Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

ఇయర్ రివ్యూ 2016: టీమిండియా అద్భుత ప్రదర్శన

హైదరాబాద్: ఈ ఏడాది టీమిండియా అత్యుత్తమ ప్రదర్శనను కనబర్చింది. స్వదేశంలో జరిగిన ఐసీసీ వరల్డ్ టీ20 టైటిల్‌ను గెలుకోలేకపోవడం అభిమానులను నిరాశపరచినా, మొత్తం మీద మూడు ఫార్మాట్స్‌లోనూ టీమిండియా మెరుగైన ఆటతీరుని కనబరిచింది. రికార్డులు సృష్టిస్తూ కొన్ని చిరస్మరణీయ విజయాలను నమోదు చేసింది.

ఈ ఏడాది జనవరిలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన టీమిండియా ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్, మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్‌లను ఆడింది. వన్డేల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలాంటి ఆటగాళ్లు నిలదొక్కుకొని భారీ స్కోర్లు చేసినప్పటికీ, వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓటమి పాలైంది.

దీంతో 0-5తో వైట్ వాష్ తప్పదనుకున్న సమయంలో చివరి వన్డేలో యువ బ్యాట్స్‌మెన్ మనీశ్ పాండే రాణించడంతో 4-0తో భారత పరాజయం పాలైంది. కెరీర్‌లో తన తొలి వన్డే సెంచరీని నమోదు చేసి, విజయాన్ని అందించాడు. ఇక టీ20 సిరిస్‌లో భారత్ మెరుగ్గా ఆడి 3-0 తేడాతో ఆసీస్‌పై సిరిస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా జరిగిన వన్డే సిరిస్‌లో రోహిత్ శర్మ (441), విరాట్ కోహ్లీ (391), స్టీవెన్ స్మిత్ (315) పరుగులతో మొదటి మూడు స్థానాలను ఆక్రమించారు. టీ20 ఫార్మాట్‌లో కోహ్లీ (199), షేన్ వాట్సన్ (151), రోహిత్ శర్మ (143) పరుగులతో టాప్ 3 స్థానాల్లో నిలిచారు.

శ్రీలంకతో టీ20 సిరిస్

శ్రీలంకతో టీ20 సిరిస్

ఐసీసీ వరల్డ్ టీ20 టోర్నీకి సిద్ధమయ్యేందుకు వీలుగా శ్రీలంకతో భారత్ మూడు మ్యాచ్‌ల టీ20ల సిరీస్‌ను ఆడింది. మొదటి మ్యాచ్‌ని ఐదు వికెట్ల తేడాతో కోల్పోయినప్పటికీ, ఆ తర్వాత వరుసగా రెండు మ్యాచ్‌లను గెలిచి, సిరిస్‌ని కైవసం చేసుకుంది. శిఖర్ ధావన్ (106), దినేష్ చండీమల్ (74), చామర కపుగడేర (57) మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్ 9 వికెట్లతో మొదటిస్ధానంలో నిలిచాడు.

ఆసియా కప్

ఆసియా కప్

బంగ్లాదేశ్‌లో జరిగిన ఆసియా కప్ టీ20 టోర్నీలో టీమిండియా విజేతగా నిలిచింది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించి శుభారంభం చేసిన టీమిండియా ఆతర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను కూడా మట్టికరిపించింది. ఈ టోర్నీలో విరాట్ కోహ్లీ చెలరేగి ఆడాడు. ఆ తర్వాత శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) జట్లపై విజయాలను నమోదు చేసిన భారత్ ఫైనల్ చేరింది. టైటిల్ పోరులో మరోసారి బంగ్లాదేశ్‌ను ఢీ కొట్టిన ధోనీ సేనకు కోహ్లీ అద్భుతవిజయాన్ని అందించాడు.

వరల్డ్ టీ20లో టీమిండియా

వరల్డ్ టీ20లో టీమిండియా

ఆసియా కప్ టైటిల్‌ని చేజిక్కించుకుని అద్భుతమైన ఫామ్‌లో ఉన్న టీమండియా ఆ తర్వాత స్వదేశంలో జరిగిన వరల్డ్ టీ20 కప్‌ను కైవసం చేసుకుంటుందని అభిమానులు ఆశించారు. అందుకు తగినట్టుగానే భారత్ మెరుగైన ఆటతీరుని ప్రదర్శించింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను ఓడించి, ఐసిసి నిర్వహించే వన్డే, వరల్డ్ టీ20 ప్రపంచ కప్స్‌లో ఆ జట్టుపై తన ఆధిక్యాన్ని మరోసారి ప్రదర్శించింది. సెమీ ఫైనల్ వరకూ దూసుకొచ్చిన భారత్‌కు అక్కడ వెస్టిండీస్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ రెండు వికెట్లకు 192 పరుగుల చేసింది. రోహిత్ శర్మ 43, ఆజింక్య రహానే 40 పరుగులు చేసి అవుట్‌కాగా, విరాట్ కోహ్లీ 89, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ 15 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ మరో రెండు బంతులు మిగిలి ఉండగా, 3 వికెట్లు కోల్పోయి 196 పరుగులు సాధించి వరల్డ్ టీ20 విజేతగా అవతరించింది.

