
ప్లేయర్‌గా అవకాశం దక్కింది
ఓ సాధారణ ప్లేయర్‌గా 2011లో ప్రపంచకప్ అందుకునే అవకాశమైతే విరాట్ కోహ్లీకి దక్కింది కానీ.. ఓ కెప్టెన్‌గా మాత్రం ఐసీసీ టోర్నీలు అతనికి అందని ద్రాక్షగానే మిగిలింది. భారత్ తాజాగా ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో ఫేవరెట్‌గా దిగినా.. చివరికి ఓటమి తప్పలేదు.
మ్యాచ్‌లో రెండు రోజుల ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినా.. మిగిలిన రోజుల్లోనూ ఆట సరిగా సాగకపోయినా.. చివరి రోజు డ్రానే ఖాయం అని అందరూ అంచనా వేశారు. అయితే దురదృష్టం మాత్రం కోహ్లీని నీడలా వెంటాడింది. దాంతో పాటు ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో ఉండే ఒత్తిడిని ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మలాగా కూల్‌గా అధిగమించలేకపోవడం కూడా అతడిని దెబ్బకొడుతోంది.

కోహ్లీకి కలిసిరాని ఐసీసీ టోర్నీలు
విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌లలో ఓడిపోవడం ఇది మూడోసారి. గతంలో 2017 చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే మ్యాచ్ ఓడింది. 2019 ప్రపంచకప్‌సెమీఫైనల్లో న్యూజిలాండ్ జట్టు టీమిండియాకు షాకిచ్చింది. వర్షం కారణంగా టాప్ ఆటగాళ్లంతా వరుసగా పెవిలియన్ చేరారు.
తాజాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌లోనూ అదే రిపీట్ అయింది. మరోసారి బ్యాటింగ్ కారణంగానే చేతులెత్తేసింది. దీంతో కోహ్లీకి ఐసీసీ టోర్నీలు కలిసిరావని ఫాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. రోహిత్ శర్మను కెప్టెన్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 2023 వరకు 3-4 ఐసీసీ ట్రోఫీలు ఉన్నాయి. ఒక్కదాంట్లో అయినా కోహ్లీకి అదృష్టం కలిసొస్తుందో చూడాలి.

ఏకైక సారథిగా ధోనీ
ఐసీసీ ప్రవేశపెట్టిన అన్ని టోర్నీలను టీమిండియా కైవసం చేసుకుంది. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిళ్లను భారత్ సొంతం చేసుకుంది. ఈ ట్రోఫీలు అన్ని మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడే భారత్ సాధించింది. దీంతో ప్రపంచ క్రికెట్‌లో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన ఏకైక సారథిగా ధోనీ నిలిచాడు. ధోనీని గురువుగా భావించే విరాట్ కోహ్లీ మాత్రం ఇప్పటివరకు ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవలేదు. కోహ్లీ సారథ్యంలో భారత్ ఈ ఐదేళ్ల కాలంలో ఓసారి టీ20 ప్రపంచకప్, ఇప్పుడు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకుని ఓడిపోయింది.

18 ఏళ్లుగా కలిసిరాని కివీస్
2003 వన్డే ప్రపంచకప్ తర్వాత ఐసీసీ ఈవెంట్లలో న్యూజిలాండ్‌తో జరిగిన ఒక్క మ్యాచ్‌లో కూడా భారత్ గెలవలేదు. 18 ఏళ్ల కాలంలో ఐసీసీ మెగా ఈవెంట్స్‌లో ఏడుసార్లు తలపడిన భారత్.. ఆరింటిలో ఓటమిపాలైంది. ఒక మ్యాచ్ వర్షంతో జరగలేదు. 2007 వన్డే ప్రపంచకప్‌లో భారత్ లీగ్ దశలోనే ఇంటిదారి పట్టడంతో కివీస్‌తో ఆడే అవకాశం రాలేదు.
2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టు కూడా కివీస్ చేతిలో ఓటమిపాలైంది. 2009 చాంపియన్స్ ట్రోఫీ, 2011 ప్రపంచకప్, 2012 టీ20 ప్రపంచకప్, 2013 చాంపియన్స్ ట్రోఫీ, 2014 టీ20 ప్రపంచకప్, 2015 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడలేదు. 2016 టీ20 ప్రపంచకప్‌లోనూ చిత్తయింది. 2017 చాంపియన్స్ ట్రోఫీలో ఇరు జట్లు తలపడలేదు. ఇక 2019 వన్డే ప్రపంచకప్‌లో ఇరు జట్లు రెండు సార్లు తలపడ్డాయి. తొలి మ్యాచ్ వర్షంతో తుడిచిపెట్టుకుపోగా.. కీలకమైన సెమీస్‌లో భారత్ 18 పరుగులతో ఓటమిపాలైంది. ఇప్పుడు చాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఓడింది.


Click it and Unblock the Notifications

టాప్ లేపిన అశ్విన్.. అగ్రస్థానంలో రహానే! స్ట్రయిక్ రేట్ మాత్రం దారుణం! డబ్ల్యూటీసీ రికార్డులు ఇవే!!










