లార్డ్స్‌లో గెలుపుని విభిన్నంగా సెలబ్రెట్ చేసుకున్న పాక్
లార్డ్స్: ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండుతో జరిగిన తొలి టెస్టులో పాకిస్తాన్ జట్టు విజయం సాధించింది. తమ విజయంపై పాక్ జట్టు విభిన్నంగా సంబరాలు చేసుకుంది. దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత ఈ మైదానంలో పాక్‌కు ఇది తొలి గెలుపు.
అందుకే విజయం సాధించిన వెంటనే పాకిస్తాన్ క్రికెటర్లు పుషప్‌లు తీశారు. పాక్ జట్టు గెలవగానే సీనియర్ బ్యాట్స్‌మన్ యూనిస్ ఖాన్ క్రికెటర్లందరి చేతా ఒక్కొక్కరి చేత ఐదు చొప్పున పుషప్స్ తీయించాడు. అనంతరం వారంతా జాతీయగీతం పాడుతూ పాకిస్తాన్ జెండాకు సెల్యూట్ చేశారు.

అంతకు ముందు తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన తర్వాత కెప్టెన్ మిస్బా కూడా పుషప్‌లు తీశాడు. ఇంగ్లండ్ పైన సెంచరీ చేసిన ప్రతీసారి పుషప్‌లు తీస్తానని పాకిస్తాన్ ఆర్మీకి మాట ఇచ్చినట్టు మిస్బా అనంతరం తెలిపాడు.
Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Log in for Better Reading Experience!
By signing in, you agree to our Terms and Privacy Policy
Gender
Select your Gender
- Male
- Female
- Others
Age
Select your Age Range
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications