
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ కావడం ఇప్పుడు అంతటా చర్చనీంశంగా మారింది. ఈ నేపథ్యంలో టీమిండియా స్పిన్నర్ యజుర్వేంద్ర చాహల్ రోహిత్ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అవడంపై స్పందించాడు. తన అధికారిక ట్విట్టర్ వేదికగా రోహిత్ ట్విట్టర్ ఖాతా నుంచి వచ్చిన ట్వీట్లను పోస్టు చేసి అసలు ఏం జరుగుతుంది రోహిత్ భయ్యా? సబ్ తీక్ హై నా? అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం చాహల్ చేసిన కామెంట్ నెట్టింట వైరల్‌గా మారింది.
కాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. హిట్‌మ్యాన్ ట్విట్టర్ ఖాతా నుంచి వస్తున్న అర్థం పర్థం లేని ట్వీట్లు ఇదే విషయాన్ని తెలియచేస్తున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా రోహిత్ శర్మ అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. నేడు రోహిత్ శర్మ ట్విట్టర్ ఖాతా నుంచి తనకు కాయిన్ టాస్‌లంటే ఇష్టమని, అవి తన కడుపులో ఎప్పుడు చేరుతాయోనని ఓ ట్వీట్ వచ్చింది. మన గురించి ప్రసారమయ్యే గుసగుసలతో బాక్సింగ్ బ్యాగ్ నిండిపోతుందని మరో ట్వీట్ వచ్చింది. అలాగే క్రికెట్ బాల్స్‌ని తినేయొచ్చు.. కరెక్టే కదా? అంటూ మరో ట్వీట్ కూడా వచ్చింది.
ఎప్పుడూ లేనిది రోహిత్ ట్విట్టర్ ఖాతా నుంచి ఇలాంటి పోస్టులు రావడంతో అభిమానులతోపాటు నెటిజన్లు అయోమయానికి గురవుతున్నారు. రోహిత్ శర్మకు ఏమైందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా హిట్‌మ్యాన్ ట్విట్టర్ ఖాతా నుంచి అర్థం పర్థం లేని ట్వీట్లు వస్తుండడంతో అతని అకౌంట్ హ్యాక్ అయి ఉంటుందని అభిమానులతోపాటు నెటిజన్లు భావిస్తున్నారు. పలువురు రోహిత్ శర్మ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందంటూ ట్విట్టర్లో పోస్టులు చేస్తున్నారు. దీంతో ప్రస్తుతం నెట్టింట ఇవి వైరల్‌గా మారాయి. అయితే దీనిపై రోహిత్ శర్మ ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం హిట్‌మ్యాన్ శ్రీలంకతో టెస్ట్ సిరీస్ సన్నాహాకాల్లో భాగంగా బిజీగా ఉన్నాడు. దీనిపై వీలైనంత త్వరగా రోహిత్ శర్మ క్లారిటీ ఇవ్వాలని అభిమానులు కోరుతున్నారు.