న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

WTC Finals: భువనేశ్వర్‌ కుమార్‌పై వేటు అందుకేనా.. ఇక భువీ టెస్ట్ కెరీర్‌ ముగినట్టేనా?

WTC Finals: Does Seem Like The End Of Bhuvneshwar Kumars Test Career
Why No Bhuvi? బలమైన బౌలింగ్ దళం అందుకే Bhuvneshwar Kumar కు చోటు దక్కడం లేదా ?| Oneindia Telugu

హైదరాబాద్: భువనేశ్వర్‌ కుమార్‌.. టీమిండియా అద్భుతమైన పేసర్లలో ఒకడు. ఇన్నింగ్స్ ఆరంభంలో, డెత్ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేస్తూ.. వికెట్లు తీసి జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. పిచ్‌లపై పచ్చిక.. వాతావరణం చల్లగా.. తేమతో వుంటే అతడిని ఆపడం కష్టమే. బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేస్తూ.. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తిస్తుంటాడు. ఇంగ్లండ్, న్యూజీలాండ్ వంటి దేశాలు భువీ బౌలింగ్‌కు అత్యంత అనుకూలంగా ఉంటాయి. కానీ త్వరలో ఇంగ్లండ్ జట్టుతో జరగనున్న సుదీర్ఘ ఫార్మాట్‌కు భువీని ఎంపిక చేయకపోవడం అందరిని ఆశ్చర్యం కలిగించింది. దీంతో భువీపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి.

మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకపోవడం, తరచూ గాయాల పాలవ్వడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌, ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు భువనేశ్వర్‌ కుమార్‌ను బీసీసీఐ సెలక్టర్లు ఎంపిక చేయలేదని బోర్డు వర్గాల సమాచారం. రెండేళ్లు అతడు టెస్టు క్రికెట్‌ ఆడకపోవడం, రంజీల్లోనూ ప్రభావం చూపకపోవడం, దేశవాళీ క్రికెట్లోనూ ఎక్కువగా ఆడకపోవడాన్ని వారు పరిగణనలోకి తీసుకున్నారని సమాచారం తెలుస్తోంది. ఇంగ్లండ్ వంటి దేశాల్లో సుదీర్ఘ కాలం టెస్టు సిరీస్‌ ఆడగలిగే ఫిట్‌నెస్ భువీకి ఉన్నట్టు సెలక్టర్లు భావించడం లేదని సమాచారం. అందుకే టెస్ట్ ఫార్మాట్‌కు అతడిని ఎంపికచేయలేదు.

భారత్ బలమైన జట్టును ఎంచుకున్నా.. ఒక్క స్పిన్నర్ కూడా లేకపోవడం పెద్ద లోటే: కనేరియాభారత్ బలమైన జట్టును ఎంచుకున్నా.. ఒక్క స్పిన్నర్ కూడా లేకపోవడం పెద్ద లోటే: కనేరియా

భువనేశ్వర్‌ కుమార్‌ రెండున్నరేళ్లుగా గాయాల బారిన పడుతున్న విషయం తెలిసిందే. 2018 జనవరి నుంచి భువీ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్టే ఆడలేదు. ఆ ఏడాది జనవరి 24-27 మధ్యన దక్షిణాఫ్రికాతో టెస్టు మ్యాచే చివరిది. పరిమిత ఓవర్ల క్రికెట్లో డెత్‌ ఓవర్లలో అతడి సామర్థ్యం పెరగడంతో టీ20, వన్డేలకు ప్రాధాన్యం ఇచ్చారు. గతేడాది ఐపీఎల్‌లోనూ గాయపడటంతో కీలకమైన ఆస్ట్రేలియా సిరీస్‌కు దూరమయ్యాడు. సయ్యద్‌ ముస్తాక్‌, విజయ్ హజారే ఆడటంతో ఇంగ్లండ్‌తో పరిమిత ఓవర్ల క్రికెట్లో అవకాశం ఇచ్చారు. ఇక ఐపీఎల్ 2021లో ఆరంభ మ్యాచులు ఆడి మళ్లీ గాయపడ్డాడు. అయితే ఇప్పుడు కోలుకున్నాడు.

ఒకవైపు పరిమిత ఓవర్ల క్రికెట్లో డెత్‌ ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్ చేయడం, మరోవైపు టెస్ట్ జట్టులో బలమైన బౌలింగ్ దళం ఉండడం భువనేశ్వర్‌ కుమార్‌కు సుదీర్ఘ ఫార్మాట్‌లో చోటు దక్కడం లేదు. దీంతో భువీ టెస్ట్ కెరీర్‌ ముగినట్టేనా అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జస్ప్రీత్ బుమ్రా, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్ధూల్ ఠాకూర్, ఉమేశ్ యాదవ్ లాంటి బౌలర్లు టెస్ట్ ఫార్మాట్‌లో అద్భుతంగా రాణిస్తున్న విషయం తెలిసిందే. ఇక భారత్ తరఫున భువీ 21 టెస్టులు, 117 వన్డేలు, 48టీ20లు ఆడాడు.

Story first published: Wednesday, May 12, 2021, 14:22 [IST]
Other articles published on May 12, 2021
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X