Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC final: టోర్నీలో అత్యధిక వికెట్లు తీసుకున్న టాప్-5 బౌలర్ల లిస్ట్: మనోళ్లలో ఒకే ఒక్కడు

WTC final: Top 5 Highest Wicket-Takers in the Championship between 2019-21
WTC Final : Top 5 Highest Wicket-Takers | Pat Cummins, R Ashwin || Oneindia Telugu

ముంబై: టెస్ట్ క్రికెట్ చరిత్ర చిరస్మరణీయంగా నిలిచిపోయే ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ (WTC final) ఇంకొద్ది రోజుల్లో ఆరంభం కాబోతోంది. ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్ కోసం వచ్చేనెల 18వ తేదీన ఇంగ్లాండ్‌లోని సౌథాంప్టన్‌‌లోని హ్యాంప్‌షైర్ బౌల్ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్, న్యూజిలాండ్ తలపడబోతోన్నాయి. రెండేళ్లుగా సాగిన సుదీర్ఘమైన టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఇది. అసలు సిసలు క్రికెట్‌‌ను రుచి చూపించింది. ధనాధన్ ఫటాఫట్‌గా సాగిపోతోన్న క్రికెట్ చరిత్రలో ఓ సువర్ణాధ్యాయాన్ని లిఖించింది. టీ20 ఫార్మట్‌లో కొట్టుకుని పోతోన్న అయిదురోజుల పాటు సాగే టెస్ట్ క్రికెట్‌ను జీవించి ఉండేలా చేయడానికే ఐసీసీ దీన్ని నిర్వహించింది.

టాప్-5 బౌలర్ల లిస్ట్..

టాప్-5 బౌలర్ల లిస్ట్..

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ ఫస్ట్ ఎడిషన్ తొలి ఫైనల్ మ్యాచ్ గడవు సమీపిస్తోంది. దీనితో ఎవరి అంచనాలను వారు వ్యక్తం చేస్తోన్నారు. భారత్, న్యూజిలాండ్‌లల్లో బోణీ ఎవరు కొడతారనే అంశం మీద చర్చిస్తోన్నారు. ఇదిలావుండగా.. 2019లో ఆరంభమైన ఈ టెస్ట్ ఛాంపియన్‌షిప్ టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లను పడగొట్టిన టాప్-5 బౌలర్ల లిస్ట్ ప్రిపేర్ అయింది. వారు పడగొట్టిన వికెట్ల ఆధారంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ దీన్ని రూపొందించింది. ఈ జాబితాలో టీమిండియా తరఫున ఒకే ఒక్కడు చోటు దక్కించుకున్నాడు.. ఆ ఒక్కడే- రవిచంద్రన్ అశ్విన్.

టాప్‌లో పాట్ కమ్మిన్స్

టాప్‌లో పాట్ కమ్మిన్స్

ఈ లిస్ట్‌లో అగ్రస్థానంలో ఆస్ట్రేలియన్ పేస్ బౌలర్ పాట్ కమ్మిన్స్ నిలిచాడు. మొత్తం 70 వికెట్లను పడగొట్టాడా స్పీడ్ స్టర్. ఈ టోర్నీలో 14 మ్యాచ్‌లను ఆడిన కమ్మిన్స్ 21.02 యావరేజ్‌తో 70 వికెట్లు తీసుకున్నాడు. అతని స్ట్రైక్ రేట్ 47.6. ఈ టోర్నమెంట్ మొత్తం మీద స్థిరంగా రాణించాడు.

ఒకే ఒక్కసారి అయిదు వికెట్లను పడగొట్టాడు. 28 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు తీసుకున్నాడు. రెండో స్థానంలో ఇంగ్లాండ్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ నిలిచాడు. 17 మ్యాచ్‌లను ఆడిన స్టువర్ట్ 69 వికెట్లు తీసుకున్నాడు. అతని యావరేజ్ 20.08. 43.4 స్ట్రైక్ రేట్. ఓ మ్యాచ్‌లో ఆరు వికెట్లు తీసుకున్నాడు. స్టువర్ట్ బ్రాడ్ బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 6/31.

మూడోస్థానంలో అశ్విన్..

మూడోస్థానంలో అశ్విన్..

ఈ టోర్నమెంట్‌లో టీమిండియా ఏస్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మూడోస్థానంలో నిలిచాడు. 13 మ్యాచుల్లో 67 వికెట్లు తీసుకున్నాడు. ఓ మ్యాచ్‌లో ఏడు వికెట్లను తీసుకున్నాడు. ఒకే మ్యాచ్‌లో ఏడు వికెట్లు తీసుకున్న ఏకైక బౌలర్ కూడా అతనొక్కడే. 145 పరుగులు ఇచ్చి ఏడుమంది బ్యాట్స్‌మెన్లను పెవిలియన్ దారి పట్టించాడతను.

ఈ టోర్నీలో ఇప్పటిదాకా అశ్విన్ యావరేజ్ 20.88గా రికార్డయింది. స్ట్రైక్ రేట్ 46.9. టీమిండియా ఈ టోర్నమెంట్‌ ఫైనల్‌కు చేరినందున.. రవిచంద్రన్ అశ్విన్ ఆ మ్యాచ్ ఇంకా ఆడాల్సి ఉంది. ఫలితంగా- అతని బౌలింగ్ ఫిగర్స్ మరింత మెరుగుపడతాయనడంలో సందేహాలు అక్కర్లేదు. చెన్నైలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టులో సెంచరీ కూడా బాదేశాడు.

చివరి రెండు స్థానంలో వారిద్దరూ..

చివరి రెండు స్థానంలో వారిద్దరూ..

టాప్-5 చివరి రెండు స్థానాల్లో ఆస్ట్రేలియన్ స్పిన్నర్ నాథన్ లియాన్, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ నిలిచారు. టోర్నమెంట్ మొత్తం మీద 14 మ్యాచ్‌లను ఆడిన లియాన్ 56 వికెట్లు తీసుకున్నాడు. అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్ 6/49. యావరేజ్ 31.37, స్ట్రైక్ రేట్ 67.5 రికార్డయింది. కివీస్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ 51 వికెట్లతో అయిదో స్థానంలో నిలిచాడు. అతను ఆడింది 10 మ్యాచ్‌లే. 32 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లు తీసుకున్నాడీ కివీస్ బౌలింగ్ స్టార్. యావరేజ్ 20.66 కాగా.. స్ట్రైక్ రేట్ 45.9గా నమోదైంది.

Story first published: Friday, May 28, 2021, 12:44 [IST]
Other articles published on May 28, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+