Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Year ender 2023- క్రికెట్‌లో వివాదాలు: ధోనీ-కోహ్లి- గంభీర్-శ్రీశాంత్

మరో కొన్ని రోజుల్లో 2023 పూర్తికానుంది. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా క్రికెట్ లో ఎన్నో స్మృతులు. అయితే ఈ ఏడాది గతం కంటే కొంచెం స్పెషల్. వన్డే వరల్డ్ కప్ లో సచిన్ టెండుల్కర్ రికార్డును విరాట్ కోహ్లి అధిగమించడంతో పాటు ఎన్నో రికార్డులు బద్దలయ్యాయి. అయితే ఈ ఏడాది వివాదాలు, వాగ్వాదాలు కూడా జరిగాయి. వాటిలో కొన్ని సద్దుమణిగాయి. మరికొన్ని అలానే వివాదాస్పందంగా మిగిలిపోయాయి.

ఐపీఎల్ లో బెంగళూరు-లక్నో మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్ మధ్య జరిగిన వాగ్వాదం అందర్ని షాక్ కు గురిచేసింది. అంతకుముందు కోహ్లితో అఫ్గానిస్థాన్ ప్లేయర్ నవీనుల్ హక్ ఓవర్ యాటిట్యూడ్ గా ప్రవర్తించాడు. దీంతో మ్యాచ్ అనంతరం కోహ్లి-గంభీర్-నవీనుల్ వాగ్వాదంతో స్టేడియం హీటెక్కిపోయింది.

Year ender 2023- Controversies and arguments in 2023 cricket. Ms Dhoni,virat Kohli are also there.

అయితే కొన్ని నెలల తర్వాత జరిగిన వన్డే వరల్డ్ కప్ లో కోహ్లి-నవీనుల్ ఫైట్ కు ఫుల్ స్టాఫ్ పడింది. కోహ్లితో గొడవ ఎఫెక్ట్ కారణంగా నవీనుల్ చాలా ఇబ్బంది పడ్డాడు. కోహ్లి ఫ్యాన్స్ నవీనుల్ ను ఉద్దేశించి కోహ్లి..కోహ్లి నినాదాలతో అతడిని ఓ ఆట ఆడుకున్నారు. భారత్-అఫ్గాన్ మ్యాచ్ లోనూ ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో కోహ్లి రియాక్ట్ అయ్యాడు. అలా చేయొద్దని ఫ్యాన్స్ కు సూచించాడు. దాంతో కోహ్లికి నవీనుల్ థ్యాంక్స్ చెప్పడంతో గొడవకు ముగింపు లభించింది.

ఇటీవల సీనియర్ ప్లేయర్లు గంభీర్-శ్రీశాంత్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. లెజెండ్స్ లీగ్ క్రికెట్ లో ఈ సంఘటన జరిగింది. శ్రీశాంత్ బౌలింగ్ లో గంభీర్ వరుసగా సిక్సర్, ఫోర్ బాదాడు. ఆ తర్వాత ఇద్దరూ సీరియస్ లుక్ లోకి వెళ్లిపోయారు. కాసేపటికీ ఇద్దరి మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరింది. అంపైర్లు రావడంతో ఆ టైమ్ కు గొడవ కాసేపు సద్దుమణిగింది. అయితే ఆ తర్వాత శ్రీశాంత్ సోషల్ మీడియాలో గంభీర్ ను ఉద్దేశిస్తూ వ్యాఖ్యలు చేశాడు. తనని ఫిక్సర్ అంటూ కొన్ని బూతులు అన్నాడని పోస్ట్ లు పెట్టాడు. దీనిపై LLC నిర్వాహకులు శ్రీశాంత్ కు లీగల్ నోటీసులు పంపించింది. ఇప్పటికీ గంభీర్-శ్రీశాంత్ వివాదాం కంటిన్యూ అవుతూనే ఉంది.

Year ender 2023- Controversies and arguments in 2023 cricket. Ms Dhoni,virat Kohli are also there.

సాధారణంగా మ్యాచ్ ముగిసిన అనంతరం ఇరు జట్ల ప్లేయర్లు షేక్ హ్యాండ్ చేసుకుంటారు. కానీ వన్డే వరల్డ్ కప్ లో బంగ్లాదేశ్-శ్రీలంక మ్యాచ్ ముగిసిన తర్వాత అలా జరగలేదు. దానికి కారణం లంక ప్లేయర్ మాథ్యూస్ 'టైమ్డ్ ఔట్'గా వెనుదిరగడమే. హెల్మెట్ స్ట్రిప్ సమస్యతో ఆలస్యమైందని బంగ్లా ప్లేయర్లకు మాథ్యూస్ ఎంత నచ్చజెప్పినా ఫలితం లేకపోయింది. బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ ఔట్ ను వెనక్కి తీసుకోలేదు. దీంతో మ్యాచ్ అనంతరం బంగ్లా ప్లేయర్లకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి లంక ప్లేయర్లు నిరాకరించారు.

ఆస్ట్రేలియా ప్లేయర్ మిచెల్ మార్ష్ అహంకారం కూడా వివాదాస్పదంగా మారింది. ఫైనల్లో టీమిండియాపై గెలిచి ఆసీస్ ఛాంపియన్ గా నిలిచింది. అయితే ప్రపంచకప్ పై మార్ష్ కాళ్లు పెట్టి ఫొటోకు ఫోజులు ఇచ్చాడు. కప్ కోసం కలలు కనే మనకు ఇది ఎంతో బాధగా అనిపించింది. కొంతమంది అభిమానులు భారతీయుల మనోభావాలను దెబ్బతీశాడని మార్ష్ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైట్ కూడా చేశారు.

ఎంఎస్ ధోనీ కూడా ఓ విషయంలో విమర్శలపాలయ్యాడు. ఐపీఎల్ లో చెన్నై- గుజరాత్ మధ్య జరిగిన తొలి క్వాలిఫైయర్‌ మ్యాచ్ లో పథిరను బౌలింగ్ చేయడానికి అంపైర్లు అంగీకరించలేదు. మైదానాన్ని పథిరన వీడటంతో అతడు బౌలింగ్ చేయడానికి మరో 4 నిమిషాలు అవసరమని అంపైర్లు చెప్పారు. దీంతో ఆ టైమ్ పూర్తయ్యే వరకు ధోనీ అంపైర్లతో వాదించాడు. తర్వాత పథిరనతో బౌలింగ్ చేయించాడు. అయితే స్లో ఓవర్ రేటు కారణంగా చివరి రెండు ఓవర్లలో సర్కిల్ లోపు అదనపు ఫీల్డర్ ను ఉంచాడు. అంపైర్లతో చర్చిస్తున్న కారణం చూపిస్తూ ధోనీ కాసేపు మ్యాచ్ నిలిపివేయడంపై విమర్శలు వచ్చాయి.

Story first published: Monday, December 11, 2023, 12:06 [IST]
Other articles published on Dec 11, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+