Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final: పాకిస్థాన్‌పైనే భారత్ ఆశలన్నీ!

వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. దక్షిణాఫ్రికా అనూహ్యంగా పుంజుకోవడం‌తో భారత్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్‌కు గురికావడంతో పాటు సౌతాఫ్రికా సంచలన ప్రదర్శన టీమిండియా అవకాశాలను దెబ్బతీసింది. మరోవైపు ఆస్ట్రేలియాకు ఫైనల్ దారి అంత ఈజీగా లేదు. శ్రీలంక కూడా పోటీలో ఉండటంతో సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.

ఈ డబ్ల్యూటీసీలో సౌతాఫ్రికా ఓ దశలో పోటీలోనే లేదు. తొలి అయిదు మ్యాచ్‌ల్లో ఒక్క విజయమే సాధించి రేసులో ఎంతో వెనుకబడింది. కానీ ప్రస్తుతం 63.33 విజయశాతంతో టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఫైనల్ బెర్తును ఖరారు చేసుకోవడానికి దక్షిణాఫ్రికాకు కావాల్సింది మరో విజయం మాత్రమే. సొంతగడ్డపై పాకిస్థాన్‌తో సౌతాఫ్రికా రెండు టెస్టులు ఆడాల్సి ఉంది. అయితే దక్షిణాఫ్రికా రేసు నుంచి నిష్క్రమించే ప్రమాదం కూడా ఉంది.

WTC Final Scenarios Analyzing India s Chances for Qualification

పాకిస్థాన్‌తో జరగనున్న సిరీస్‌ను 1-1తో ముగిస్తే దక్షిణాఫ్రికా 61.11 %తో ముగిస్తుంది. ఈ సందర్భంలో సౌతాఫ్రికాను ఆస్ట్రేలియా లేదా భారత్‌లలో ఒక జట్టు అధిగమించగలదు. అయితే పాక్‌తో రెండు టెస్టులను డ్రా చేసుకుంటే..58.33 %తో ముగిస్తుంది. ఈ సందర్భంలో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. ఆస్ట్రేలియాను భారత్ 3-2తో ఓడించి, శ్రీలంకను ఆస్ట్రేలియా 2-0తో ఓడిస్తే... సౌతాఫ్రికాను దాటి ఆసీస్, టీమిండియా ఫైనల్స్‌కు చేరుతాయి.

పాకిస్థాన్‌తో జరిగే సిరీస్‌‌ను 1-0తో కోల్పోతే దక్షిణాఫ్రికా దాదాపు నిష్క్రమించినట్లే. అయితే ఆస్ట్రేలియా తమ మిగిలిన అయిదు టెస్టుల్లో (భారత్‌తో మూడు, శ్రీలంకతో రెండు) రెండు కంటే ఎక్కువ విజయం సాధించకుండా, భారత్ మిగిలిన మూడు టెస్టుల్లో ఒక్క విజయం- ఒక్క డ్రా కంటే ఎక్కువ సాధించకుండా ఉంటే సౌతాఫ్రికాకు ఫైనల్ చేరే అవకాశాలు ఉంటాయి. కాగా, ఈ నేపథ్యంలో భారత్‌కు ఫైనల్ అవకాశాలు మరింత మెరుగవ్వాలంటే.. ఆస్ట్రేలియాపై సిరీస్ నెగ్గడంతో పాటు పాకిస్థాన్ విజయం సాధిస్తే పని తేలిక అవుతుంది.

ఇక సౌతాఫ్రికా ఫలితంతో సంబంధం లేకుండా భారత్ నేరుగా ఫైనల్‌ చేరాలంటే మిగిలిన మూడు టెస్టుల్లో ఆస్ట్రేలియాను ఓడించాలి. లేదా రెండింట్లో నెగ్గి, ఒక్క మ్యాచ్‌ను డ్రాగా ముగించాలి. ఒకవేళ బోర్డర్ గవాస్కర్ సిరీస్‌ను 2-2తో డ్రాగా ముగిస్తే శ్రీలంకపై ఆధారపడాల్సి ఉంటుంది. ఆసీస్‌ను లంక 2-0తో వైట్‌వాష్ చేయాలి లేదా రెండు మ్యాచ్‌లను డ్రాగా ముగించాలి. ఈ సందర్భంలో భారత్ ముచ్చటగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు చేరుతుంది. కాగా, ప్రస్తుతం భారత్ 57.29 విజయశాతంతో మూడో స్థానంలో ఉంది.

Story first published: Tuesday, December 10, 2024, 9:56 [IST]
Other articles published on Dec 10, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+