రంజీల్లో ముంబై యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ అరుదైన ఘనత సాధించాడు. రెండు ఇన్నింగ్స్ ల్లో సెంచరీలు చేసిన ముంబై ఆటగాళ్ల ఎలైట్ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఉత్తరప్రదేశ్ జరిగిన సెమిఫెనల్ మ్యాచ్‌లో ఈఎడం చేతి బ్యాట్స్‌మెన్ రెండు ఇన్నింగ్స్‌లో శతకొట్టి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.
గతంలో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన ఆటగాళ్లు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, వసీం జాఫర్, అజింక్యా రహానేలు ముంబై తరుపున ఆడూతూ ఈఘనత సాధించారు. ఉత్తర్ ప్రదేశ్‌తో సెమిఫైనల్ మ్యాచ్‌లో జైస్వాల్ రెండు ఇన్నింగ్స్‌లో సెంచరీలు బాది లెజండరీ ఆటగాళ్ల సరసన చేరాడు . ఇక మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లో 100 , 181 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు.
ముంబై ఆటగాళ్ల ఎలైట్ జాబితాలో చేరడంపై సంతోషం వ్యక్తం చేశాడు యశస్వి జైస్వాల్. ఓజాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తన రికార్డు గురించి తనకు తెలియదని, డ్రెస్సింగ్ రూమ్‌కి వచ్చినప్పడు సహచర ఆటగాళ్లు తెలియజేసినప్పుడే తెలిసిందన్నాడు. సచిన్ , రోహిత్ శర్మ వంటి దిగ్గజాలతో తనపేరును చూడడం ఆనందంగా ఉందన్నాడు. జట్టు విజయంలో భాగస్వామ్యం అయినందుకు గర్వపడుతున్నానని జైస్వాల్ వెల్లడించాడు. ముంబై ఈ గెలుపుతో రంజీల్లో 47 వసారిఫైనల్ చేరి చరిత్ర సృష్టించింది.
బెంగళూరు వేదికగా జరిగిన రంజీ సెమిఫైనల్లో ముంబై జట్టు తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్, హార్దిక్ తమోర్ సెంచరీలు చేయడంతో 393 పరుగులు చేసింది. అనంతరం ఉత్తర్‌ప్రదేశ్ జట్టు 180 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లో ముంబై జట్టు జైస్వాల్ 181 , అర్మాన్ జాఫర్ 127 సెంచరీలు బాదడంతో 533 పరుగుల భారీ స్కోర్ నమోదు చేసి డిక్లేర్ చేసింది. మ్యాచ్ డ్రాగా ముగిసిన తొలి ఇన్నింగ్స్ పరుగుల ఆధారంగా ముంబై జట్టు ఫైనల్ చేరింది.