Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC final: లైవ్ టెలికాస్ట్ ఛానల్ ఫిక్స్: అయిదు భాషల్లో కామెంటరీ: మన తెలుగు మాటేమిటి

WTC final: will be broadcast in 7 channels in Star network with commentary of including Telugu

ముంబై: టెస్ట్ క్రికెట్ చరిత్ర చిరస్మరణీయంగా నిలిచిపోయే ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ (WTC final) ఇంకొద్ది రోజుల్లో ఆరంభం కాబోతోంది. ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్ కోసం వచ్చేనెల 18వ తేదీన ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌‌లోని హ్యాంప్‌షైర్ బౌల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ తలపడబోతోన్నాయి. ఈ మ్యాచ్‌కు సంబంధించిన ఒక్కో ప్ర్రక్రియ పూర్తవుతోంది. టీమిండియా ప్లేయర్లు ఇప్పటికే బయోబబుల్‌లోకి వెళ్లారు. వచ్చేనెల 2వ తేదీన వారంతా ఇంగ్లాండ్ విమానం ఎక్కబోతోన్నారు.

టెస్ట్ మ్యాచే అయినప్పటికీ.. హైఓల్టేజ్

టెస్ట్ మ్యాచే అయినప్పటికీ.. హైఓల్టేజ్

అటు న్యూజిలాండ్ కూడా ఈ మ్యాచ్ కోసం కసరత్తు పూర్తి చేసింది. విరాట్ కోహ్లీ సారథ్యంలోని టీమిండియాను ఓడించి.. మొట్టమొదటి డబ్ల్యూటీసీ చాంపియన్‌షిప్‌గా ఆవిర్భవించాలని ఉవ్విళ్లూరుతోంది. టెస్ట్ క్రికెట్టే అయినప్పటికీ- అందరి కళ్లూ ఆ మ్యాచ్‌ మీదే నిలవడానికి కారణం.. ఈ ఫార్మట్‌లో తొలిసారిగా ఛాంపియన్‌షిప్‌ను ఏర్పాటు చేయడమే. టెస్ట్ క్రికెట్ ఆడే హోదా ఉన్న అన్ని జట్లూ ఇందులో పాల్గొన్నాయి. అత్యధిక పాయింట్లను టీమిండియా, కివీస్ జట్లు ఫైనల్‌కు చేరాయి.

 టీమిండియా ఖాతాలో..

టీమిండియా ఖాతాలో..

భారత పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్ జట్టుపై నాలుగు టెస్ట్ సిరీస్‌లను 3-1 తేడాతో గెలుచుకోవడం ద్వారా కోహ్లీసేన ఈ ఫైనల్‌లో అడుగు పెట్టింది. భారత జట్టు ఖాతాలో మొత్తం 72.2 శాతం పాయింట్లు ఉన్నాయి. 70 పాయింట్లతో కివీస్ రెండో స్థానంలో నిలిచి, ఫైనల్‌కు అర్హత పొందింది. ఈ మ్యాచ్‌ను ప్రసారం చేసే హక్కులను స్టార్ నెట్‌వర్క్ పొందింది. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అఫీషియల్ బ్రాడ్‌కాస్ట్ పార్ట్‌నర్ స్టార్ స్పోర్ట్స్ దీన్ని లైవ్ టెలికాస్ట్ చేస్తుంది.

ఏడు ఛానళ్లలో

ఏడు ఛానళ్లలో

స్టార్ నెట్‌వర్క్ గ్రూప్‌లోని ఏడు వేర్వేరు ఛానళ్ల ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులో ఉంటాయి. అయిదు భాషల్లో కామెంటరీని వినొచ్చు. ఇంగ్లీష్, హిందీతో పాటు మూడు ప్రాంతీయ భాషలు తెలుగు, తమిళం, కన్నడల్లో డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ కామెంటరీని వినొచ్చు. ఆయా ప్రాంతీయ భాషల్లో స్టార్ నెట్‌వర్క్ ఛానళ్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. దక్షిణాది భాషలనే ఎంచుకుందా స్పోర్ట్స్ నెట్‌వర్క్ గ్రూప్ యాజమాన్యం.

ఇంగ్లాండ్‌లో మరో మూడురోజుల క్వారంటైన్

ఇంగ్లాండ్‌లో మరో మూడురోజుల క్వారంటైన్

ఇంగ్లాండ్ విమానం ఎక్కబోతోన్న నేపథ్యంలో వారంతా దశలవారీగా బయో బబుల్‌లోకి వెళ్లారు. కేప్టెన్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్‌ప్రీత్ బుమ్రా, వృద్ధిమాన్ సాహా, ప్రసిద్ధ కృష్ణ, హెడ్ కోచ్ రవిశాస్త్రి ముంబైలోని ఓ హోటల్‌లో క్వారంటైన్‌లో ఉంటోన్నారు. ఇంగ్లాండ్‌లో దిగిన తరువాత అక్కడ కూడా మూడు రోజుల పాటు టీమ్, సపోర్టింగ్ స్టాఫ్ మొత్తం క్వారంటైన్‌లో గడపాల్సి ఉంటుంది. బ్రిటన్ నిబంధనల ప్రకారం.. మూడు రోజుల పాటు క్వారంటైన్ తప్పదు.

Story first published: Friday, May 28, 2021, 8:32 [IST]
Other articles published on May 28, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+