న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

ఫీల్డింగ్‌ తప్పిదాలతో పాక్‌ భారీ మూల్యం: బంతిని కాలుతో నెట్టి మరీ ఫోర్(వీడియో)

Yasir Shah, Shan Masood were probably yawning: Wasim Akram slams Pakistan fielding on Day 1 of Pink ball Test

హైదరాబాద్: అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డే నైట్ టెస్టులో పాకిస్థాన్ ఫీల్డింగ్‌లో నిరాశ పరుస్తోంది. తమ పేలవ ఫీల్డింగ్‌తో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. దీంతో పాకిస్థాన్ ఆటగాళ్ల ఫీల్డింగ్‌పై ఆ దేశ మాజీ క్రికెట్ దిగ్గజం వసీం అక్రమ్‌ మండిపడ్డాడు. నిద్ర మత్తులో ఫీల్డింగ్‌ చేస్తున్నారా? అంటూ విమర్శించాడు.

"షాహీన్‌ అఫ్రిది ఊహాలోకంలో ఉన్నట్లు, యాషిర్‌షా, షాన్‌ మసూద్‌ నిద్రమత్తుతో ఉన్నట్లు ఫీల్డింగ్‌ చేశారు. పాక్ క్రికెట్‌కు ఫీల్డింగ్ అతిపెద్ద సమస్య. బంతిపై దృష్టి కేంద్రీకరించాలి. ఫీల్డర్‌ వెనుక బ్యాకప్‌గా ఎవరూ ఫీల్డింగ్ చేయట్లేదు. నేను ఫీల్డింగ్‌ చేసేటప్పుడు బౌండరీ లైన్‌ దగ్గరగా కాకుండా పది గజాల ముందే నిలబడేవాడిని" అని వసీం అక్రమ్ అన్నాడు.

నాలుగో బ్యాట్స్‌మన్: టెస్టుల్లో తొలి ట్రిపుల్ సెంచరీ బాదిన డేవిడ్ వార్నర్నాలుగో బ్యాట్స్‌మన్: టెస్టుల్లో తొలి ట్రిపుల్ సెంచరీ బాదిన డేవిడ్ వార్నర్

పాకిస్థాన్ వైఫల్యం

కాగా, అడిలైడ్ వేదికగా శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో తొలిరోజు ఫీల్డింగ్‌లో పాకిస్థాన్ వైఫల్యం చెందింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. యాసిర్‌ షా, మసూద్‌లతో పాటు షాహిన్‌ అఫ్రిది ఫీల్డింగ్‌లో నిరాశపరిచాడు. బౌండరీ వెళ్లకుండా ఆపాల్సిన బంతిని కాలితో తన్ని మరీ బౌండరీకి పంపించాడు.

ఫీల్డింగ్‌ తప్పిదాలతో పాక్‌ భారీ మూల్యం

ఫీల్డింగ్‌ తప్పిదాలతో పాక్‌ భారీ మూల్యం చెల్లించుకుంది. తొలిరోజు ఓవర్‌త్రో పరుగులతో డేవిడ్ వార్నర్‌కు హాఫ్ సెంచరీ సాధించాడు.

బంతిని కాలుతో నెట్టి మరీ ఫోర్

ఆ తర్వాత డేవిడ్ వార్నర్ 76 పరుగుల వద్ద ఉన్నప్పుడు డీప్‌ కవర్‌ మీదుగా షాట్‌ ఆడాడు. పాక్‌ ఫీల్డర్‌ అక్కడికి వెళ్లకుండా అక్కడే నిలబడి చూస్తున్నాడు. దీంతో డేవిడ్ వార్నర్‌కు బౌండరీ లభించింది. ఆ తర్వాత అఫ్రీది బౌండరీని ఆపే క్రమంలో బంతిని కాలుతో నెట్టాడు. దీంతో అది కాస్త ఫోర్‌గా మారింది.

డేవిడ్ వార్నర్ ట్రిపుల్ సెంచరీ

302/1 ఓవర్‌ నైట్‌ స్కోరుతో రెండో రోజు ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఆస్ట్రేలియా డేవిడ్ వార్నర్ 389 బంతుల్లో 37 బౌండరీల సాయంతో ట్రిపుల్ సెంచరీ సాధించాడు. టెస్టుల్లో వార్నర్‌కి ఇదే తొలి ట్రిపుల్ సెంచరీ. ఆసీస్ తరుపున ట్రిపుల్ సెంచరీ సాధించిన ఏడో బ్యాట్స్‌మన్‌గా వార్నర్ నిలిచాడు. అడిలైడ్ ఓవల్ పిచ్‌పై ఓ ప్లేయ‌ర్ ట్రిపుల్ సెంచ‌రీ చేయ‌డం ఇదే మొద‌టిసారి. 2012 తర్వాత ఆస్ట్రేలియా తరుపున ట్రిపుల్ సెంచరీ సాధించిన ఆటగాడిగా డేవిడ్ వార్నర్ నిలిచాడు.

Story first published: Saturday, November 30, 2019, 14:11 [IST]
Other articles published on Nov 30, 2019
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X