For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

సచిన్‌, ద్రవిడ్‌ సర్‌ వల్లే.. బంగ్లాదేశ్ స్లెడ్జింగ్‌ చేసినా..!!

Yashasvi Jaiswal says Sachin Tendulkar, Rahul Dravid asked to talk with bat, not mouth

ముంబై: ఐసీసీ అండర్‌-19 ప్రపంచకప్‌ ఫైనల్లో బంగ్లాదేశ్ స్లెడ్జింగ్‌ చేసినా స్పందించలేదు. బ్యాటింగ్‌ చేస్తున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నా అని భారత యువ ఆటగాడు యశస్వి జైశ్వాల్‌ తెలిపాడు. స్లెడ్జింగ్‌ చేస్తున్నా ప్రశాంతంగా బ్యాటింగ్‌ చేయడానికి అసలు కారణం మాత్రం భారత దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్‌ సర్‌లు అని యశస్వి చెప్పుకోచ్చాడు. ప్రపంచకప్‌లో పరుగుల వరద పారించిన యశస్వి జైశ్వాల్‌ 'ప్లేయర్‌ ఆఫ్ ది టోర్నీ' అవార్డు గెలుచుకున్నాడు.

సచిన్‌, ద్రవిడ్‌ సర్‌ వల్లే:

సచిన్‌, ద్రవిడ్‌ సర్‌ వల్లే:

యశస్వి జైశ్వాల్‌ తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... 'బ్యాటుతోనే మాట్లాడాలి నోటితో కాదని ద్రవిడ్‌, సచిన్‌ సర్‌ చెప్పారు. వారి సలహాకు అధిక ప్రాధాన్యం ఇచ్చాను. వారి వల్లే నేను ప్రశాంతంగా బ్యాటింగ్ చేయగలిగాను. బ్యాటింగ్‌ చేస్తున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నా. బంగ్లాదేశ్ స్లెడ్జింగ్‌ చేసినా.. అస్సలు స్పందించలేదు. సుదీర్ఘంగా బ్యాటింగ్‌ చేసి పరుగులు చేయాలని నిర్ణయించుకున్నా. ఆ సమయంలో నా మదిలో ఈ ఒక్క ఆలోచనే ఉంది' అని అన్నాడు.

స్టోక్స్‌, బట్లర్‌ల నుండి నేర్చుకుంటా:

స్టోక్స్‌, బట్లర్‌ల నుండి నేర్చుకుంటా:

'ఇదే నా తొలి ఐపీఎల్‌. ఐపీఎల్‌ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ సీజన్‌లో నా శక్తి మేరకు రాణించి మంచి ప్రదర్శన చేస్తా. ఐపీఎల్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఆడటం నాకు ఎంతో ఉపయోగం. స్టీవ్‌ స్మిత్‌, బెన్‌ స్టోక్స్‌, జోస్‌ బట్లర్‌ లాంటి ప్రపంచస్థాయి మేటి ఆటగాళ్లతో మాట్లాడే అవకాశం ఉంటుంది. వారి వద్ద విలువైన సూచనలు తీసుకోవచ్చు. వారి నుంచి నేర్చుకోడానికి ఆసక్తి ఉన్నా' అని యశస్వి పేర్కొన్నాడు.

ప్రతిసారీ కష్టపడ్డా:

ప్రతిసారీ కష్టపడ్డా:

'నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు, పానీ పానిపురిస్‌ను అమ్ముతున్నప్పుడు ఏ విషయం గురించి ఆలోచించలేదు. ఎందుకంటే.. అప్పుడు ఆ సమయం నాకు ఎంతో అనవసరం. దాన్ని నేను బాగా ఎంజాయ్ చేశాను. అలా చేయడం మంచిదని నాకు తెలుసు. నేను ఏదీ సులభంగా పొందలేదు. ప్రతిసారీ కష్టపడాల్సి వచ్చింది. కఠిన పరిస్థితులే నన్ను మానసికంగా బలంగా ఎదగడానికి సహాయపడ్డాయి' అని

యశస్వి చెప్పుకొచ్చాడు.

 యశస్వి ఒంటరిపోరాటం:

యశస్వి ఒంటరిపోరాటం:

బంగ్లాదేశ్‌తో ఫైనల్లో భారత టాప్‌ ఆర్డర్‌, మిడిలార్డర్‌ విఫలమైంది. ప్రత్యర్థులు కవ్విస్తున్నప్పటికీ.. యశస్వి ఒక్కడే ఒంటరిపోరాటం చేసి 88 పరుగులు చేశాడు. తన ఆటతో జట్టుకు గౌరవ ప్రదమైన స్కోరు అందించాడు. మ్యాచ్‌ ఆసాంతం బంగ్లా ఆటగాళ్లు స్లెడ్జింగ్‌ చేసినా ఓపికగా ఉన్నాడు. ఇక మ్యాచ్ ముగిశాక అతిగా సంబరాలు చేసుకున్నారు. టీమిండియాను గేలి చేశారు. దాంతో రెండు జట్ల ఆటగాళ్లు గొడవకు దిగారు.

 డబుల్ సెంచరీ బాది చరిత్ర:

డబుల్ సెంచరీ బాది చరిత్ర:

గతేడాది విజయ్‌ హజారే ట్రోఫీలో యశస్వి జైశ్వాల్‌ కేరళపై డబుల్ సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. లిస్ట్‌-ఏ క్రికెట్‌లో ద్విశతకం బాదిన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. దీంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఇక ఇటీవల ముగిసిన అండర్‌-19 ప్రపంచకప్‌లో అదరగొట్టాడు. ఈ టోర్నీలో మొత్తం 400 పరుగులతో' 'మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌'గా ఎంపికయ్యాడు. టోర్నీలో ఆరు మ్యాచ్‌లాడిన జైశ్వాల్ ఒక సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీ (88, 105, 62, 57, 29, 59)లు చేసాడు.

Story first published: Wednesday, February 19, 2020, 9:38 [IST]
Other articles published on Feb 19, 2020
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+