For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Duleep Trophy : ఫీల్డింగ్ టైంలో యశస్వి జైశ్వాల్‌ దురుసు ప్రవర్తన.. గ్రౌండ్లో నుంచి గెంటేసిన రహానే..!

Yashasvi Jaiswal Misbehavior In Duleep Trophy Final Match, Rahane Sends Out Him from Fielding

కోయంబత్తూరులోని ఎస్‌ఎన్‌ఆర్ కాలేజ్ క్రికెట్ గ్రౌండ్‌లో వెస్ట్ జోన్, సౌత్ జోన్ మధ్య జరిగిన దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌లో ముంబై బ్యాటర్ యశస్వి జైశ్వాల్ ఓ వివాదానికి కేంద్ర బిందువు అయ్యాడు. మ్యాచ్ చివరి రోజు.. ఆపోజిట్ ప్లేయర్ అయిన మిడిలార్డర్ బ్యాటర్ రవితేజతో జైశ్వాల్ మాటల యుద్ధానికి దిగాడు.

ఆ తర్వాత.. కెప్టెన్ రహానే జైస్వాల్‌‌‌కు సర్ది చెప్పాడు. కాసేపు సర్దిచెప్పినప్పటికీ.. జైశ్వాల్ అస్సలు కూల్ కాలేదు. దీంతో ఫీల్డింగ్ నుంచి జైశ్వాల్‌ను బయటికి పంపించేశాడు. జైశ్వాల్ వెళ్లాక వెస్ట్ జోన్ టీం కేవలం 10మంది ఆటగాళ్లతోనే ఫీల్డింగ్ చేసింది. సొంత జట్టు ప్లేయర్ మిస్ బిహేవ్ చేస్తే అతన్ని గ్రౌండ్లో నుంచి బయటికి పంపించే హక్కు జట్టుకు కెప్టెన్‌కు ఉంటుంది. ఆ రూల్ ప్రకారం.. రహానే ఈ పని చేశాడు. అయితే కాసేపయ్యాక జైశ్వాల్ మళ్లీ గ్రౌండ్లోకి వచ్చి ఫీల్డింగ్ చేశాడు.

అంపైర్లు వారించినా

సౌత్ జోన్ బ్యాటింగ్ టైంలో రవితేజ బ్యాటింగ్ చేస్తుండగా.. లెగ్ సైడ్ బ్యాటర్‌కు దగ్గరగా యశస్వి ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఇక ఫీల్డింగ్ సందర్భంగా కవ్వించే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే రవితేజ దీనికి ధాటిగా బదులిచ్చాడు. ఇక యశస్వి సైతం నేనేమన్నానని నోరు పారేసుకుంటున్నావ్ అంటూ కాస్త సీరియస్ అయ్యాడు. ఇరువురు ఒకరిమీదకు ఒకరు వచ్చే టైంకు రహానే, అంపైర్లు కలగజేసుకున్నారు. అంపైర్లు వారించినా వీరిద్దరు కాస్త హద్దు మీరారు. ఇక రహానే ఇలాగైతే కుదిరే పని కాదని.. అంపైర్‌తో మాట్లాడి యశస్విని గ్రౌండ్ బయటకు పంపించాడు.

రవితేజ, రోహన్ పోరాడినా

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. వెస్ట్ జోన్ 294పరుగుల భారీ తేడాతో సౌత్ జోన్‌ను ఓడించింది. విజయానికి 529పరుగుల లక్ష్యాన్ని ఛేదించాల్సిన తరుణంలో సౌత్ జోన్ జట్టు 71.2ఓవర్లలో 234పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ 93, రవితేజ 53పరుగులు చేసి కాసేపు ప్రతిఘటించినప్పటికీ.. వారి ప్రయత్నాలు అంతగా ఫలించలేదు. సౌత్ జోన్ బ్యాటింగ్‌ పతనాన్ని బౌలర్ షామ్స్ ములానీ శాసించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఏకంగా నాలుగు వికెట్లు తీశాడు.

అద్భుత డబుల్ సెంచరీతో ఆకట్టుకున్న జైశ్వాల్

ఇక వివాదాన్ని పక్కన పెడితే.. జైస్వాల్ ఈ మ్యాచ్‌లో అద్భుతమైన డబుల్ సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుకే అవుటైన జైశ్వాల్.. రెండో ఇన్నింగ్స్‌లో 323బంతుల్లో 265పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 30 ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. అతని వీరోచిత బ్యాటింగ్ వల్ల వెస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 4వికెట్లు కోల్పోయి 585 పరుగుల భారీ స్కోరు చేసింది. మొదటి ఇన్నింగ్స్ తర్వాత.. సౌత్ జోన్ 57పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అయితే జైస్వాల్ నాక్ వెస్ట్ జోన్‌‌కు గెలుపు బెర్త్ ఖాయం చేసింది. జైస్వాల్.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును పొందాడు.

Story first published: Sunday, September 25, 2022, 16:25 [IST]
Other articles published on Sep 25, 2022
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+