Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

యశస్వి జైశ్వాల్ సంచలన నిర్ణయం..!

Yashasvi Jaiswal: భారత జట్టులో సంచలన ప్లేయర్ యశస్వి జైస్వాల్. ఓపెనర్‌గా దూకుడైన బ్యాటింగ్‌తో ప్రత్యర్థులపై ఆధిపత్యం ప్రదర్శిస్తుంటాడు. అయితే ఈ భారత యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కీలక నిర్ణయం తీసకున్నాడు. దేశవాళీ క్రికెట్ లో తన స్టేట్ టీమ్ నుంచి మారాలనుకుంటున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు ముంబయి క్రికెట్ అసోసియేషన్ కు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోరుతూ లేఖ రాశాడు.

ఆ జట్టుకు కెప్టెన్ గా..
"మా నుంచి అతడు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ కోరాడు. గోవాకు మారాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఇది అతడి వ్యక్తిగత నిర్ణయం." అని ఎమ్‌సీఏ తెలిపింది. అలానే జైశ్వాల్ కు దగ్గరగా ఉన్న ఓ ప్రతినిధి కూడా ఈ విషయాన్ని కన్ఫామ్ చేశారు. కాగా, 2025-26 సీజన్ లో జైశ్వాల్ గోవా జట్టుకు కెప్టెన్ గా వ్యవహరిస్తాడని సమాచారం అందింది.

Yashasvi Jaiswal likely to leave Mumbai team goes to Goa for upcoming season

4,26 పరుగులు..
టీమిండియా క్రికెటర్లందరూ అంతర్జాతీయ మ్యాచులు లేని సమయంలో కచ్చితంగా దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో గత సీజన్ లో ముంబయి జట్టు తరఫున ఆడిన జైశ్వాల్.. రంజీ ట్రోఫీలో జుమ్ము కశ్మీర్ తో జరిగిన మ్యాచులో ఆడాడు. ఆ మ్యాచులో 4,26 పరుగులు చేశాడు.

ముంబయితో యశస్వి జైశ్వాల్ జర్నీ..
17ఏళ్ల వయసులో ముంబయి జట్టులోకి వచ్చిడా యశస్వి. 2018-19 సీజన్ లో ముంబయి జట్టు తరఫున రంజీ ట్రోఫీ అరంగేట్రం చేశాడు. 2022 సీజన్‌లో కేవలం మూడు మ్యాచుల్లోనే 83 సగటుతో 498 పరుగులు సాధించాడు. అతడి అత్యధిక వ్యక్తిగత స్కోరు 181. ఆ సీజన్ లో ముంబయి ఫైనల్‌కు చేరడంలో కీలక పాత్ర కూడా పోషించాడు. 2019-20లో విజయ్ హజారే ట్రోఫీలో డబుల్ సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలోనే టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చి మంచి ప్లేయర్ గా పేరు గాంచాడు. టెస్టుల్లోనూ సూపర్ ఓపెనర్‌గా అవతరించాడు.

Story first published: Wednesday, April 2, 2025, 15:13 [IST]
Other articles published on Apr 2, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+