
ఏం చేయాలో కోహ్లీకి బాగా తెలుసు:
తాజాగా రమీజ్ రాజా ఇండియా న్యూస్ స్పోర్ట్స్ ఛానెల్‌లో మాట్లాడుతూ... 'బంతిని ఆలస్యంగా ఆడుతున్నప్పుడు విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌ను గమనించాను. లెగ్‌సైడ్ వైపు లైన్‌కు అడ్డంగా ఆడుతున్నాడు. దీంతో అతడి మణికట్టుపై ఒత్తిడి పడుతోంది. అతడు క్రీజ్‌లో తన పొజిషన్‌లో ఉండి స్ట్రెయిట్‌గా ఆడాలి. తనదైన శైలిలో ఫ్లిక్స్ ఆడితే చాలు. అప్పుడు ఎలాంటి సమస్య ఉండదు. ఏదేమైనా ఏం చేయాలో కోహ్లీకి బాగా తెలుసు. అందుకే అతడి బ్యాటింగ్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' అని అన్నాడు. కోహ్లీ 2019, నవంబరు తర్వాత కనీసం ఒక్క సెంచరీ కూడా నమోదు చేయలేకపోయాడు.

స్ట్రెయిట్‌గా ఆడితే:
'కొన్నిసార్లు సెంచరీలు చేయకపోతే, పరుగులు రాకపోతే తమను తామే ఒత్తిడిలోకి నెట్టేసుకుంటారు. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్లో తొలి 20-25 ఓవర్లను విరాట్ కోహ్లీ స్ట్రెయిట్‌గా ఆడితే మణికట్టు బాగుంటుంది. ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో అతడు కచ్చితంగా రాణిస్తాడు. అంతేకాదు భారీ స్కోర్లు కూడా చేస్తాడు' అని రమీజ్ రాజా ధీమా వ్యక్తం చేశాడు. గురువారం సౌథాంప్టన్‌లో అడుగుపెట్టిన టీమిండియా ఆటగాళ్లు.. అక్కడే హోటల్‌లో మూడు రోజులు కఠిన క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఈ మూడు రోజులు ఆటగాళ్లు పూర్తిగా గదులకే పరిమితం కానున్నారు. ఆ తర్వాత నాలుగు రోజులు హోటల్ పరిసరాల్లో ప్రాక్టీస్‌కి అనుమతిస్తారు.

భారత్ ఫైనల్ చేరుకోవడంతోనే:
టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ను ఇప్పటిలా కాకుండా అన్ని జట్లతో ఆరు నెలల కాలంలో నిర్వహిస్తే బాగుంటుందని రమీజ్ రాజా సూచించాడు. ప్రేక్షకాదరణ పెరగాలంటే నూతన పద్ధతులను ప్రవేశపెట్టాలని సూచించారు. 'టెస్ట్ ఛాంపియన్‌షిప్ పూర్తిగా భిన్నమైన విండోలో నిర్వహించాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే టెస్ట్ క్రికెట్‌కు ఆదరణ, ఆసక్తి పెరగాలంటే సరికొత్త రీతిలో దీన్ని నిర్వహించడం మంచిది. ఛాంపియన్‌షిప్ సమయంలో మరే ఫార్మాట్ ఉండకూడదు. ఎందుకంటే ప్రస్తుతం అమలుపరుస్తున్న రెండేళ్ల సమయంలో ఎవరు ఎవరితో ఆడారో కూడా మరచిపోయే అవకాశం ఉంది. కేవలం భారత్ ఫైనల్ చేరుకోవడంతోనే ఆసక్తి పెరిగింది. న్యూజిలాండ్‌తో మరేదైనా జట్టు ఆడుతుంటే ఇంత క్రేజ్ ఉండేది కాదు' అని రమీజ్ స్పష్టం చేశాడు.

91 టెస్టుల్లో 7490 పరుగులు:
2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకూ 91 టెస్టులాడి 52.4 సగటుతో 7490 పరుగులు చేశాడు. ఇందులో 27 సెంచరీలు (7 డబుల్ సెంచరీలు), 25 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 254 వన్డేల్లో 59.1 సగటుతో 12169 రన్స్ బాదాడు. ఇందులో 43 సెంచరీలు, 62 అర్ధ శతకాలు ఉన్నాయి. ఇక 90 టీ20లలో 52.6 సగటుతో 3159 రన్స్ చేశాడు. మొత్తంగా అంతర్జాతీయ క్రికెట్‌లో 70 సెంచరీలు చేసిన కోహ్లీ.. 22 వేలకు పైగా పరుగులు చేశాడు.


Click it and Unblock the Notifications












