యశస్వి జైస్వాల్ జాక్‌పాట్! రోహిత్, శ్రేయస్ అయ్యర్ సరసన చోటు!
ఐపీఎల్ 2026 సీజన్ కొనసాగుతుండగానే టీమిండియా యువ సంచలనం, రాజస్థాన్ రాయల్స్ స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఓ భారీ డీల్‌ను దక్కించుకున్నాడు. పరుగుల వర్షం కురిపిస్తూ ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ యువ సెన్సేషన్ ఇప్పుడు బ్రాండ్ విలువలోనూ దూసుకుపోతున్నాడు. ప్రముఖ టైర్ల తయారీ సంస్థ CEAT(సీయట్)తో యశస్వీ జైస్వాల్ తాజాగా ఒప్పందం కుదుర్చుకున్నాడు. దీనితో యశస్వీ బ్యాట్‌పై ఇక నుంచి 'సీయట్' స్టిక్కర్ దర్శనమివ్వనుంది. ఈ డీల్ ద్వారా యశస్వీ జైస్వాల్ టీమిండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్ వంటి స్టార్ల సరసన చేరాడు.
దిగ్గజాల క్లబ్‌లో యశస్వీ జైస్వాల్
క్రికెట్ ప్రపంచంలో బ్యాట్ స్పాన్సర్‌షిప్‌లకు చాలా ప్రాధాన్యత ఉంటుంది. ముఖ్యంగా 'సీయట్' స్టిక్కర్‌తో ఆడే ఆటగాళ్ల జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్, భారత మహిళా జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ వంటి దిగ్గజాలు ఉన్నారు. ఇప్పుడు ఈ జాబితాలో యశస్వీ జైస్వాల్ చేరడం అతడి కెరీర్ ఎదుగుదలకు ఓ నిదర్శనంగా కనిపిస్తోంది. సాధారణంగా సీనియర్, స్టార్ ఆటగాళ్లకు మాత్రమే దక్కే ఇటువంటి ప్రతిష్టాత్మక ఒప్పందాన్ని ఐపీఎల్ 19వ సీజన్ ఆరంభంలోనే యశస్వీ జైస్వాల్ దక్కించుకోవడం విశేషం.

టీ20ల్లో సత్తా చాటాల్సిన సమయం
యశస్వీ జైస్వాల్ ఇప్పటికే టెస్ట్ క్రికెట్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.వన్డేల్లోనూ అడపా దడపా అవకాశాలు వస్తూ జైస్వాల్ సత్తా చాటుతున్నాడు. అయితే టీ20 ఫార్మాట్లో టీమిండియాలో శాశ్వత స్థానం సంపాదించడానికి యశస్వీ జైస్వాల్‌కు ఈ ఐపీఎల్ 2026 సీజన్ అత్యంత కీలకం. ఈ సీజన్ మొదటి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై యశస్వీ జైస్వాల్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి తన ఫామ్‌ను నిరూపించుకున్నాడు. టీమిండియాలో మూడు ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా మారాలంటే ఐపీఎల్‌లో భారీ స్కోర్లు సాధించి తన టీ20 సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాల్సి ఉంటుంది.
కెప్టెన్ రియాన్ పరాగ్ నమ్మకం
రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుత కెప్టెన్ రియాన్ పరాగ్ తన ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌పై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. పవర్ ప్లేలో యశస్వీ జైస్వాల్ ఇచ్చే మెరుపు ఆరంభాలు జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తాయని ఫ్రాంచైజీ, కెప్టెన్ గట్టిగా భావిస్తున్నారు. కొత్తగా కుదిరిన ఈ 'సీయట్' డీల్ ఇచ్చిన ఉత్సాహంతో యశస్వీ జైస్వాల్ తన బ్యాట్‌తో మరింత ధాటిగా ఆడుతారని, రాజస్థాన్ జట్టును ప్లే ఆఫ్స్ వైపు నడిపిస్తారని ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications