Yashasvi Jaiswal: యశస్వి జైస్వాల్ యూటర్న్!
Yashasvi Jaiswal: భారత యువ ఓపెనింగ్ బ్యాటర్, రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న యశస్వి జైస్వాల్ తన మనసును మార్చుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో గోవా తరఫున ఆడాలని తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 23 ఏళ్ల యశస్వి జైస్వాల్ ఇప్పుడు ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు తన ఎన్వోసీని ఉపసంహరించుకుంటూ ఒక ఇమెయిల్ రాశాడు. తదుపరి దేశీయ సీజన్‌లో ముంబైకి ప్రాతినిధ్యం వహించడానికి తాను అందుబాటులో ఉన్నానని చెప్పాడు.
ఎంసీఏ జారీ చేసిన ఎన్వోసీని వెనక్కు తీసుకోవాలని కోరాడు. గోవాకు వెళ్లాలనుకున్న తన ప్రణాళికను ఉపసంహరించుకున్నట్లు వెల్లడించాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ తనను ముంబైకి ఆడేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశాడు. ఎంసీఏ ఇచ్చిన నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్‌ను బీసీసీఐకి గానీ, గోవా క్రికెట్ అసోసియేషన్‌కు గానీ సమర్పించలేదని పేర్కొన్నాడు.

యూపీలో పుట్టిన యశస్వి జైస్వాల్ ముంబై తరఫున దేశవాలీ క్రికెట్ ఆడి భారత్ తరఫున ఆడడంతో పాటు ఐపీఎల్‌లో చోటు దక్కించుకున్నాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ భారత్ తరఫున ఆడుతూ తన టెస్ట్ కెరీర్‌ను అద్భుతంగా ప్రారంభించాడు. వ్యక్తిగత కారణాల వల్ల తనకు జీవితాన్ని ఇచ్చిన ఎంసీఏను వదిలివెళ్లాలనుకున్న మళ్లీ మనసు మార్చుకున్నాడు. గోవా క్రికెట్ అసోసియేషన్ కు ఆశ చూపించి.. మళ్లీ తిరిగి ముంబైకే ఆడాలనుకుంటున్నాడు. గోవా తనకు నాయకత్వ పాత్రను ఆఫర్ చేసిందని.. అందుకే గోవా తరఫున ఆడాలని నిర్ణయించుకున్నట్లు యశస్వి జైస్వాల్ చెప్పాడు.
యశస్వి జైస్వాల్ ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు పంపిన ఈ-మెయిల్‌లో.. "నాకు ఇచ్చిన ఎన్వోసీని ఉపసంహరించుకోవాలనే అభ్యర్థనను పరిగణనలోకి తీసుకోవాలని అభ్యర్థిస్తున్నాను. గోవాకు మకాం మార్చాలని కొన్ని కుటుంబ ప్రణాళికలు వేసుకున్నాను. అవి ప్రస్తుతానికి నిలిపివేయబడ్డాయి. కాబట్టి ఈ సీజన్‌లో ముంబై తరఫున ఆడడానికి అనుమతించమని ఎంసీఏను అభ్యర్థిస్తున్నాను. నేను బీసీసీఐకి గానీ, గోవా క్రికెట్
జైస్వాల్ 11 సంవత్సరాల వయసులో ఉత్తరప్రదేశ్‌లోని భడోహి జిల్లాలోని సూర్యవాన్ గ్రామం నుండి క్రికెట్ ఆడటానికి ముంబైకి వెళ్లాడు. యశస్వి జైస్వాల్ అండర్-19 రోజుల నుంచి భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కొన్ని సంవత్సరాల క్రితం యశస్వి జైస్వాల్ విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీ సాధించడం ద్వారా వెలుగులోకి వచ్చాడు. ముంబై తరపున జైస్వాల్ ప్రదర్శన జాతీయ సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది. జైస్వాల్‌కు ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో ఒప్పందం లభించింది. 2024-25 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో జైస్వాల్ ఐదు టెస్టుల్లో 43.44 సగటుతో 391 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాపై అద్భుతంగా రాణించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications