Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final గిల్‌ను కోహ్లీతో పోల్చకూడదు.. సచిన్‌తో పోల్చాలి: కైఫ్

ప్రస్తుతం టీమిండియాలో సూపర్ ఫామ్‌లో ఉన్న ప్లేయర్ శుభ్‌మన్ గిల్. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో కూడా గిల్ అదరగొట్టాడు. ఈ క్రమంలో చాలా మంది గిల్‌ను టీమిండియా స్టార్ విరాట్ కోహ్లీతో పోల్చడం మొదలు పెట్టారు. అయితే ఈ పోలిక సరైంది కాదని మాజీ దిగ్గజం మహమ్మద్ కైఫ్ అంటున్నాడు.

గిల్‌ను పోల్చాల్సింది కోహ్లీతో కాదని, ఏకంగా సచిన్‌తో అని కైఫ్ చెప్పాడు. 'సచిన్ కూడా చాలా ఆర్గనైజ్డ్ బ్యాటర్. సచిన్, విరాట్‌ ఇద్దరిలో పోలిస్తే.. కోహ్లీ బ్యాటింగ్‌లో కొన్ని లోపాలు ఉంటాయి. తను 2014లో ఇంగ్లండ్ వెళ్లినప్పుడు ఫామ్‌లో లేడు. ఆఫ్‌స్టంప్ ఆవలగా బంతులు వేస్తూ కోహ్లీని జేమ్స్ ఆండర్సన్ బాగా ఇబ్బంది పెట్టాడు. ఆ సిరీస్‌లో కోహ్లీ పూర్తిగా ప్లాప్ అయ్యాడు' అని కైఫ్ చెప్పాడు.

 WTC Final Shubman Gill needs to be compared to Sachin Tendulkar not Virat Kohli

'అదే గిల్ టెక్నిక్ చూస్తే సచిన్‌తో పోలికలు కనిపిస్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో అతన్ని అవుట్ చేయడం చాలా కష్టం. గిల్ ఆటలో అసలు బలహీనతే ఉన్నట్లు కనిపించడం లేదు. విరాట్, సచిన్ ఇద్దరూ లెజెండ్స్. నేను వాళ్లిద్దరితో కలిసి ఆడా. కానీ కోహ్లీకి కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఈ విషయంలో సచిన్ మార్గంలో గిల్ నడుస్తున్నాడు. టెక్నిక్, మానసిక బలం రెండూ గిల్‌కు బాగున్నాయి' అని కైఫ్ వివరించాడు.

డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం గిల్ ప్రస్తుతం ఇంగ్లండ్ వెళ్లిన సంగతి తెలిసిందే. తన ఆటను నిరంతరం మెరుగు పరుచుకుంటున్నాడని గిల్‌ను కైఫ్ కొనియాడాడు. 'ఏడాది నుంచి గిల్‌ను నేను క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తున్నా. మ్యాచ్‌ మ్యాచ్‌కూ అతని ఆట మెరుగవుతోంది. అంతకుముందు తను పేస్‌ బాగా ఆడుతున్నాడని, కానీ స్పిన్‌ ఆడలేకపోతున్నాడని అనుకున్నా. ఆ తర్వాత స్పిన్ ఎదుర్కోవడం తను నేర్చుకున్నాడు. ఆ సమయంలో ఫుట్‌వర్క్ సరిగా లేదు కదా అనుకున్నా.. అప్పుడే ఆ విషయంలో కూడా మెరుగయ్యాడు' అని కొనియాడాడు.

Story first published: Sunday, June 4, 2023, 22:05 [IST]
Other articles published on Jun 4, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+