
సురేశ్ రైనా నిష్క్రమణ!
కరోనా అనంతరం ఐపీఎల్ 2020 సీజన్‌తో భారత క్రికెట్ రీస్టార్ట్ కాగా.. ఈ సీజన్ ప్రారంభానికి ముందే టీమిండియా సీనియర్ క్రికెటర్ సురేశ్ రైనా వ్యవహారం వివాదాస్పదమైంది. ఐపీఎల్ 2020 సీజన్ కోసం దుబాయ్ వెళ్లిన రైనా.. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో లీగ్ నుంచి తప్పుకోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. హోటల్ గదిలో చోటు చేసుకున్న వివాదంతోనే రైనా తప్పుకున్నాడనే ప్రచారం జరిగింది. దానికి తోడు చెన్నై సూపర్ కింగ్స్ యజమాని ఎన్ శ్రీనివాసన్ రైనాకు విజయ గర్వం తలకెక్కిందనే వ్యాఖ్యలు మరింత దుమారాన్ని రేపాయి. ఆ తర్వాత రైనా వివరణ ఇచ్చుకున్నా.. జట్టు మేనేజ్మెంట్తో ఏదో జరిగిందనే వాదన ఇప్పటికీ ఉంది.

నీ భార్యను 14 రోజులు ఇవ్వూ..
ఇంగ్లండ్ విధ్వంసకర ఆల్‌రౌండర్, బెన్ స్టోక్స్‌పై వెస్టిండీస్ క్రికెటర్ మార్లోన్ శామ్యూల్స్ సోషల్ మీడియా వేదికగా చేసిన కామెంట్స్ కూడా తీవ్ర దుమారాన్ని రేపాయి. శామ్యూల్స్.. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా.. ఓ అంతర్జాతీయ క్రికెటరనే సోయి మరిచి '14 రోజులు నీ భార్యను ఇవ్వంటూ'స్టోక్స్‌పై రాయలేని పదజాలంతో కామెంట్స్ చేశాడు. కరోనా క్వారంటైన్‌ను ఉద్దేశించి ఈ కష్టం తన బద్ద శతృవైన శామ్యూల్స్‌కు కూడా రావద్దని కోరుకుంటానని బెన్ స్టోక్స్ చేసిన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్న శామ్యూల్స్.. అతనిపై బుతుపురాణం అందుకున్నాడు. .‘ఈ తెల్లోడు ఇంకా నా గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. 14 రోజులు నీ భార్యను పంపించరా.. 14 సెకన్లలో జమైకన్‌గా మార్చుతా.'అంటూ రాయలేని పదాలతో వరుస పోస్ట్ పెట్టాడు. ఇక శామ్యూల్స్ తీరుపై యావత్ క్రికెట్ ప్రపంచం ఆగ్రహం వ్యక్తం చేసింది.

రోహిత్ శర్మ గాయం..
ఐపీఎల్ 2020 సీజన్ లీగ్ దశ సందర్భంగా తొడ కండరాల గాయానికి గురైన రోహిత్ శర్మ కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు. దాంతో భారత సెలెక్టర్లు ఆస్ట్రేలియాకు ఎంపిక చేసిన జట్లలో రోహిత్‌కు చోటివ్వలేదు. కానీ టీమ్స్ ప్రకటించిన వెంటనే రోహిత్ ముంబై తరఫున బరిలోకి దిగాడు. దాంతో టీమ్ సెలెక్షన్‌పై తీవ్ర దుమారం రేగింది. పైగా రోహిత్ ఫైనల్లో హాఫ్ సెంచరీతో రాణించి జట్టుకు ఐదో టైటిల్ అందించడంతో ఈ వ్యవహారం మరింత దుమారం రేపింది. ఇక టీమ్ సెలెక్షన్‌ను సమరించిన భారత సెలెక్షన్ కమిటీ రోహిత్‌కు టెస్ట్‌ల్లో అవకాశం కల్పించింది. కానీ రోహిత్ జట్టుతో వెళ్లకుండా భారత్‌కు తిరిగి రావడం.. గాయం తీవ్రంగా ఉన్న ఐపీఎల్‌కు ప్రాధాన్యం ఇవ్వడం విమర్శలకు దారి తీశాయి.

గవాస్కర్ డబుల్ మీనింగ్ డైలాగ్స్..
ఐపీఎల్ 2020 సీజన్ సందర్భంగా విరాట్ కోహ్లీ వైఫల్యాన్ని ప్రస్తావిస్తూ కామ్ బాక్స్‌లో సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. లాక్డౌన్ సమయంలో కోహ్లీ అనుష్క శర్మ బంతులతో ఇంట్లో ప్రాక్టీస్ చేశాడని, అందుకే ఇప్పుడు రాణించలేకపోతున్నాడని వ్యాఖ్యానించాడు. అయితే ఈ వ్యాఖ్యలను కొందరు ఆకతాయిలు డబుల్ మీనింగ్ అర్థం వచ్చేలా ఎడిట్ చేసి వైరల్ చేయడంతో తీవ్ర వివాదాస్పదమయ్యాయి. అనుష్క శర్మ సైతం గవాస్కర్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఘాటుగా స్పందించింది. తన భర్త ఆటలోకి తననెందుకు లాగుతున్నారని నిలదీసింది. ఇక గవాస్కర్ కూడా తాను ఎవరిని బాధపెట్టెలా వ్యాఖ్యలు చేయలేదని, కొందరూ తన వ్యాఖ్యలను వక్రీకరించారని వివరణ ఇచ్చుకున్నాడు.

తమ్ముడూ.. నాకెరీర్ అంత లేదు నీ వయసు
లంక ప్రీమియర్ లీగ్(ఎల్పీఎల్)లో అఫ్గాన్ యువ పేసర్ నవీన్ ఉల్ హక్, పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ షాహిద్ అఫ్రిది మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం తీవ్ర చర్చనీయాంశమైంది. తమ టీమ్ ప్లేయర్ మహ్మద్ ఆమీర్‌పై ఆగ్రహానికి గురైన నవీన్‌ను మ్యాచ్ అనంతరం అఫ్రిది మందలించే ప్రయత్నం చేశాడు. కానీ అఫ్గాన్ యువ క్రికెటర్ ధీటుగా బదులివ్వడంతో వివాదానికి దారి తీసింది. మైదానంలో ప్రత్యర్థులను గౌరవించాలని, ఇంత కోపం పనికిరాదని మాత్రమే నవీన్‌కు చెప్పానని అఫ్రిది వివరణ ఇచ్చుకున్నాడు.
పుకోవిస్కి బీ కేర్ ఫుల్.. మా బౌలర్లు నీ బలహీనతతో ఆడుకుంటారు: సునీల్ గవాస్కర్