
రెడ్ బాల్ క్రికెట్‌ను బాగా ఆడుతున్నాడు:
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ మీడియాతో మాట్లాడాడు. 'రోహిత్ శర్మ చివరకు తనను తాను నియంత్రించుకునే వ్యక్తిగా మారాడు. ఏం సాధించాలనుకుంటున్నాడు, ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నాడనే విషయాలు అతడి ఆలోచనల్లో స్పష్టంగా తెలుస్తుంది. టెస్ట్ క్రికెట్‌లో కూడా విజయవంతం కావడానికి రోహిత్‌కు ఎంతో ప్రతిభ, ఆట ఉంది. కాస్త ఆలస్యంగా అయినా ఈ ఫార్మాట్‌లో ఎలా ఆడాలో తెలుసుకున్నాడు. 2020లో ఓపెనర్‌గా మారినప్పటి నుండి రోహిత్ రెడ్ బాల్ క్రికెట్‌ను అద్భుతంగా ఆడుతున్నాడు' అని విక్రమ్ రాథోడ్ అన్నాడు.

అక్కడా సక్సెస్ అవుతాడు:
'రోహిత్ శర్మ సాధారణంగా తన ఇన్నింగ్స్ ప్రారంభ దశలో క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయాన్ని తీసుకుంటాడు. ఇది పరిస్థితులకు అలవాటుపడటానికి మరియు భారీ ఇన్నింగ్స్ ఆడటానికి సహాయపడుతుంది. ఇది ఇప్పటికే నిరూపితమైంది. రోహిత్ ఎల్లప్పుడూ ఓ ప్రణాళికతోనే మైదానంలోకి అడుగుపెడతాడు. ఇప్పుడు టెస్ట్ క్రికెట్లో తన ఇన్నింగ్స్ ప్రారంభంలో చాలా ప్రశాంతంగా మరియు క్రమశిక్షణతో ఉంటున్నాడు. రోహిత్ క్రీజులో కుదురుకోవడానికి సమయాన్ని తీసుకోవడం ఎప్పుడూ ఇష్టపడతాడు. ఆ తర్వాత ఏమి చేయగలడో మనకు తెలుసు. టెస్ట్ ఫార్మాట్‌లో కూడా అదే చేసి సక్సెస్ అవుతాడు' అని టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ పేర్కొన్నాడు.

2.0ను చూస్తాం:
'రోహిత్ శర్మ ఫస్ట్ క్లాస్ రికార్డ్స్‌ని ఓసారి పరిశీలిస్తే.. భారీ సెంచరీలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ వన్డే, టీ20ల్లోనూ రోహిత్ శర్మ కేవలం 100 పరుగులు లేదా 105, 110, 115తో ఎప్పుడూ సరిపెట్టడు. సెంచరీ తర్వాత విధ్వంసమే చేస్తాడు. టెస్టుల్లోనూ ఆ తరహా ఇన్నింగ్స్‌లను రోహిత్ ఆడగలడు. అయితే ఇప్పుడు అతను టెస్టుల్లో బిగినింగ్ స్టేజ్‌లో ఉన్నాడు. ఇలానే కొన్నిరోజులు ఆడితే.. డిఫరెంట్ శర్మని ( రోహిత్ 2.0ను చూస్తాం) మనం చూస్తాం. టెస్టుల్లో అతని అత్యుత్తమ ఆట ఇంకా ఆడాల్సి ఉంది. రోహిత్ ఒక్కసారి టచ్‌లోకి వస్తే ఏ బౌలింగ్ అటాక్‌నైనా చిత్తుచేయగలడు' అని విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చాడు.

పుజారా, పంత్ భిన్నమైన మనస్తత్వాలు:
కెప్టెన్ విరాట్ కోహ్లీ అత్యంత పరిణతి కలిగిన ఆటగాడని విక్రమ్ రాథోడ్ ప్రశంసించాడు. 2016లో ఐపీఎల్‌లో నాలుగు సెంచరీలు, భారీ సిక్సర్లు బాదిన అతడే వెస్టిండీస్‌లో గాల్లోకి కొట్టకుండానే ద్విశతకం చేశాడని గుర్తు చేశాడు. జట్టులో బృంద చర్చలు ఎప్పుడూ జరుగుతుంటాయని, అవి జట్టు దృక్పథాన్ని మెరుగుపరుస్తాయన్నాడు. చటేశ్వర్ పుజారా, రిషబ్ పంత్ భిన్నమైన మనస్తత్వాలు, పని విలువలు కలిగిన వారని.. వారు చెప్పేది జాగ్రత్తగా వింటేనే వారి గురించి బాగా అర్థమవుతుందన్నాడు.


Click it and Unblock the Notifications












