Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Final ఈ బౌలర్లతో చాలా డేంజర్.. టీమిండియా స్టార్లు మళ్లీ వీళ్ల బుట్టలో పడతారా?

డబ్ల్యూటీసీ ఫైనల్ పోరుకు భారత్, ఆస్ట్రేలియా జట్లు గట్టిగా రెడీ అవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి టెస్టు ట్రోఫీ తమ ఖాతాలో వేసుకోవాలని రెండు టీమ్స్ పట్టుదలగా ఉన్నాయి. ఈ క్రమంలోనే భారత్‌కు కోహ్లీ, పుజారా వంటి వారు చాలా కీలకం కానున్నారు. అదే సమయంలో వాళ్ల వికెట్లు తీసుకునే బౌలర్లు కూడా కంగారూల వద్ద ఉన్నారు. మరి డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఈ మినీ మ్యాచప్‌ల వివరాలు చూస్తే..

వార్నర్ వర్సెస్ అశ్విన్: టెస్టు క్రికెట్‌లో విధ్వంసకర ఓపెనర్లలో డేవిడ్ వార్నర్ ఒకడు. అతను 103 మ్యాచుల్లో 8158 పరుగులు చేశాడు. వీటిలో 25 సెంచరీలు, 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అదే సమయంలో భారత ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా టీమిండియాలో కీలకంగా ఉన్నాడు.

How will India stars face these Australian bowlers.

అతను 92 మ్యాచుల్లో 1133 పరుగులు చేయడంతోపాటు 474 వికెట్లు కూడా తీసుకున్నాడు. వీటిలో 32 సార్లు ఐదు వికెట్లతో ఆకట్టుకోగా, ఏడు సార్లు ఏకంగా పది వికెట్లు తనే తీశాడు. వార్నర్‌ను కూడా ఇప్పటి వరకు 11 సార్లు అవుట్ చేసిన ఘనత అశ్విన్‌ది. మరి డబ్ల్యూటీసీ ఫైనల్‌లో వీళ్లిద్దరిలో ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారో చూడాలి.

కోహ్లీ వర్సెస్ కమిన్స్: టెస్టు క్రికెట్‌లో లెజెండ్స్‌లో విరాట్ కోహ్లీ ఒకడు. అతను ఇప్పటి వరకు టెస్టుల్లో 28 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలతో 8416 పరుగులు చేశాడు. అదే సమయంలో ఆసీస్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా తక్కువేం కాదు. అతను ఇప్పటి వరకు 217 వికెట్లు తీసుకోవడంతోపాటు 4667 పరుగులు కూడా చేశాడు.

వీళ్లిద్దరూ ఎనిమిది మ్యాచుల్లో తలపడగా.. కోహ్లీని కమిన్స్ ఐదుసార్లు అవుట్ చేశాడు. అంతేకాదు, స్టార్క్ కూడా నాలుగు సార్లు కోహ్లీని పెవిలియన్ చేర్చాడు. ఇక కంగారూల ప్రధాన స్పిన్నర్ లియాన్ అయితే ఏకంగా ఏడుసార్లు కోహ్లీ వికెట్ తీసుకున్నాడు. వీళ్లను కోహ్లీ ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.

రోహిత్ వర్సెస్ స్టార్క్: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఎడం చేతి వాటం పేసర్లను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌ను అతను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా మారింది. స్టార్క్ ఇప్పటి వరకు టెస్టుల్లో 306 వికెట్లు తీసుకున్నాడు. వీటిలో 13 ఫైవ్ వికెట్ హాల్స్ ఉండగా.. 10 సార్లు పది వికెట్లు తీసుకున్నాడు. అందుకని రోహిత్ కూడా తక్కువేం కాదు. అతను టెస్టుల్లో 9 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీల సాయంతో 3379 పరుగులు చేశాడు. వీళ్లిద్దరి మధ్య ఫైట్ కూడా చూసేందుకు చాలా ఆసక్తిగా ఉంటుంది.

పుజారా వర్సెస్ మర్ఫీ: టీమిండియా నయావాల్ ఛటేశ్వర్ పుజారా కూడా ఈ మ్యాచ్‌లో గట్టి పోటీ ఎదుర్కోబోతున్నాడు. అతని సహనాన్ని పరీక్షించేందుకు ఆసీస్ యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ రెడీ అవుతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మర్ఫీ బౌలింగ్ ఎదుర్కోవడంలో పుజారా కొంత తడబడ్డాడు. కోహ్లీని కూడా మర్ఫీ రెండుసార్లు బుట్టలో వేసుకున్నాడు.

మరి పుజారా ఈసారి అతన్ని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి. మర్ఫీని తక్కువ అంచనా వేస్తే పుజారా దెబ్బతినడం ఖాయమని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. అదే సమయంలో ఈ మ్యాచ్ కోసం గట్టిగా రెడీ అవుతున్నానని మర్ఫీ చెప్తున్నాడు. అతన్ని భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారో చూడాలి.

Story first published: Saturday, June 3, 2023, 16:44 [IST]
Other articles published on Jun 3, 2023
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+