For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

కెప్టెన్‌ అంటే ప్రశాంతంగా ఉండాలి.. దూకుడుగా కాదు! విరాట్ కోహ్లీ కన్నా.. అతడే సరైనోడు! మార్చేయండి: సల్మాన్‌

WTC Final: Salman Butt feels Rohit Sharma is a better captain than Virat Kohli

కరాచీ: ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో టీమిండియా ఓటమిపాలవడంతో కెప్టెన్ విరాట్ కోహ్లీపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మెగా ఫైనల్లో న్యూజిలాండ్ 8 వికెట్ల తేడాతో నెగ్గి విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా చెత్త ప్రదర్శనకు కోహ్లీ కెప్టెన్సీనే కారణమని అభిమానులతో సహా మాజీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే కోహ్లీ కెప్టెన్సీపై వేటు వేసి.. రోహిత్ శర్మకు జట్టు పగ్గాలు అందించాలని సోషల్ మీడియా వేదికగా ఫాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మాజీలు సైతం కోహ్లీ-రోహిత్ కెప్టెన్సీల మధ్య తేడాను చెపుతూ.. హిట్‌మ్యాన్‌కు బాధ్యతలు అప్ప్పగించాల్సిన సమయం వచ్చేసిందంటున్నారు.

రోహిత్ మెరుగైన కెప్టెన్‌:

రోహిత్ మెరుగైన కెప్టెన్‌:

పాకిస్థాన్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ సల్మాన్‌ బట్‌ కూడా విరాట్ కోహ్లీ కన్నా.. రోహిత్ శర్మనే కెప్టెన్సీకి సరైనోడు అని అభిప్రాయపడ్డాడు. తాజాగా సల్మాన్‌ తన యూట్యూబ్‌లో మాట్లాడుతూ... 'విరాట్‌ కోహ్లీ కన్నా రోహిత్ శర్మనే మెరుగైన కెప్టెన్‌ అని నా వ్యక్తిగత అభిప్రాయం. 2018 ఆసియాకప్‌ సందర్భంగా రోహిత్‌లోని నాయకత్వ లక్షణాలను దగ్గరనుంచి గమనించా. ఆ టోర్నీలో తాత్కాలిక కెప్టెన్‌గా ఉన్న అతడు చాలా సహజంగా జట్టును నడిపించాడు. కోహ్లీ సారథ్యంలో భారత్ గత ఐదేళ్లుగా టెస్టుల్లో అగ్రస్థానంలో కొనసాగింది. అయినా దురదృష్టంతో కీలక మ్యాచ్‌లో ఓటమిపాలైంది. అలాంటప్పుడు ప్రజలు కూడా అతడి కెప్టెన్సీని ప్రశ్నిస్తారు. ఎంత మంచి కెప్టెన్‌ అయినా పెద్ద టోర్నీల్లో విజయం సాధించకపోతే ప్రజలు గుర్తించరు' అని అన్నాడు.

అత్యుత్తమ కెప్టెన్‌ అంటే:

అత్యుత్తమ కెప్టెన్‌ అంటే:

'ఎంత మంచి కెప్టెన్‌కైనా అదృష్టం కలిసిరావాలి. కెప్టెన్‌ దగ్గర సరైన ప్రణాళికలు ఉన్నప్పుడు.. బౌలర్‌ అందుకు అనుగుణంగా బౌలింగ్‌ చేయకపోతే ఉపయోగం లేదు. కొన్నిసార్లు కెప్టెన్‌ సరిగ్గా లేకున్నా.. ఆటగాళ్లు బాగా ఆడి జట్టును గెలిపిస్తే కెప్టెన్‌పై ప్రభావం చూపదు. కానీ ప్రపంచానికి మాత్రం అత్యుత్తమ కెప్టెన్‌ అంటే పెద్ద టోర్నీలు సాధించడమే. కోహ్లీ ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టైటిల్‌ గెలవలేదు. అలానే ఐపీఎల్‌ ట్రోఫీ కూడా అతడి ఖాతాలో లేదు. కోహ్లీ మాత్రం టాప్‌ క్లాస్‌ క్రికెటర్‌. దూకుడు కలిగిన ఆటగాడు. శారీరకంగా ఎంతో దృఢంగా ఉంటాడు. మైదానంలో అడుగుపెడితే విజయం సాధించాలనే కసితోనే కనిపిస్తాడు' అని సల్మాన్‌ బట్‌ పేర్కొన్నాడు.

 కెప్టెన్‌ అంటే ప్రశాంతంగా ఉండాలి:

కెప్టెన్‌ అంటే ప్రశాంతంగా ఉండాలి:

'కెప్టెన్‌ అంటే ప్రశాంతంగా ఉండాలి. దూకుడుగా ఏమాత్రం ఉండకూడదు. టెస్టు ఛాంపియన్‌షిప్‌ సందర్భంగా కొన్ని కామెంట్లు వచ్చాయి. ఇది అగ్నికి (విరాట్ కోహ్లీ), ఐస్‌ ముక్కకి (కేన్ విలియమ్సన్‌) మధ్య పోటీ అని పలువురు అన్నారు. అయితే ఇప్పటివరకు పెద్ద కప్పులు సాధించిన సారథుల్లో చాలా మంది ప్రశాంతంగా ఉండేవాళ్లే ఉన్నారు. కానీ మైదానంలో విరాట్ కోహ్లీ హావభావాలు దూకుడుగా ఉంటాయి. అతడు ఏదైనా పెద్ద ట్రోఫీ సాధించి ఉంటే కచ్చితంగా ప్రజలు కొనియాడేవారు' అని పాకిస్థాన్‌ మాజీ బ్యాట్స్‌మన్‌ సల్మాన్‌ బట్‌ చెప్పుకొచ్చాడు. బట్‌ పాక్ తరఫున 33 టెస్టులు, 78 వన్డేలు, 24 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.

మాకొద్దు ఈ కెప్టెన్:

మాకొద్దు ఈ కెప్టెన్:

డబ్ల్యూటీసీ ఫైనల్లో తుది జట్టు ఎంపిక నుంచి మైదానంలో అనుసరించే వ్యూహాలు.. ఫీల్డింగ్ ప్లేస్ మెంట్స్, బౌలింగ్ మార్పులు ఇలా అన్నింటిలో విరాట్ కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడని, చెత్త బ్యాటింగ్‌తో జట్టు ఓటమికి కారణమయ్యాడని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కోహ్లీపై వేటు వేయాల్సిన సమయం వచ్చిందని కామెంట్ చేస్తున్నారు. ఐసీసీ ఈవెంట్లలో కెప్టెన్‌గా కోహ్లీ విఫలమయ్యాడని కామెంట్ చేస్తున్నారు. కోహ్లీ గొప్ప బ్యాట్స్‌మన్ కానీ.. గొప్ప కెప్టెన్ అయితే కాదంటున్నారు. WeWantNewCaptain అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.

Story first published: Sunday, June 27, 2021, 15:02 [IST]
Other articles published on Jun 27, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+