WWEలోనూ వైభవ్ సూర్యవంశీ.. క్రేజ్ మామూలుగా లేదు! (వీడియో)
ఐపీఎల్ 2026 సీజన్ క్లైమాక్స్ దశకు చేరుకున్న వేళ క్రికెట్ అభిమానుల కళ్లన్నీ సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్‌పైనే ఉన్నాయి. ఈ డూ ఆర్ డై మ్యాచ్‌కు ముందు రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఊహించని విధంగా అంతర్జాతీయ వేదికపై నుంచి ఓ అద్భుతమైన పవర్ బూస్ట్ లభించింది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉన్న డబ్ల్యూడబ్ల్యూఈ దిగ్గజ రెజ్లర్ 'డ్రూ మెక్‌ఇంటైర్' రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీకి తన మద్దతును ప్రకటించాడు. సూర్యవంశీ పేరుతో ఉన్న జెర్సీని ధరించి డ్రూ మెక్‌ఇంటైర్ జిమ్‌లో వర్కవుట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది.
వైభవ్ సూర్యవంశీ జెర్సీ ధరించి జిమ్‌లో డ్రూ మెక్‌ఇంటైర్ వర్కవుట్స్
డబ్ల్యూడబ్ల్యూఈలో డ్రూ మెక్‌ఇంటైర్ ఓ అగ్రశ్రేణి రెజ్లర్. 2020 నుంచి ఇప్పటివరకు అతను రింగ్‌లో అద్భుతమైన ప్రదర్శనలతో దూసుకుపోతున్నాడు. అయితే మెక్‌ఇంటైర్‌కు క్రికెట్ అంటే, ముఖ్యంగా భారతీయ క్రికెట్ అంటే ఎంతో ఇష్టం. చాలా సందర్భాలలో అతను టీమిండియాకు తన మద్దతును తెలియజేశాడు. తాజాగా ఆయన తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశాడు. అందులో డ్రూ మెక్‌ఇంటైర్ 15 ఏళ్ల రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ జెర్సీ నంబర్ '03' ఉన్న టీ-షర్ట్‌ను ధరించి జిమ్‌లో కఠినమైన వర్కవుట్లు చేస్తూ కనిపించాడు. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ తరఫున ఆడుతూ ఇప్పటివరకు 500కు పైగా పరుగులు చేసి అదరగొడుతున్న వైభవ్‌కు మెక్‌ఇంటైర్ ఈ విధంగా తన మద్దతు తెలపడం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.

గతంలో బుమ్రా జెర్సీతో అలరించిన డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్
డ్రూ మెక్‌ఇంటైర్ ఇలా భారతీయ క్రికెటర్ల జెర్సీలు ధరించి వార్తల్లో నిలవడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని రోజుల క్రితం కూడా ఆయన సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయ్యాడు. అప్పట్లో టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా జెర్సీని ధరించి జిమ్‌లో కసరత్తులు చేశాడు. ఆ వీడియోకు "నేను బైసెప్స్ నిర్మిస్తున్నాను.. గో బూమ్" అంటూ క్యాప్షన్ ఇచ్చి భారత అభిమానుల మనసులను గెలుచుకున్నాడు. ప్రస్తుతం రెసిల్‌మేనియా 42 ముగిసిన తర్వాత మెక్‌ఇంటైర్ రింగ్‌కు కాస్త దూరంగా ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నాడు. అతను మళ్లీ డబ్ల్యూడబ్ల్యూఈ రింగ్‌లోకి ఎప్పుడు రీ-ఎంట్రీ చేస్తాడా అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరోవైపు ఐపీఎల్ 2026లో ఆర్సీబీ ఇప్పటికే గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లగా, నేడు హైదరాబాద్-రాజస్థాన్ మధ్య రెండో ఫైనలిస్ట్ రేసు కోసం ఎలిమినేటర్ సమరం జరగనుంది. ఇలాంటి కీలకమైన మ్యాచ్‌కు ముందు ప్రపంచ ప్రసిద్ధ రెజ్లర్ నుంచి మద్దతు లభించడం రాజస్థాన్ రాయల్స్ జట్టుతో పాటు ముఖ్యంగా యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీలో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