జింబాబ్వే పర్యటన

జింబాబ్వే పర్యటన

ఐపిఎల్ ముగిసిన తర్వాత చాలా మంది కీలక ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోగా, భారత జట్టు జింబాబ్వే పర్యనటకు వెళ్లింది. లోకేష్ రాహుల్ తన కెరీర్‌లో ఆడిన తొలి వన్డేలోనే సెంచరీ సాధించాడు. ఈ ఫీట్‌ను అందుకున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించాడు. ఆ సిరీస్‌ను టీమిండియా 3-0 తేడాతో కైవసం చేసుకుంది. టీ20 సిరీస్‌లో ఒక మ్యాచ్‌ని కోల్పోయినప్పటికీ, అతి కష్టం మీద మిగతా రెండు మ్యాచ్‌లను సాధించి, సిరీస్‌ను తన ఖాతాలో వేసుకుంది.

భారత్‌లో వెస్టిండిస్ పర్యటన

భారత్‌లో వెస్టిండిస్ పర్యటన

టీమిండియా వరుస టెస్టుల సిరీస్‌లు వెస్టిండిస్ పర్యటనతో మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇటీవల చెన్నైలో ఇంగ్లాండ్‌తో ముగిసిన చివరి టెస్టు వరకు టీమిండియా మొత్తం 12 టెస్టులాడింది. భారత్‌లో వెస్టిండిస్ జట్టు పర్యటనలో టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీని సాధించాడు. ఈ సిరిస్‌లో బ్యాటింగ్‌లో కోహ్లీ, బౌలింగ్‌లో అశ్విన్ తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరిచారు. తొలి టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్ 92 పరుగుల తేడాతో విజయం సాధించగా రెండో టెస్టు డ్రాగా ముగిసింది. మూడో టెస్టు వర్షం కారణంగా రద్దయింది.

అమెరికాలో భారత్, వెస్టిండిస్ టీ20 సిరిస్

అమెరికాలో భారత్, వెస్టిండిస్ టీ20 సిరిస్

అమెరికాలో క్రికెట్‌ను ప్రోత్సహించే ప్రయత్నంలో భారత్, వెస్టిండీస్ జట్లు అమెరికాలో టీ20 సిరీస్‌ను ఫ్లోరిడాలో ఆడాయి. హోరాహోరీగా సాగిన మొదటి మ్యాచ్‌ని వెస్టిండీస్ ఒక పరుగు తేడాతో విజయం సాధించింది. ఇక రెండో మ్యాచ్ వర్షం కారణంగా జరగలేదు.

భారత్‌లో న్యూజిలాండ్‌ పర్యటన

భారత్‌లో న్యూజిలాండ్‌ పర్యటన

ఈ ఏడాది అక్టోబర్-నవంబర్‌లో న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటించింది. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు, వన్డే సిరిస్‌లలో టీమిండియా మెరుగైన ప్రదర్శనను కనబర్చింది. అన్ని విభాగాల్లోనూ రాణించిన భారత్ 3-0 తేడాతో న్యూజిలాండ్‌పై టెస్టు సిరిస్‌ను కైవసం చేసుకుంది. దీంతో టెస్టుల్లో టీమిండియా నెంబర్ వన్ ర్యాంకుని సొంతం చేసుకుంది. ఈ సిరీస్‌లో కోహ్లీ రెండో డబుల్ సెంచరీ చేశాడు. ఇక పోటా పోటీగా సాగిన వన్డే సిరీస్‌లో ఇరు జట్లు చెరి రెండు మ్యాచ్‌లను సాధించిన ఇరు జట్లు సమవుజ్జీలుగా నిలిచాయి. విశాఖపట్నంలో జరిగిన చివరి వన్డేలో భారత బౌలర్లు చెలరేగిపోవడంతో కివీస్ 79 పరుగులకే ఆలౌటైంది. అమిత్ మిశ్రా కేవలం 18 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టి భారత్ గెలుపులో కీలకపాత్ర పోషించాడు.

భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్

భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్

న్యూజిలాండ్ సిరీస్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లోనూ టీమిండియా తన ఆధిపత్యాన్ని కనబరచింది. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు సిరిస్‌లో టీమిండియా ఆటగాళ్లు పలు రికార్డులను నమోదు చేశారు. ఇంగ్లాండ్ సిరిస్‌లో టెస్టుల్లో కెప్టెన్ కోహ్లీ మూడోసారి డబుల్ సెంచరీ చేశాడు. ఇంగ్లాండ్ సిరిస్‌లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన యువ బ్యాట్స్‌మన్ కరుణ్ నాయర్ చివరిదైన చెన్నై టెస్టులో ట్రిపుల్ సెంచరీ చేసి చరిత్ర సృష్టించాడు. సెహ్వాగ్ తర్వాత భారత్ తరుపున టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు నమోదు చేశాడు.

Story first published: Monday, November 13, 2017, 12:13 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+