Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Year Ender 2024: ఈ ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన 26 మంది క్రికెటర్లు వీళ్లే!

మరో కొన్ని రోజుల్లో 2024 పూర్తికానుంది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా క్రికెట్‌లో ఎన్నో స్మృతులు. అయితే ఈ ఏడాది భారత క్రికెట్ అభిమానులకు మరింత ప్రత్యేకంగా నిలిచిపోతుంది. 11 ఏళ్ల తర్వాత టీమిండియా ఐసీసీ ట్రోఫీని అందుకుంది. రోహిత్ శర్మ సారథ్యంలో భారత్ టీ20 ఫార్మాట్‌లో విశ్వవిజేతగా నిలిచింది. అలాగే సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో వైట్ వాష్ ఓటమి వంటి చేదు జ్ఞాపకాలను ఈ ఏడాది మిగిల్చింది.

అయితే ఈ ఏడాది 27 మంది ప్రముఖ క్రికెటర్లు రిటైర్మెంట్ ప్రకటించడం గమనార్హం. ఇందులో కొందరు కొన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలకగా, మరికొందరు ఆట మొత్తానికి గుడ్‌బై పలికారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి స్టార్ క్రికెటర్లు ప్రపంచకప్‌ను ముద్దాడి టీ20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ పలికారు. కాగా, 2024లో వీడ్కోలు పలికిన క్రికెటర్ల పూర్తి జాబితా ఇదే...

Year Ender 2024 List of International Cricketers Who Retired This Year

డీన్ ఎల్గర్
సౌతాఫ్రికా ఓపెనర్ డీన్ ఎల్గర్ అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. 86 టెస్టులు, 8 వన్డేలు ఆడిన ఎల్గర్ తన చివరి మ్యాచ్‌ను భారత్‌పై ఆడాడు.ఈ ఏడాది ఆరంభ టెస్టులో ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడాడు. టెస్టుల్లో 37.92 సగటుతో 5347 పరుగులు చేశాడు. 14 సెంచరీలు, 23 హాఫ్ సెంచరీలు బాదాడు. డీన్ ఎల్గర్ సౌతాఫ్రికాకు సారథిగానూ బాధ్యతలు వహించాడు.

డేవిడ్ వార్నర్
గతేడాది జూన్‌లో టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన డేవిడ్ వార్నర్ ఈ ఏడాది ఆరంభంలో వన్డేలకు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ముగిసిన అనంతరం అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పాడు. అనంతరం ఇటీవల తిరిగి రీఎంట్రీ ఇస్తానని వార్నర్ పలు సందర్భాల్లో పేర్కొన్నప్పటికీ.. అతని మాటలను క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సీరియస్‌గా తీసుకోలేదు. ప్రస్తుతం వార్నర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు.

స్టార్ ప్లేయర్లు గుడ్‌బై
ఈ ఏడాది విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే 2024లో ఇద్దరు స్టార్ టీమిండియా వికెట్ కీపర్లు కూడా ఆటకు వీడ్కోలు పలికారు. వృద్ధిమాన్ సాహా, దినేశ్ కార్తీక్ రిటైర్మెంట్ ప్రకటించారు. జూన్‌లో డీకే, నవంబర్‌లో సాహా గుడ్‌బై చెప్పారు. కార్తీక్ 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20లు ఆడాడు. భారత్ తరఫున సాహా 40 టెస్టులు, 9 వన్డేలకు ప్రాతినిథ్యం వహించాడు. శిఖర్ ధావన్‌ కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.

2024లో రిటైర్మెంట్ పలికిన ఆటగాళ్ల జాబితా
డీన్ ఎల్గర్ (అన్ని ఫార్మాట్లు)
డేవిడ్ వార్నర్ (అన్ని ఫార్మాట్లు)
హెన్రిచ్ క్లాసెన్ (టెస్టులు)
దినేశ్ కార్తీక్ (అన్ని ఫార్మాట్లు)
కేదార్ జాదవ్ (అన్ని ఫార్మాట్లు)
విరాట్ కోహ్లి (టీ20లు)
రోహిత్ శర్మ (టీ20లు)
రవీంద్ర జడేజా (టీ20లు)
జేమ్స్ అండర్సన్ (అన్ని ఫార్మాట్లు)
శిఖర్ ధావన్ (అన్ని ఫార్మాట్లు)
డేవిడ్ మలన్ (అన్ని ఫార్మాట్లు)
మొయిన్ అలీ (అన్ని ఫార్మాట్లు)
షకిబ్ అల్ హసన్ (టెస్టులు-టీ20లు)
మహ్మదుల్లా (టీ20లు)
మాథ్యూ వేడ్ (అన్ని ఫార్మాట్లు)
వృద్ధిమాన్ సాహా (అన్ని ఫార్మాట్లు)

సౌరభ్ తివారి (అన్ని ఫార్మాట్లు)
వరుణ్ ఆరోన్ (అన్ని ఫార్మాట్లు)
నేల్ వాగ్నర్ (అన్ని ఫార్మాట్లు)
కొలిన్ మున్రో (అన్ని ఫార్మాట్లు)
డేవిడ్ వైస్ (అన్ని ఫార్మాట్లు)
సైబ్రాండ్ ఎంగెల్‌బ్రెచ్ట్ (అన్ని ఫార్మాట్లు)
బ్రెయిన్ మసాబా (టీ20లు)
షానన్ గాబ్రియెల్ (అన్ని ఫార్మాట్లు)
విల్ పుకోవ్సీకీ (అన్ని ఫార్మాట్లు)
బరిందర్ శ్రాన్ (అన్ని ఫార్మాట్లు)
సిద్ధార్థ్ కౌల్ (దేశవాళీ క్రికెట్)

Story first published: Saturday, December 7, 2024, 16:18 [IST]
Other articles published on Dec 7, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+