Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అశ్విన్ వల్ల కాలేదు: 82 ఏళ్ల రికార్డ్‌ను బద్దలు కొట్టిన పాక్ స్పిన్నర్

Yasir Shah becomes quickest to 200 Test wickets, breaks 82-year-old record

హైదరాబాద్: పాకిస్థాన్ లెగ్ స్పిన్నర్ అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా స్పిన్నర్ యాసిర్ షా చరిత్ర సృష్టించాడు. అబుదాబి వేదికగా న్యూజిలాండ్‌‌తో జరుగుతోన్న మూడో టెస్టు నాలుగో రోజు విలియం సోమర్‌విల్లేను ఔట్ చేయడం ద్వారా యాసిర్ షా ఈ ఘనత సాధించాడు.

ఈ క్రమంలో యాసిర్ షా 82 ఏళ్ల అరుదైన రికార్డును బద్దలు కొట్టాడు. 1936లో ఆస్ట్రేలియా లెగ్ స్పిన్నర్ క్లారీ గ్రిమ్మెట్ నెలకొల్పిన రికార్డును యాసిర్ షా అధిగమించాడు. క్లారీ 36 మ్యాచ్‌ల్లో 200 వికెట్లు తీయగా యాసిర్ షా కేవలం 33 మ్యాచ్‌ల్లోనే ఈ అరుదైన మైలురాయిని చేరుకోవడం విశేషం.

యాసిర్ షా (పాకిస్థాన్ - 200 వికెట్లు - 33 టెస్టులు)

యాసిర్ షా (పాకిస్థాన్ - 200 వికెట్లు - 33 టెస్టులు)

32 ఏళ్ల యాసిర్ షా వివాదాస్పద బౌలింగ్ యాక్షన్ కారణంగా యీద్ అజ్మల్‌పై ఐసీసీ నిషేధం విధించడంతో.. అతడి స్థానంలో జట్టులోకి వచ్చాడు. గత కొన్నేళ్లుగా పాక్ విజయాల్లో యాసిర్ షా కీలక పాత్ర పోషిస్తున్నాడు. 17 టెస్టుల్లోనే 100 వికెట్లు తీసిన యాసిర్ షా... ఆ తర్వాత 100 వికెట్లను 16 మ్యాచ్‌ల్లో సాధించాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడు టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు సహా ఆ టెస్టులో 14 వికెట్లు తీసిన యాసిర్ షా.. మూడు టెస్టు సిరీస్‌లో ఇప్పటికే 27 వికెట్లు పడగొట్టాడు. మరో నాలుగు వికెట్లు తీస్తే మూడు టెస్టుల సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన పాక్ బౌలర్‌గా అబ్దుల్ ఖాదిర్ (30 వికెట్లు) రికార్డ్‌ను యాసిర్ అధిగమిస్తాడు.

క్లారీ గ్రిమ్మెట్ (ఆస్ట్రేలియా - 200 వికెట్లు - 36 టెస్టులు)

క్లారీ గ్రిమ్మెట్ (ఆస్ట్రేలియా - 200 వికెట్లు - 36 టెస్టులు)

న్యూజిలాండ్ సంతతికి చెందిన క్లారీ గ్రిమ్మెట్ టెస్టుల్లో ఆస్ట్రేలియా జట్టు తరుపున ఆడాడు. ఆస్ట్రేలియా తరుపున 37 టెస్టులాడి మొత్తం 216 వికెట్లు తీశాడు. ఆసీస్ మరో లెగ్ స్పిన్నర్ బిల్ ఓ రైలీతో కలిసి క్లారీ గ్రిమ్మెట్ ప్రత్యర్ధి జట్లపై విజృంభించాడు. ఆసీస్ తరుపున 27 టెస్టులాడిన బిల్ ఓ రైలీ 144 వికెట్లు పడగొట్టాడు. అప్పట్లో వీరిద్దరినీ ఫాక్స్, టైగర్లతో పోల్చేవారు.

రవిచంద్రన్ అశ్విన్ (ఇండియా - 200 వికెట్లు - 37 టెస్టులు)

రవిచంద్రన్ అశ్విన్ (ఇండియా - 200 వికెట్లు - 37 టెస్టులు)

టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన రికార్డును బద్దలు కొట్టే అరుదైన అవకాశాన్ని రవిచంద్రన్ అశ్విన్ తృటిలో చేజార్చుకున్నాడు. రెండేళ్ల క్రితం 200వ వికెట్ల క్లబ్‌లో చేరిన అశ్విన్ మొత్తం 37 మ్యాచ్‌ల్లో ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో రవిచంద్రన్ అశ్విన్ మాజీ క్రికెట్ దిగ్గజాలైన వకార్ యూనిస్, డెనిస్ లిల్లీ రికార్డులను బద్దలు కొట్టాడు. అంతేకాదు టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన మూడో బౌలర్‌‌గా నిలిచాడు. ప్రస్తుతం భారత టెస్టు జట్టులో అశ్విన్ ప్రధాన స్పిన్నర్‌గా కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు భారత్ తరుపున 64 టెస్టులాడిన అశ్విన్ 336 వికెట్లు తీశాడు. ఇందులో 26 సార్లు ఐదు వికెట్ల హాల్‌ను పడగొట్టాడు.

డెన్నిస్ లిల్లీ/వకార్ యూనిస్ (ఆస్ట్రేలియా/పాకిస్థాన్ - 200 వికెట్లు - 38 టెస్టులు)

డెన్నిస్ లిల్లీ/వకార్ యూనిస్ (ఆస్ట్రేలియా/పాకిస్థాన్ - 200 వికెట్లు - 38 టెస్టులు)

టెస్టుల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన రికార్డుని లెజెండరీ ఆసీస్ పేస్ బౌలర్ డెన్నిస్ లిల్లీ 1980ల్లో సాధించాడు. ఆ తర్వాత 1990ల్లో పాకిస్థాన్‌కు చెందిన వకార్ యూనిస్ ఈ రికార్డుని నమోదు చేశాడు. 90ల్లో వసీం అక్రమ్, వకార్ యూనిస్ లాంటి దిగ్గజాలతో పాకిస్థాన్ పేస్ బౌలింగ్ పటిష్టంగా ఉంది. ఆస్ట్రేలియా తరుపున 70 టెస్టులాడిన డెన్నిస్ లిల్లీ 355 వికెట్లు తీశాడు. ఇక, పాక్ తరుపున 87 టెస్టులాడిన వకార్ యూనిస్ 373 వికెట్లు పడగొట్టాడు.

డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా - 200 వికెట్లు - 39 టెస్టులు)

డేల్ స్టెయిన్ (దక్షిణాఫ్రికా - 200 వికెట్లు - 39 టెస్టులు)

దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ ఈ రికార్డుని 39 టెస్టుల్లో సాధించాడు. ఈ మధ్య కాలంలో గాయాల కారణంగా దక్షిణాఫ్రికా జట్టుకు దూరమైన డేల్ స్టెయిన్ ఇటీవలే సఫారీ జట్టులో తిరిగి చోటు దక్కించుకున్నాడు. దక్షిణాఫ్రికా తరుపున ఇప్పటివరకు 88 టెస్టులాడిన డేల్ స్టెయిన్ 421 వికెట్లు తీశాడు.

Story first published: Thursday, December 6, 2018, 14:54 [IST]
Other articles published on Dec 6, 2018
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+