండియా టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగుతుండగా, వన్డే, టీ20ల్లోనూ అద్భుతంగా రాణించింది. ఇక జట్టుతో పాటు టీమిండియా ఆటగాళ్లు కూడా వ్యక్తిగతంగా ఈ ఏడాది సత్తా చాటారు.

మూడు ఫార్మెట్లలో కలిపి ఈ ఏడాది ముగ్గురు క్రికెటర్లు అత్యుత్తమ ఆటగాళ్లుగా నిలిచారు. వన్డేల్లో ప్రభావం చూపని కొందరు ఆటగాళ్లు టెస్టు, టీ20ల్లో మాత్రం అత్యుత్తమ ప్రదర్శన కనబర్చారు. ఈ ఏడాది ఐసీసీ ప్రకటించిన అవార్డుల్లో టెస్టు క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని సొంతం చేసుకున్న అశ్విన్ టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా నెంబర్ వన్ స్ధానంలో కొనసాగుతున్నాడు.

ఇక టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా బ్యాట్స్ మెన్‌గా కోహ్లీ నిలవగా, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జస్ ప్రీత్ బుమ్రా నిలిచాడు. 2016లో పలు రికార్డులను సొంతం చేసుకున్న భారత క్రికెటర్లు వీరే:

టెస్టుల్లో అత్యధిక పరుగులు

టెస్టుల్లో అత్యధిక పరుగులు

2016 సంవత్సరానికి గాను టెస్టుల్లో జో రూట్‌ 17 మ్యాచ్‌ల్లో 49.23 సగటుతో 1477 పరుగులు, బెయిర్‌స్టో 17 మ్యాచ్‌ల్లో 58.80 సగటుతో 1470 పరుగులు, అలిస్టర్ కుక్ 17 మ్యాచ్‌ల్లో 42.33 సగటుతో 1270 పరుగులు చేశారు. ఈ జాబితాలో టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ 12 మ్యాచ్‌ల్లో 75.93 సగటుతో 1215 పరుగులు చేసి నాలుగో స్థానంలో ఉన్నాడు.

టెస్టుల్లో అత్యధిక అత్యధిక వికెట్లు

టెస్టుల్లో అత్యధిక అత్యధిక వికెట్లు

ఈ ఏడాది టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న ఆటగాళ్లలో టీమిండియా స్ఫిన్నర్ రవిచంద్రన్‌ అశ్విన్‌ 12 మ్యాచ్‌ల్లో 23.90 సగటుతో 72 వికెట్లు తీసుకుని మొదటిస్ధానంలో నిలవగా, రంగనా హెరాత్ 9 మ్యాచ్‌ల్లో 19.12 సగటుతో 56 వికెట్లు, బ్రాడ్ 14 మ్యాచ్‌ల్లో 48 వికెట్లు తీసుకున్నారు. ఇక భారత ఆల్ రౌండర్ రవింద్ర జడేజా 9 మ్యాచ్‌ల్లో 23.18 సగటుతో 43 వికట్లు తీసి ఏడో స్థానంలో నిలిచాడు.

వన్డేల్లో అత్యధిక పరుగులు

వన్డేల్లో అత్యధిక పరుగులు

ఈ ఏడాది ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ 23 మ్యాచ్‌ల్లో 63.09 సగటుతో 1388 పరుగులు, స్టివెన్ స్మిత్ 26 మ్యాచ్‌ల్లో 50.17 సగటుతో 1154 పరుగులు, డీకాక్ 17 మ్యాచ్‌ల్లో 57.13 సగటుతో 857 పరుగులు చేశారు. ఇక భారత్ తరుపున విరాట్ కోహ్లీ 10 మ్యాచ్‌‌ల్లో 92.37 సగటుతో 739 పరుగులు చేసి ఏడో స్థానంలో నిలిచాడు.

వన్డేల్లో అత్యధిక వికెట్లు:

వన్డేల్లో అత్యధిక వికెట్లు:

ఈ ఏడాది వన్డేల్లో ఆడమ్‌ జంపా 19 మ్యాచ్‌ల్లో 27.80 సగటుతో 30 వికెట్లు, హేస్టింగ్స్ 15 మ్యాచ్‌ల్లో 24.13 సగటుతో 29 వికెట్లు, రషీద్ 17 మ్యాచ్‌ల్లో 28.34 సగటుతో 29 వికెట్లు తీశారు. భారత తరుపున నుంచి టాప్ టెన్‌లో ఏ ఒక్క బౌలర్‌కు కూడా చోటు దక్కక పోవడం విశేషం.

టీ20ల్లో అత్యధిక పరుగులు

టీ20ల్లో అత్యధిక పరుగులు

ఈ ఏడాది టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ నిలిచాడు. 641 పరుగులతో ఈ ఏడాది టీ20ల్లో విరాట్ కోహ్లీ నెంబర్ వన్ స్ధానంలో నిలిచాడు. ఇక టీ20ల్లో 28 వికెట్లు తీసుకుని అత్యధిక వికెట్లు తీసిన ఆటగాడిగా భారత్‌కు చెందిన జస్‌ప్రీత్‌ బుమ్రా నిలిచాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+